కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ్ తనకు గొడవ ఉందని, నువ్వు అడ్డు రావొద్దని కార్తీక్‌తో వైరా అంటాడు. అడ్డొస్తే నువ్వు ఎక్కిన కారు లారి గుద్దొచ్చు. నీ ఫ్యామిలీకి ఏమైనా జరగొచ్చు. నీకు చిన్న కూతురు ఉందని విన్నాను. మనం చేసే పనులకు కుటుంబం ఎఫెక్ట్ అవ్వొద్దుగా అని వైరా వార్నింగ్ ఇస్తాడు.
నిన్ను చూసి నలుగురు భయపడినట్లు అందరూ అలాగే ఉంటారనుకుంటున్నావ్. నాలాంటి వాడు నీకు ఇంకా తగల్లేదు. నా కూతురు గురించి మాట్లాడావు కదా. ఊరిలో ముందుగా పోతురాజు విగ్రహం పెడతారు. ఊరి జోలికి రాకూడదని వార్నింగ్ అది. నా కుటుంబానికి నేను పోతురాజ్‌ను. నా కూతురు జోలికి వస్తే కత్తితో ఏస్తాను. నేను డ్రైవర్‌ని కారును నడుపుతాను. కంపెనీని నడుపుతాను. అవసరం అయితే రెండు రిపేర్ చేస్తాను అని కార్తీక్ రివర్స్ వార్నింగ్ ఇస్తాడు.
వేలంలో నేను నష్టపోడానికి కారణం కూడా నువ్వే అని తెలుసుకున్నా. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అని వైరా అంటాడు. ట్రాన్స్‌ఫార్మర్‌కి డేంజర్ అని బోర్డ్ రాసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ట్రాన్స్‌ఫార్మర్ ముందే ఉన్నావ్. తెలియకుండా ఆట మొదలుపెట్టావ్. పది కోట్ల నష్టం. తెలిసి ఆడతనంటున్నావ్. ఈసారి డబ్బుతో నష్టం ఉండకపోవచ్చు. నేను రూల్స్ ఫాలో కాను ఆ రూల్స్ రాస్తాను అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
ఎవ్వరిని వదిలిపెట్టను వైరా అరుస్తాడు. మరోవైపు జ్యోత్స్న కలవడం గురించి దాసును అడుగుతాడు కాశీ. దాసు అబద్ధం చెబితే కాశీ నమ్మడు. జ్యోత్స్న అక్క ఎలాంటిదో నాకు తెలుసు. మనుషులను వస్తువుల్లా వాడుకుంటుంది. ఆ ట్రాప్‌లో నేను పడ్డాను. ఇప్పుడు నువ్వు అనుకుంటా. కానీ, జ్యోత్స్న అక్క నిన్ను చూసి భయపడటం ఏంటీ. తనతో ఏం మాట్లాడావ్ అని కాశీ అంటాడు.
ఏం లేదురా. మనిషికి ఏ పని లేకుంటే అన్ని ఇలా కంటపడతాయ్ అని దాసు అంటాడు. నువ్వు ఒక్కడివే అర్థం చేసుకున్నావ్ అనుకున్నా. కానీ, నువ్వు కూడా అందరిలా తయారయ్యావ్. ఈ ఇంట్లో నాకు విలువ లేదు. భార్య, మావయ్య విలువ ఇవ్వరు. జీతం రాకపోయేసరికి జీవితం లేకుండా పోయింది అని కాశీ అంటాడు. అలా కాదురా అని చెప్పిన దాసు నీ కోపం మనుషుల మీద కాదు జాబ్ మీద చూపించు అని తిడతాడు.
భార్యను, మామను ఆడిపోసుకోవడం కాదురా. వాళ్ల మంచితనం నీకు తెలియట్లేదు అని దాసు అంటాడు. నువ్వు మా మామలాగే ఆయన కొడుకును వదిలేసాడు. నువ్వు వదిలేశావ్. అనకూడదు కానీ నువ్వు కూడా చేతకాని తండ్రివే అని కాశీ అంటాడు. దాంతో కోపంతో దాసు చేయి ఎత్తుతాడు. కానీ, దాసు అని శ్రీధర్ అనేసరికి దాసు ఆగిపోతాడు.
నేను అంతా విన్నాను. ఇందులో నీ తప్పేం లేదు. అల్లుడు నోరు జారాడు. నువ్వు చేయి ఎత్తావ్. అల్లుడితో నేను మాట్లాడతాను నువ్వు వెళ్లు అని శ్రీధర్ అంటాడు.
జ్యోత్స్న వస్తుంది వెళ్తుంది. దాసు ఏం లేదని చెప్పినప్పుడు వదిలేయొచ్చుగా. దాసు చాలా మంచోడు. అలాంటి వాడికే నువ్వు కోపం తెప్పించావంటే నీ మాట ఎంత బాధపెట్టి ఉంటుంది. నాకోసం ఏం చేశావు నాన్న అడిగావ్ కదా. అలా ఎప్పుడు అడక్కు. దానికి దాసునే కాదు ఏ తండ్రి ఏం చెప్పలేడు. అది నీకు రేపు కొడుకు పుట్టాక వాడు అడిగితే కానీ అర్థం కాదు అని ఎమోషనల్‌గా చెబుతాడు శ్రీధర్.
ఇంకెప్పుడు మీ నాన్నను బాధపెట్టకు. మీ నాన్నకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని శ్రీధర్ వెళ్లిపోతాడు. మరోవైపు నెక్ట్స్ మీటింగ్‌లో నిన్ను సీఈఓగా వద్దంటే అంతకన్నా పరువు పోదు. నువ్వు సీఈఓగా రాజీనామా చేయు అని శివ నారాయణ అంటాడు. కంపెనీ అన్నాక నష్టాలు రావా. మీరు, బావ చేసినప్పుడు రాలేదా అని జ్యోత్స్న అంటుంది. నష్టాలు వచ్చాయి కానీ, గ్రాఫ్ పడిపోలేదు. నీ మీద బోర్డ్ మెంబర్స్‌కు నమ్మకం లేదని దశరథ్ అంటాడు.
మీరు వైరాను చూసి భయపడుతున్నారు అని జ్యోత్స్న అంటే లేదని శివ నారాయణ అంటాడు. కార్తీక్ చేసింది దశరథ్ మాట్లాడితే మీకు ఎప్పుడు కూతురు కంటే మేనల్లుడే ఎక్కువ. బావే గొప్పగా కనపడతాడు అని జ్యోత్స్న అంటుంది. అవును.. గొప్పగానే కనపడతాడు. మీరిద్దరు రెస్టారెంట్‌కు సీఈఓగా చేశారు. వైరా మన మీద పగ సాధించేందుకు కంపెనీలోకి వద్దామని చూస్తే నువ్వే ఏం చేశావ్. కార్తీక్ ఏం చేశాడు అని జరిగింది చెబుతాడు దశరథ్.
ఇప్పుడు అర్థమైందా నీకు వాడికి తేడా. నువ్వు వెంటనే రిజైన్ చేయు అని దశరథ్ అంటాడు. నేను చేయను. ఇంకో వారం ఉందిగా అని జ్యోత్స్న అంటుంది. అప్పుడు బోర్డ్ మెంబర్స్ సీఈఓను నిర్ణయిస్తారు. వాళ్లు నిర్ణయించిన వాళ్లే సీఈఓ అని శివ నారాయణ అంటాడు. పరువు పోగొట్టకుండా ఉండు అని దశరథ్ చెప్పి వెళ్లిపోతాడు. పరువు పోగొట్టుకోవడం కంటే పదవి పోగొట్టుకోవడం మంచిది అని సుమిత్ర చెబుతుంది.
మనవరాలా చాలా పెద్ద తప్పు చేశావ్. ఇప్పుడు పదవిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు అని పారిజాతం అంటుంది. మరోవైపు దాసుకు శ్రీధర్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇంకెప్పుడు కాశీతో ఆ విషయం మాట్లాడకు అని చెప్పిన శ్రీధర్ కార్తీక్ శివ నారాయణ ఇంట్లో డ్రైవర్‌గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా అని అడుగుతాడు. మనం ఊహించనిది ఏదో పెద్దది జరుగుతుంది అంటాడు.
అసలు నిన్ను అడగకూడదు అనుకున్నా. కానీ, తప్పట్లేదు. జ్యోత్స్న నిన్ను ఎందుకు కలిసింది. అంతా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెమైనా చెప్పు అని శ్రీధర్ అడిగితే తెలియదంటాడు దాసు. నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. నీ కూతురు పురిట్లోనే చనిపోయింది కదా. ఇక అప్పుడు ఎలా అని అడగలేదు. అసలు నీ కూతురు ఎలా చనిపోయింది అని శ్రీధర్ అడుగుతాడు.
నాకు కూడా తెలియదు బావ. నేను హాస్పిటల్‌కు వెళ్లే సరికి బిడ్డ చనిపోయినట్లు నాకు అమ్మ చెప్పింది. నేను కూడా చూడలేదు అని దాసు అంటాడు. నా కొడుకు ఇల్లు దాటి ఎందుకు వెళ్లట్లేదో నేనే కనుక్కుంటాను. నీకేమైనా తెలిస్తే చెప్పు అని శ్రీధర్ అంటాడు. బావకు అనుమానం మొదలైంది. ఇది ఇక్కడితో ఆగదు. నిజం తెలుసుకునేలా ఉన్నాడు అని దాసు అనుకుంటాడు.
మరోవైపు కార్తీక్‌తో నేను ఎప్పుడైనా భయపడటం చూశావా అని శివ నారాయణ అడుగుతాడు. నువ్వు కూడా చూసి ఉండవు అని కార్తీక్ అంటే.. కానీ, ఈరోజు చూశాను. నాలో భయాన్ని నేను మొదటి సారి చూశాను. మన శత్రువు మనకన్నా బలంగా మారి తల తీసుకెళ్తానంటే తీసుకెళ్లమంటా కానీ ఓటమిని ఒప్పుకోను. వైరా పది తలల రావణుడు. యుద్ధం చేయడానికి నా పక్కన దేవుడు లేడు. ధైర్యం ఉంది. ఆ ధైర్యం నువ్వే. నా పక్కన నిలబడతావా, నన్ను యుద్ధంలో గెలిపిస్తావా అని శివ నారాయణ అంటాడు.
ఏ హక్కుతో నిన్ను గెలిపించగలను అని కార్తీక్ అంటాడు. ఏ హక్కు ఉందని వైరా నుంచి మన కంపెనీ, షేర్స్‌ను కాపాడావ్. నేను వయసులో ఉన్నప్పుడు ఈ పోటీ నాకు భలే మజాగా ఉండేది. ఇప్పుడు ఈ బరువులన్నీ మోయలేను. నాకు సాలిడ్ ప్లేయర్ కావాలి. కత్తి మనిషి అయితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. నీలా ఉండాలి అని శివ నారాయణ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్