కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌ను 2 కోరికలు కోరిన శివ నారాయణ- మళ్లీ సీఈఓగా కార్తీక్- తల్లిదండ్రులను కలపనున్న జ్యో-karthika deepam 2 serial today episode october 13th 2025 karthik promise to shivanarayana star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌ను 2 కోరికలు కోరిన శివ నారాయణ- మళ్లీ సీఈఓగా కార్తీక్- తల్లిదండ్రులను కలపనున్న జ్యో

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌ను 2 కోరికలు కోరిన శివ నారాయణ- మళ్లీ సీఈఓగా కార్తీక్- తల్లిదండ్రులను కలపనున్న జ్యో

Sanjiv Kumar HT Telugu

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్‌లో కార్తీక్ చేయిని తన గుండెలకు హత్తుకుని రెండు కోరికలు కోరుతాడు శివ నారాయణ. దానికి కార్తీక్ ఒప్పుకుంటాడు. ఆ మాటలు జ్యోత్స్న వింటుంది. జ్యోత్స్న వినడం దీప చూస్తుంది. దీప మాట్లాడే మాటలకు జ్యోత్స్న వణికిపోతుంది. కాశీని బిజినెస్‌లు చూసుకోమ్మని శ్రీధర్ చెబుతాడు.

కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 13వ తేది ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నా వైపు ఉండి యుద్ధం చేస్తావా. కత్తి మనిషి అయితే ఎలా ఉండాలో అలా ఉండాలి. నీలా ఉండాలి. ఈ తాత నిన్ను రెండు కోరికలు కోరుతున్నాడు. తీరుస్తావా అని చేయి ఇస్తాడు శివ నారాయణ. ఇదే చేత్తో ముద్దు చేశావ్. ఎన్నో చేశావ్. నీకు మాట ఇవ్వలేన తాత అని మాటిస్తాడు కార్తీక్.

శివ నారాయణ రెండు కోరికలు

కార్తీక్ చేయిని గుండెకు హత్తుకుని ఈ ఒక్క మాటతో నేను బతకడానికి కావాల్సినంత బలాన్ని ఇచ్చావురా అని శివ నారాయణ అంటాడు. నా మొదటి కోరిక.. ఈరోజు బోర్డ్ మెంబర్స్ ముందు కార్తీక్ మన కంపెనీలోనే ఉంటాడు అని నేను చెప్పిన మాటని నువ్వు నిజం చేయాలి అని శివ నారాయణ అంటే.. అదేలా సాధ్యం తాత. నేను మీ డ్రైవర్‌ను అని కార్తీక్ అంటాడు.

సాధ్యమయ్యేలా నేను చేస్తాను కదరా అని శివ నారాయణ అంటే సరే అంటాడు కార్తీక్. మీ అత్తమామల దూరం తగ్గిపోవాలి. వారిని ఇనుపటిలా చూడాలి. వాళ్లిద్దరిని నువ్వే కలపాలి అని శివ నారాయణ అంటాడు. నేను ప్రయత్నించిన ప్రతిసారి మరింత దూరం పెరుగుతుంది అని కార్తీక్ అంటాడు. నువ్వు అనుకుంటే చేయగలవు. వాళ్లిద్దరు కలవాలని నేను సంకల్పించుకున్నాను. ఇకనుంచి ఆ సంకల్పం నీది అని శివ నారాయణ అంటాడు.

ఆ మాటలు జ్యోత్స్న వింటుంది. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ సామ్రాజ్యాన్ని స్థాపించాను. అది కూలిపోకుండా నువ్వే కాపాడాలి. నువ్వు చేయగలవని నాకు నమ్మకం ఉంది అని శివ నారాయణ అని వెళ్లిపోతాడు. చాలా పెద్ద బాధ్యతను సింపుల్‌గా చేతిలో పెట్టి వెళ్లిపోయావ్ తాత. నీ రెండు కోరికలు నేను తీరుస్తాను. ఎందుకంటే ఇది నా కుటుంబం అని కార్తీక్ అంటాడు.

ట్విస్టుల మీద ట్విస్టులు

అదంతా చూసిన జ్యోత్స్న చాలా పెద్ద బాధ్యత తీసుకున్నావ్ కదా బావ అని అంటే.. జ్యోత్స్న భుజాలపై దీప చేయి వేస్తుంది. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతాయి. వాళ్ల మాటలు చాటుగా ఎందుకు వింటున్నావ్ అని దీప అంటే.. నాకు అంత అవసరం ఏముంది. పని మనిషిలా ఉండు అని జ్యోత్స్న అంటుంది. అయితే, నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని దీప అంటుంది.

మరోవైపు మీరేమైనా చిన్న పిల్లలా. భోజనానికి ప్రతిరోజు పిలవాలా అని స్వప్నపై కోప్పడతాడు శ్రీధర్. స్వప్న, కాశీల గొడవ గురించి శ్రీధర్ మాటలు అంటాడు. ఈరోజు వీటికి పరిష్కారం చూడాలని శ్రీధర్ అంటాడు. కాశీ వస్తాడు. నేను ఇంట్లోంచి వెళ్లిపోతాలే మావయ్య అని కాశీ అంటాడు. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. జాబ్ ఎందుకు మన బిజినెస్‌లు చూసుకో అని శ్రీధర్ అంటాడు.

నాకు ఇంట్రెస్ట్ లేదు మావయ్య. అనవసరంగా మీకు నష్టాలు తీసుకొచ్చి మీతో తిట్లు తినలేను అని కాశీ అంటాడు. నీ బాధ నాకు అర్థమైంది అల్లుడు. కానీ, మా బాధ అర్థం చేసుకోవట్లేదు. రేపటి సాయంత్రం వరకు జాబ్ వస్తే సరే. లేకుంటే ఎల్లుండి ఉదయం నుంచి మన బిజినెస్‌లు చూసుకో. నేను అమ్మాయి తోడుగా ఉంటాం. ఇప్పుడు అయితే భోజనం చేద్దాం దా అని శ్రీధర్ అంటాడు.

చేతకాని పనులు చేయకూడదు

దాంతో అంతా భోజనానికి కూర్చొంటారు. మరోవైపు ఏదో మాట్లాడాలని అన్నావని జ్యో సోఫాలో కూర్చుని అంటే.. ఇలా కాదు కూర్చుని మాట్లాడతా అని జ్యో పక్కనే దీప కూర్చొంటుంది. దాంతో జ్యో లేచి నా ముందే కూర్చోడానికి ఎంత ధైర్యం అని అంటే.. కూర్చోడానికి కావాల్సింది కుర్చీ అని దీప అంటుంది. మీరు చేతకాని పనులు చేయకండి అని దీప అంటుంది.

నువ్వు ఉన్న ప్లేస్‌కు నువ్వు ఇచ్చే సలహా కాదని జ్యో అంటే.. మీరున్న ప్లేస్ మీది కాదు అమ్మాయి గారు. ఆ ప్లేస్‌కు మీకు అర్హత ఉందా అని దీప అంటుంది. దీపకు నిజం తెలిసిపోయింది. నాకున్న అర్హతలేంటో చెబుతుంది అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. దాంతో దీప మాట్లాడుతూనే ఉంటుంది. ఇది మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదు ఏంటీ. తెలియకుండానే నాలో భయం మొదలైందేంటీ అని జ్యోత్స్న అనుకుంటుంది.

నాకు అర్హత లేకపోవడం ఏంటీ అని జ్యోత్స్న అంటుంది. రెస్టారెంట్‌కు సీఈఓగా ఉండే అర్హత లేదంటున్నాను అని దీప అంటుంది. దీనికి నిజం తెలియలేదు. అనవసరంగా నేనే భయపడ్డాను అని జ్యో అనుకుంటుంది. నువ్వు నాకు సలహాలు ఇవ్వకు. గట్టిగా మాట్లాడితే నీకు ఏ ప్లేస్‌ లేకుండా చేస్తాను అని జ్యో అంటుంది. నేను ఉండాల్సిన ప్లేసులోనే నేను ఉన్నాను. కానీ, మీరే లేరు. నాకు కాదు మీ ప్లేస్ పోకుండా చూసుకోండి అని దీప స్వీట్ వార్నింగ్ ఇస్తుంది.

పారిజాతం ఐడియా

ఇది ఎలా మాట్లాడుతుంది అని జ్యోత్స్న వణికిపోతుంది. దీప అనుమానంగా మాట్లాడింది పారిజాతంకు చెబుతుంది జ్యోత్స్న. ఆఫీస్‌లో తాత, నాన్న దగ్గర, ఆఖరికి పనిమనిషి దీప చేతిలో కూడా పరువు పోయింది అని పారు అంటుంది. దీప, కార్తీక్ మాట్లాడుతుంటే నా పుట్టుక గురించి తెలిసిపోయిందేమో అని భయంగా ఉందని జ్యో అంటుంది. నువ్వు వాళ్ల గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించుకో. మంచి కుర్రోడిని చూసి పెళ్లి చేసుకో అని పారు అంటుంది.

నేను సీఈఓగా రిజైన్ చేయడమంటే దానికంటే ముందు నేను చావడం నయం అని జ్యోత్స్న అంటుంది. దీన్ని నువ్వు ఆపాలంటే ముందు ఓ పని చేయాలి అని పారు చెబుతుంది. కట్ చేస్తే కార్తీక్, దీప స్కూటికి కారుతో ఎదురొస్తుంది జ్యోత్స్న. కార్తీక్‌తో పర్సనల్‌గా మాట్లాడాలి అని జ్యో అంటే నేను పంపించను. నేనిప్పుడు పని మనిషిని కాదు అని దీప అంటుంది.

మా ఆవిడ పర్మిషన్ ఇవ్వకుండా నేను వెళ్లను అని కార్తీక్ అంటాడు. దీపను జ్యోత్స్న అడుగుతుంది. అయినా దీప ఒప్పుకోదు. కార్తీక్ ఒప్పుకోమన్న దీప ఒప్పుకోదు. కార్తీక్ దీపను బతిమిలాడుతుంటే మీ సరసాలు ఆపుతారా. రా బావా అని జ్యో వెళ్లి కారులో కూర్చొంటుంది. కార్తీక్, జ్యో బయట రెస్టారెంట్‌కు వెళ్లి జ్యూస్ తాగుతుంటారు. నేను సీఈఓగా ఉండాలంటే నీ సపోర్ట్ కావాలి అని జ్యో అంటుంది.

నెక్ట్స్ సీఈఓ కార్తీక్

దానికి ఏ సంబంధం లేని నా సపోర్ట్ దేనికి అని కార్తీక్ అంటాడు. తాత మాటలు నేను విన్నాను బావ. నా గెస్ కరెక్ట్ అయితే నెక్ట్స్ సీఈఓ నువ్వే. మీ మాటలు విన్నా అని చెబితే నువ్వు అలర్ట్ అవుతావ్. అది తెలియకుండానే చేయించాలి అని జ్యోత్స్న అంటుంది. దీనికంటే పెద్ద సమస్య ఉంది. మీ అమ్మ నాన్న మాట్లాడుకోవట్లేదు అని కార్తీక్ అంటాడు.

ఇప్పుడు మమ్మీ డాడీని కలిపితే నాకు సపోర్ట్ చేస్తావా అని ఇంటికి వెళ్లిపోతుంది. ఇంటికెళ్లి మీరు ఇలా ఉండటం నాకు నచ్చట్లేదు అని దశరథ్, సుమిత్రను పక్క పక్కన పెట్టి ఉంచి మాట్లాడుతుంది జ్యోత్స్న. అక్కడికి కార్తీక్ వస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం