కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దాసుతో జ్యోత్స్న ఒట్టు- చూసేసిన శివ నారాయణ- మొదలైన అనుమానం- సీఈఓ పోస్టుపై నిర్ణయం-karthika deepam 2 serial today episode october 9th 2025 shivanarayana doubt on jyothsna star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దాసుతో జ్యోత్స్న ఒట్టు- చూసేసిన శివ నారాయణ- మొదలైన అనుమానం- సీఈఓ పోస్టుపై నిర్ణయం

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దాసుతో జ్యోత్స్న ఒట్టు- చూసేసిన శివ నారాయణ- మొదలైన అనుమానం- సీఈఓ పోస్టుపై నిర్ణయం

Sanjiv Kumar HT Telugu

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 9 ఎపిసోడ్‌లో పారిజాతం అడగడంతో శ్రీధర్ ఇంటికి శివనారాయణ, కార్తీక్ వెళ్తారు. అక్కడ దాసుతో జ్యోత్స్న తన తలమీద ఒట్టు వేయించుకుంటుంది. అది చూసిన శివ నారాయణ అడిగితే దాసు కవర్ చేస్తాడు. కానీ, దశరథ్‌తో తన అనుమానం గురించి చెప్పి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతాడు.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ, పారును కారులో గుడికి తీసుకెళ్తాడు కార్తీక్. ఇంత స్లోగా వెళ్లడమేంట్రా అని పారు అంటే ఫాస్ట్‌గా తీసుకెళ్తాడు కార్తీక్. దాంతో పారు శివనారాయణపై పడుతుంది. శివ నారాయణ తిడతాడు. శ్రీధర్ ఇంట్లో దాసు ఉన్నాడటగా, దారిలోనే ఇల్లు కదా. కారు ఆపురా అని కార్తీక్‌కు మెల్లిగా చెబుతుంది పారు.

కొడుకును చూడాలనుకుంటున్నావ్

మంతనాలు ఏంటీ అని శివ నారాయణ అంటే.. అదే విషయాన్ని బయటకు చెబుతాడు కార్తీక్. కొడుకును చూడాలనుకుంటున్నావ్. అంతేగా. సరే అని శివ నారాయణ అంటాడు. దాంతో పారిజాతం సంతోషిస్తుంది. శ్రీధర్ ఇంటికి వెళ్తుంటే అక్కడ దారిలో దాసుతో జ్యోత్స్న మాట్లాడటం చూసి కార్తీక్ షాక్ అవుతాడు. వాళ్లను శివ నారాయణ, పారుకు చూపిస్తాడు కార్తీక్.

దాసుతో జ్యోత్స్న మాట్లాడటం చూసి శివ నారాయణ, పారిజాతం షాక్ అవుతారు. ఎవరి బతికి ఉన్న లేకున్నా సరే. కానీ, నువ్వు మాత్రం ఈ నిజం ఎవరికి చెప్పొద్దు. చెబితే నా మీద ఒట్టే అని దాసుతో ఒట్టు వేయించుకుంటుంది జ్యోత్స్న. అది శివ నారాయణ, పారు, కార్తీక్ చూస్తారు. కొంప మునిగిపోయింది. ఎవరు చూడకూడదో వాళ్లే చూశారు. దొరికిపోయావే మనవరాలా అని పారిజాతం అంటుంది.

ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అని నిలదీస్తాడు శివ నారాయణ. ఇప్పుడు ఇరికిస్తాను అని ఆఫీస్‌కు అని చెప్పి ఇక్కడికి వచ్చారు. అది కూడా బయట దాసు మామ తల వేసి ఉందేంటీ అని అడుగుతాడు కార్తీక్. దాసు మామను ఏదో అడిగావ్. అది చెప్పకపోయేసరికి తల మీద ఒట్టు వేయించుకుంటున్నావ్ అంతేగా అని కార్తీక్ అంటాడు. కార్తీక్ జ్యోత్స్న ఆడుకుంటున్నట్లు ఉన్నాడని దాసు అనుకుంటాడు.

వణికిపోయిన జ్యోత్స్న

దాసును ఏం అడుగుతున్నావ్. కార్తీక్ చెప్పిందే నిజమా అని శివ నారాయణ నిలదీస్తాడు. జ్యోత్స్న చెప్పకపోవడంతో దాసును అడుగుతాడు శివ నారాయణ. చెప్పమంటావా జ్యోత్స్న అని దాసు అంటాడు. నన్ను అడుగుతాడేంటీ. దాసు నిజం చెబితే నా పరిస్థితి ఏంటీ అని జ్యోత్స్న వణికిపోతుంది. నేను జ్యోత్స్న గురించి చెప్పలేను. తను చెప్పొద్దని అందని దాసు అంటాడు.

ఏంటా నిజం. నా సహనాన్ని పరీక్షించొద్దు అని శివ నారాయణ కోపంతో ఊగిపోతాడు. దాసుకు, నాకు ఏదైనా సమస్య వస్తే మీలో మీరే కుంగిపోకుండా నాకు చెప్పమని అంది. తన సాయం తీసుకోకపోతే ఒట్టే అంది. అంతే సర్ అని దాసు అంటాడు. అది నమ్మిన శివ నారాయణ ఉంటాం దాసు. తర్వాత కలిసి మాట్లాడుకుందాం అని శివ నారాయణ అంటాడు. అంతా బయలుదేరుతారు.

దాసును జ్యోత్స్న కలిసింది దీపకు చెబుతాడు కార్తీక్. మనం మాట్లాడే మాటలకు భయపడి వెళ్లినట్టుంది. దాసు మామ ఇన్నిరోజులు నిజం చెప్పకుండా వాళ్ల అమ్మకోసం ఆగాడు. ఇప్పుడు మనకోసం ఆగుతున్నాడు. జ్యోత్స్న అయితే సగం చచ్చిపోయింది. తాతకు అనుమానం మొదలైంది. జ్యోత్స్న తలమీద దాసు మామ చేయి వేసుకోవడం తాత మైండ్‌లో నుంచి పోదు అని కార్తీక్ అంటాడు.

కార్తీక్, దీప రొమాన్స్

ఒకటి అవ్వగానే ఇంకో సమస్య. అమ్మను, నాన్నను కలుపుదామని చూసేలోపు ఇలా అయింది. కాస్తా భయం మొదలైంది అని దీప అంటే.. నేనున్నాగా. భయం అవసరం లేదని కార్తీక్ అంటాడు. మన గురించి చెప్పి నాలో ఉంటావా, నాతో ఉంటావా అని కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్‌ భుజంపై తల వాల్చి రొమాంటిక్‌గా పడుకుంటుంది దీప. ఇద్దరు ఒకే గ్లాసు పాలు తాగుతూ మురిసిపోతారు.

దీపకు ముద్దుపెడతాడు కార్తీక్. కార్తీక్‌కు దీప ముద్దు పెడుతుంది. దాసు, జ్యోత్స్న గురించి దశరథతో శివ నారాయణ మాట్లాడుతాడు. దాసు ఏదో చెప్పాడు కానీ నాకు నమ్మకం కుదర్లేదు. జ్యోత్స్న ప్రవర్తన వింతగా ఉంటుంది. కార్తీక్, దీప, దాసు గురించి ఆలోచిస్తుంది కానీ తన గురించి, కంపెనీ గురించి ఆలోచించట్లేదు అని శివ నారాయణ అంటాడు.

ఈరోజు ఆఫీస్‌లో బోర్డ్ మెంబర్స్ మీటింగ్ ఉందిగా. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని శివ నారాయణ వెళ్లిపోతాడు. నాన్న ఏదో పెద్ద నిర్ణయమే తీసుకోబోతున్నాడు అని దశరథ్ అనుకుంటాడు. వాళ్ల మాటలు విన్న పారు, జ్యో బయటకెళ్లి మాట్లాడుకుంటారు. నేను దాసు కూతురు అని బావకు తెలిసిపోయింది జ్యో అంటే వాడు ఏదోటి వాగుతుంటాడు. తెలియలేదు అని పారు అంటాడు.

పెళ్లి చేసుకో బయటపడతావ్

నిజం ఎక్కువ రోజులు దాగలేదు. నిజం తెలిసిన నీకు నష్టం కలగకుండా ఉండాలంటే నువ్వు ఒకటి చేయాలి. పెళ్లి చేసుకోవాలి అని పారిజాతం అంటుంది. బావ రెడీ అంటే కట్టించుకుంటాను అని జ్యోత్స్న అంటుంది. పెళ్లి చేసుకుని మరో ఇంటికి వెళ్తే నీ ఆస్తి నీకు వస్తుందే అని పారిజాతం అంటుంది. బావను తప్పా ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఇప్పుడు ఆలోచించాల్సింది పోస్ట్ గురించి అని జ్యో అంటుంది.

అది కూడా పోయేలా ఉందని పారు అంటే.. ఏది పోనివ్వను. నాకు కావాల్సిన దాన్ని ఎలా దక్కించుకోవాలో తెలుసు అని జ్యోత్స్న అంటుంది. అసలైన వారసురాలు ఎవరో తెలిసిపోయేలా ఉంది. దీని ఆవేశం చూస్తే దీని పోస్టు ఇదే పీకేసుకునేలా ఉందని పారు అనుకుంటుంది. బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. కార్తీక్ బయట ఉంటాడు. రెస్టారెంట్ నష్టాల గురించి దశరథ్ చెబుతాడు.

ఈ నష్టాల నుంచి బయటపడటానికి సీఈఓగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని జ్యోత్స్న అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం