కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో కార్తీక్ ను బావా అని పిలవడంతో శౌర్య, కాంచన, అనసూయ షాక్ అవుతారు. అమ్మా నువ్వు ఇప్పుడు ఏమని పిలిచాడు అని శౌర్య ప్రశ్నిస్తుంది. బావా అని కొత్త పిలుపు ఏంటీ దీప? అని కాంచన అడుగుతుంది. సొంత మేనత్త కూతురైతే బావా అని పిలవొచ్చు కానీ ఈ కొత్త పిలుపు ఏంటి దీప అని ప్రశ్నిస్తారు. అమ్మకు మీకు సంబంధం ఏంటీ అయినా అక్క అని పిలుస్తున్నారు కదా? అనసూయతో అంటాడు కార్తీక్. కొన్ని పిలుపులను కొన్ని బంధాలకే పరిమితం చేశారు. భార్య భర్తను బావా అని పిలవాలంటే సొంత మేనత్త కూతురే అయి ఉండాలా? అని తిరిగి ప్రశ్నిస్తాడు కార్తీక్.
భర్తలే చనువు ఇవ్వరు? ఇస్తే తీసుకోవడానికి భార్యలు రెడీగా ఉంటారు. నేను నా భార్యకు చనువు ఇచ్చా. అందుకే ఎలా పిలిచినా పలుకుతా అని కార్తీక్ చెప్తాడు. అలాగే పిలవమని నేనే చెప్పాను. కార్తీక్ బాబు పిలుపు దీప నోట్లో నుంచి వినపడకూడదు కూడా అని అంటాడు. అమ్మ నాన్నను బావ అని పిలిస్తే.. నాన్న అమ్మను ఏమని పిలుస్తాడు? అని శౌర్య క్యూట్ గా అడుగుతుంది. దీపను మరదలా అని పిలుస్తాను అని కార్తీక్ అంటాడు. వినడానికి చాలా బాగుందిరా అని కాంచన.. నేను కూడా కోడల అని కాకుండా మేనకోడలా అని పిలవాలా అని అడుగుతుంది. నిజమే.. దీప నా మేనకోడలే అని కాంచన అనగానే దీప ముఖం వెలిగిపోతోంది.
దీప, కార్తీక్ శివన్నారాయణ ఇంట్లోకి వస్తుంటే అక్కడే ఆగండి అని సుమిత్ర అరుస్తుంది. ముందు నువ్వు బయటకు పో అని దీపను సుమిత్ర గద్దిస్తుంది. దీప ఎందుకు వెళ్లిపోవాలి మమ్మీ అని జ్యోత్స్న అంటే.. నువ్వేం మాట్లాడకు అని సుమిత్ర, నిన్న జరిగింది చాలు.. ఇంకా ఆ మనిషి ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెబుతుంది. జరిగిన దాంట్లో దీప తప్పేముంది సుమిత్ర అని దశరథ్ అంటాడు. నీ భార్య కాలు చూసిన తర్వాత కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావ్ రా అని శివన్నారాయణ ఊగిపోతాడు.
దీప ఉద్దేశ్యం ఏమిటో కనుక్కోవాలని చూస్తే మమ్మీ ఏంటీ వెళ్లిపోమ్మంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. సుమిత్ర ఏం చెప్పిందో అర్థమైంది కదా ఇక బయల్దేరు అని శివన్నారాయణ అంటే.. వెంటనే కార్తీక్ అది కాదు తాతా అంటాడు. అప్పుడు ఎవడ్రా నీకు తాతా అంటూ శివన్నారాయణ ఊగిపోతాడు. ఈ పిలుపులతోనే ప్రాణాలు తీస్తున్నారు, మీరు సరిపోదన్నంటూ అందరినీ తీసుకొచ్చి విడిదిల్లుగా మార్చేశారని శివన్నారాయణ.. ఇక మా వల్ల కాదు దీప పనిమనిషిగా ఉండే అర్హత లేదంటాడు.
దీప ఎక్కడకు వెళ్లదు అని కార్తీక్ అంటే.. వెళ్తాను అని దీప అంటుంది. నా వల్ల ఇంత మంది బాధ పడ్తుంటే ఇక్కడ ఉండటం ఎందుకు.. వెళ్లిపోతాను కానీ ఒక షరతు అని దీప చెప్తుంది. ఈ క్షణమే వెళ్లిపోతా కానీ నేను నా భర్తను తీసుకుని వెళ్లిపోతాను అని బాంబ్ పేలుస్తుంది దీప. అదెలా కుదురుతోంది అని పారు నోరు తెరుస్తుంది. నేను వేరు కాదు నా భర్త వేరు కాదు.. పైగా అగ్రిమెంట్ రాాసింది నా కోసమే నన్ను పొమ్మంటే నా భర్తనూ పొమ్మన్నంటే అని దీప అంటుంది. మెలిక భలే వేశావు కదా అని మనసులో అనుకుంటాడు కార్తీక్.
అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది అని దీప అంటే.. ఎవర్రా ఇది అయిదో తరగతి చదివిందని చెప్పింది.. ఇక్కడ డిగ్రీలు చదివినవాళ్లకే తలలు తిరిగిలిపోయేలా మాట్లాడుతుంది అని పారిజాతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.దీప నువ్వు అడిగింది నేను చేయలేను అని జ్యో అంటే.. అయితే నేను ఇంట్లో నా భర్తతో కలిసి పని చేస్తానని దీప చెప్తుంది. దీప ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని సుమిత్ర అంటే.. అయితే ఇద్దరినీ పంపించండి అని అంటుంది దీప. అయితే ఇద్దరిని పంపించండి లేదంటే నేనూ వెళ్లను అని దీప అంటే.. నా భార్య మాటే నా మాట అని కార్తీక్ దెబ్బ కొడతాడు.
చివరకు దీపను ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారు. అయితే దీప ఎదురు పడకూడదు, నా గదిలోకి రాకూడదు, ఏం ఇచ్చినా తాగను, వండినా తినను అని సుమిత్ర.. దాని చేత్తో ముట్టుకుంటే నేను తినను అని అంటుంది. నిన్ను మీ నాన్నను అవమానించామని, ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఇలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నావంటూ శివన్నారాయణ కార్తీక్ పై ఫైర్ అవుతాడు. నువ్వొక డ్రైవర్ వి ఓనర్ కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సిందే అని శివన్నారాయణ అంటాడు.
దీంతో మనం కొత్త తీర్మాణం చేసుకుందాం అని దీపతో పిలుపుల్లో వరసలు లేవు. మేం శ్రామికులం కాబట్టి ఎలా పిలవాలో అలాగే పిలుస్తాం. దీప మనం ఒక మాట అనేసుకుందాం. ఇంట్లోవాళ్లకు మనకు ఏ బంధం లేదు. వాళ్లు ఓనర్లు మనం వర్కర్లం.. పెద్ద సారు, చిన్న సారు అని, మేడం అని, జ్యోత్స్నను పెద్ద మేడం అని పిలువు అని చెప్తాడు కార్తీక్. నువ్వు మాత్రం మా పారువే అని పారిజాతంతో జోక్ చేస్తాడు.
ఏ ఉద్దేశ్యం నెరవేరదు అని శివన్నారాయణ కార్తీక్ ను హెచ్చరిస్తూ వెళ్లిపోతాడు. సారీ తాత వీళ్ల నుంచి మిమ్మల్ని కాపాడాలి, దీపను వారసురాలు చేయాలి ఈ మొండి ఘటాలను మార్చాలి మనుషులుగా తీర్చిదిద్దాలి అని మనసులో అనుకుంటాడు కార్తీక్. మనం మనం ఒకటే అని పారుతో ఆటాడుకుంటాడు కార్తీక్. నువ్వు మా మనిషివి అని లవ్యూ పారు మన యూనియన్ కు నువ్వే నాయకురాలివి అని అంటాడు. ఇప్పుడు మమ్మీకి నా మీద కోపం వచ్చింది ఆ కోపం పోగొట్టాలి అని జ్యో ఆలోచిస్తుండగా నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్