దీపకు దగ్గరుండి సేవలు చేస్తాడు కార్తీక్. తొందరగానే కోలుకుంటావని డాక్టర్ అన్నాడని దీపతో చెబుతాడు కార్తీక్. మీరు ఇంత జాగ్రత్తగా చూసుకుంటే తొందరగా కోలుకోకుండా ఎలా ఉంటానని దీప ఎమోషనల్ అవుతుంది.సుమిత్ర కూతురు దీప అంటూ దాసు చెప్పిన మాటలు పదే పదే కార్తీక్‌కు గుర్తొస్తుంటాయి. మీ అమ్మను నువ్వు చూశావా అని దీపను అడుగుతాడు కార్తీక్.
నేను పుట్టగానే మా అమ్మ చనిపోయిందట..పేరు అంబుజవల్లి అని దీప బదులిస్తుంది. అమ్మ ఫొటో ఉండేది. కానీ అత్తయ్య ఎక్కడో పడేసిందని దీప చెబుతుంది. దీప మాటలను చాటు నుంచి అనసూయ వింటుంది. అప్పుడు నాకు తలతిక్క ఉండేదని మనసులో అనుకుంటుంది.
నీ పుట్టుక గురించి మీ నాన్న నీకు ఏం చేప్పలేదా అని దీపను అడుగుతాడు కార్తీక్. నువ్వు కుబేర్ సొంత కూతురివేనా ప్రశ్నిస్తాడు. కార్తీక్ ప్రశ్నలతో అనసూయ షాకవుతుంది. దీప జన్మ రహస్యం గురించి దాసు...కార్తీక్‌కు ఏమైనా చెప్పాడా అని ఆలోచిస్తుంది. మీ నాన్న నిన్ను దత్తత తీసుకొని ఉండొచ్చుగా అని దీపతో అంటాడు కార్తీక్. అసలు ఎందుకిలా అడుగుతున్నారు? మీ అనుమానమేంటో చెప్పిండి అని కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది దీప.
చనిపోయిన మీ అమ్మనాన్నలకు పిండం పెడితే కాకి ముట్టలేదు. బతికున్నవాళ్లకు పిండం పెడితే కాకులు ముట్టవని ఓ సాధువు నీతో చెప్పారటగా...అసలు ఆ సాధువు ఎందుకు ఎలా చెప్పాడు...అతడు చెప్పిందే నిజమైతే? మీ అమ్మనాన్న వేరే అయితే అని దీపతో అంటాడు కార్తీక్. అసలైన అమ్మనాన్న ఎక్కడున్నారో నీకు తెలియాలిగా అని కార్తీక్ అంటాడు.
నీకు ఈ రోజు నిజం చెప్పకపోవచ్చు...కానీ ఏదో ఒక రోజు నువ్వు సుమిత్ర, దశరథ్‌ల కూతురివని నిజం చెబుతానని కార్తీక్ మనసులో అనుకుంటాడు. మా అమ్మ అంబుజవల్లి, మా నాన్న కుబేర్ అంతే అని దీప అంటుంది. దీప మనసును కార్తీక్ ఎక్కడ బాధపెడతాడో అని అనసూయ కంగారు పడుతుంది. పాల గ్లాస్‌తో లోపలికి అడుగుపెడుతుంది. టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
నీతో నా జీవితం అందమైన చందమామ కథలా ఉందని దీపతో కార్తీక్ అంటాడు. అన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలే ఉన్నాయని చెబుతాడు. ఈ చందమామకథలో ఎన్నో వింతలు దాగున్నాయని అంటాడు. ముందు నువ్వు నాకు భార్యవు అయ్యావు. ఆ తర్వాత ప్రాణదాత, మరదలు అని తెలిసింది. నీకు నిజం చెప్పకుండా ఆడుకోవడం సరదాగా ఉందని, బావగా నిన్ను మరింత ప్రేమగా చూసుకుంటానని అంటాడు. నువ్వు నా అత్త కూతురివని మనసులో అనుకుంటాడు.
దాసును చూడటానికి పారిజాతంతో కలిసి కాశీ ఇంటికి వస్తుంది జ్యోత్స్న. ఉన్నట్లుండి మీ నాన్నపై నీకు ఇంత ప్రేమ కలగడానికి కారణమేంటి అని జ్యోత్స్నను నిలదీస్తుంది పారిజాతం. నా మీద నీకు అనుమానం ఏంటి? ఒక్కగానొక్క మనవరాలిని నేను అడిగింది చేయకపోతే నువ్వు ఎందుకు అని పారిజాతంపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే నా బతుకు ఇలా తయారైందని చెబుతుంది. నీకేం మహారాణివి పారిజాతం అంటుంది. కార్తీక్‌తో అగ్రిమెంట్ రాయించుకొని గెలిచావు కదా అని అంటుంది.
నా దారిలో చాలా అడ్డంకులు ఉన్నాయని వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నానని దాసును ఉద్దేశించి మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నానమ్మ వచ్చిన విషయం స్వప్నకు చెబుతాడు కాశీ. మేము వచ్చింది మీ ఆవిడను చూడటానికి కాదని జ్యోత్స్న కోపంగా ఉంటుంది. మరి ఎందుకొచ్చారని జ్యోత్స్న వెటకారంగా అంటుంది. దీపతో సావాసం కదా...వంట భాష తప్ప మనుషులు మాట్లాడుకునే భాష రాదని స్వప్నపై విరుచుకుపడుతుంది పారిజాతం.
మా ఇంటికి ఎందుకొచ్చారని జ్యోత్స్న, పారిజాతంలను అడుగుతుంది స్వప్న. నా కొడుకును చూడటానికి అని పారిజాతం బదులిస్తుంది. ఏదైనా చుట్టం చూపే కదా అని స్వప్న వెటకారంగా మాట్లాడుతుంది. పర్మినెంట్‌గా ఇక్కడే ఉండిపొమ్మంటావా అని పారిజాతం కోపంగా బదులిస్తుంది.
అప్పుడు మా కాపురం రోజు రోడ్డు మీదే ఉంటుందని స్వప్న ధీటుగా సమాధానం ఇస్తుంది. మా గ్రానీ గయ్యాళిగంప అంటున్నావా అని జ్యోత్స్న కోపంగా అంటుంది.
ఆమె గయ్యాళిగంపో, ముళ్లకంపో అందరికి తెలుసు అని స్వప్న అనగానే తిట్ల దండకం మొదలుపెడుతుంది పారిజాతం. నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుగ తెగ్గొస్తాను అంటూ విరుచుకుపడుతుంది. నీ పెళ్లాం మీ నానమ్మను, అక్కను అన్నేసి మాటలు అంటుంటే ఒక్కటి పీకకుండా ఏం చేస్తున్నావని కాశీపై కోప్పడుతుంది. లేచిపోయి పెళ్లిచేసుకున్నదానికి నువ్వు బుద్ధి గురించి మాట్లాడుతున్నావా అని జ్యోత్స్న.
మాటలు మర్యాదగా రానీయ్ అని కాశీ అంటుంది. ఆ గొడవకు దాసు బయటకు వస్తాడు. కార్తీక్‌ను సపోర్ట్ చేస్తూ ఈ తిప్పులాడి తమను నానా మాటలు అంటుందని, వీడేమో ఆడాళ్ల సన్నాసి అంటూ స్వప్న, కాశీలపై తక్కువ చేసి మాట్లాడుతుంది జ్యోత్స్న. నా భర్తను అనే రైట్స్ నీకు లేవని పారిజాతానికి వార్నింగ్ ఇస్తుంది స్వప్న.
జ్యోత్స్నను చూసి దాసు షాకవుతాడు. తను ఎందుకు వచ్చిందని ఆలోచనలో పడతాడు. జ్యోత్స్న, పారిజాతానికి కాఫీ ఇవ్వమని స్వప్నతో అంటాడు కాశీ. పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వనని అంటాడు. నీకు అంత ప్రేమ కారిపోతుంటే నువ్వే ఇచ్చుకో అని అంటుంది. నాకు వాళ్ల మీద ప్రేమ లేదని కాశీ అంటాడు. ఎప్పుడు లేనిది జ్యోత్స్న ఎందుకొచ్చిందని కాశీ ఆలోచనలో పడతాడు.
గతం గుర్తుకురానట్లు కొన్నాళ్లు నటించమని కార్తీక్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు కాశీ. అలాగే నటించడం మొదలుపెడతాడు. కానీ జ్యోత్స్న మాత్రం అనుమానపడుతుంది. అతడికి గతం గుర్తొచ్చిందా లేదా అన్నది టెస్ట్ చేయడానికి నాన్న అని దాసును పిలుస్తుంది.
నాన్న ఏంటి మీ అమ్మాయి ఎవరు అని జ్యోత్స్నను చూపిస్తూ పారిజాతంతో అంటాడు దాసు. ఈ అమ్మాయి దశరథ్ అన్నయ్య కూతురు అని దాసుతో పారిజాతం చెబుతుంది.
అయినా జ్యోత్స్న అనుమానం తీరదు. కాఫీ కావాలని పారిజాతాన్ని రూమ్ నుంచి బయటకు పంపిస్తుంది. జ్యోత్స్న కావాలనే తన తల్లిని రూమ్ నుంచి పంపించిందని దాసు అర్థం చేసుకుంటాడు. నానమ్మను బయటకు పంపించి దాసుకు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. గతం గుర్తొచ్చినా...గతం మర్చిపోయినట్లు నటించిన నువ్వు గతం అయిపోతావని దాసుతో అంటుంది.
గతం గుర్తొచ్చి...నేను ఎవరన్నది ఎవరికైనా చెప్పిన నిన్ను బతకనివ్వనని అంటుంది. నాకు అడ్డు రావొద్దని, కూతురు చేతిలో మరోసారి చావొద్దని హెచ్చరిస్తుంది. అర్థం చేసుకొని ఆగిపోతే మంచిందని, అడ్డుపడాలని చూస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుందని అంటుంది.
జ్యోత్స్నకు తన మీద అనుమానం వచ్చిందని దాసుకు తెలిసిపోతుంది. గతం గుర్తొచ్చిందని తెలిసిన రోజున తనను బతకనివ్వదని భయపడతాడు. కార్తీక్‌కు ఈ విషయం చెప్పడానికి అతడి ఇంటికి వెళతాడు.
జ్యోత్స్న తనకు వార్నింగ్ ఇచ్చిన సంగతి చెబుతాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అంటాడు.
జ్యోత్స్న నీ చేత సంతకం పెట్టిన అగ్రిమెంట్‌లో ఏం రాసిందో తెలిసిందా అని కార్తీక్‌ను అడుగుతాడు దాసు. అగ్రిమెంట్ గురించి ఆలోచించే గ్యాప్ తాను ఇవ్వడం లేదని కార్తీక్ అంటాడు. నువ్వు ఎక్కడ ఇంటికొచ్చి నిజం చెబుతావోనని వణికిపోతుందని చెబుతాడు.
అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావుగా..ఖచ్చితంగా కౌంటర్ అంటుందని దాసు వణికిపోతాడు. జ్యోత్స్న మైండ్‌సెట్ ఎలాంటిదో నాకు తెలుసు. జ్యోత్స్న వెనకున్నది మా అమ్మ పారిజాతం. నా కూతురు ఆవేశం, అమ్మ అనుభవం తోడేతై జరిగేది ఊహించలేమని, తలరాతను మార్చేసే మనుషులు వాళ్లు అని దాసు భయంగా కార్తీక్‌తో చెబుతాడు.
అగ్రిమెంట్‌లో నువ్వు దీపతో విడిపోవాలని రాస్తే ఏం చేస్తావని కార్తీక్‌ను అడుగుతాడు దాసు. అతడి మాటలతో కార్తీక్ షాకవుతాడు. నువ్వు నాతో ఉండాలి...నా మెడలో తాళి కట్టాలని రాస్తే ఏం చేస్తావని అడుగుతాడు. కార్తీక్, దాసు సీక్రెట్‌గా మాట్లాడుకోవడం దీప చేస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం