కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పులు చేసే అల్లుడుని నా కూతురుకి కట్టబెట్టి గొంతు కోసింది దీప అని శ్రీధర్ అంటాడు. మాకు పనులు ఉన్నాయి. జ్యోత్స్న నిశ్చితార్థానికి ముహుర్తాలు పెట్టారు. వచ్చే బుధవారం గౌతమ్‌తో ఎంగేజ్‌మెంట్ అని చెప్పి పారిజాతం కాల్ కట్ చేస్తుంది. అదే విషయం కావేరికి చెబుతాడు శ్రీధర్.
ఆ గౌతమ్ చెడ్డవాడు కదా. జ్యోత్స్న పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది. ఏదైనా ప్లాన్ చేయబోతుందా అని కావేరి మనసులో టెన్షన్ పడుతుంది. ఈ ఎంగేజ్‌మెంట్ జరగదు అని కావేరి అనడంతో ఎందుకు జరగదు అని శ్రీధర్ అడుగుతాడు. కావేరి తప్పించుకుందామనుకుంటుంది కానీ, శ్రీధర్ వదలడు. దీపను ఇరికించే ప్లాన్ చేస్తున్నట్లుంది. వెంటనే చెప్పాలి అని కావేరి మనసులో అనుకుని వెళ్లిపోతుంది.
నీ భార్య అంతరంగం ఏంటో కనిపెట్టాలి. నిశ్చితార్థం ఎందుకు జరగదు అని శ్రీధర్ ఆలోచిస్తాడు. మరోవైపు కార్తీక్ పిలుపుపై శివ నారాయణ డౌట్ రాకూడదని అలా పిలిచానని క్లారిటీ ఇస్తాడు కార్తీక్. ఏం జ్యోత్స్న ఇప్పుడు నువ్ హ్యాపీయేనా. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరగాలి అని కార్తీక్ అంటాడు. అలా జరగలాంటే మీరొక పని చేయాలని గౌతమ్ తల్లి చెప్పింది దీప చేయాలని సుమిత్ర అంటుంది.
నా కూతురు పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లేదాకా నువ్ ఈ ఇంటి ఛాయలకు కూడా రాకూడదు. నువ్వుంటే ఈ పెళ్లి జరగదని అర్థమైంది అని సుమిత్ర అంటుంది. ఇప్పుడు దీప అంటే గౌతమ్ వాళ్ల అమ్మకు నచ్చదు. ఇప్పుడు దీపను ఇంట్లో ఉంచితే ఎంగేజ్‌మెంట్ మనం చెడగొట్టాల్సిన అవసరం లేదు. దీపే చెడగొడుతుంది అని పారుతో జ్యో అంటుంది.
ఈ ఇంటికి మంచి జరగాలంటే నువ్ ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్లిపో అని కూతురు దీపతో తల్లి సుమిత్ర అంటుంది. మీకంటే ఏది ఎక్కువ కాదని దీప వెళ్లిపోతుంటే జ్యోత్స్న ఆపుతుంది. నేను అత్తారింటికి వెళ్లే వరకు దీప ఇంట్లో ఉండాల్సిందే. దీప వెళ్తే తను వేసిన నింద నిజం అవుతుంది అని జ్యోత్స్న అంటుంది. మనవరాలు చెప్పింది వినొచ్చుగా అని శివ నారాయణ అంటాడు.
మేము అనుకుంది జరగాలంటే దీప ఇంట్లోనే ఉండాలి అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. సుమిత్ర ఎంత చెప్పిన జ్యోత్స్న వినదు. దీపను పంపిస్తానంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసినట్లే అంటుంది. దాంతో సుమిత్ర ఒప్పుకుంటుంది. ఏదైనా తప్పు జరిగితే నాలోని తల్లికి కోపం వస్తుంది. అది నీకు మంచిది కాదు దీప. గుర్తుపెట్టుకో అని సుమిత్ర అంటుంది. దాంతో అంతా వెళ్లిపోతారు.
నా ప్లాన్ ఎలా ఉంది. దీప ఉంటే నా పెళ్లి జరగదు. దీపతో పెళ్లి ఎలా చెడగొట్టాలో చూడాలి అని పారుతో జ్యోత్స్న అంటుంది. ఇక మనవడి సమస్యకు పరిష్కారం దొరకాలి అని కాశీ గురించి ఆలోచిస్తుంది పారిజాతం. శివ నారాయణ సంతోషంగా ఉండటం చూసి పది లక్షలు వాడికి 5 లక్షలు నాకు అని 15 లక్షలు అడగాలనుకుంటుంది పారిజాతం.
శివ నారాయణ దగ్గరికి వెళ్లి పారిజాతం 15 లక్షలు అడుగుతుంది. ఒక 20 ఏళ్ల తర్వాత ఇస్తాను. పదేళ్ల తర్వాత గుర్తు చేయు అని శివ నారాయణ అంటాడు. అదంతా జ్యోత్స్నకు చెప్పి గోడు వెళ్లబోసుకుంటుంది పారిజాతం. నీ సమస్య క్లియర్ కాలేదు. నువ్ దీపను ఉండమని చెప్పగానే కార్తీక్ గాడిలో స్మైల్ చూశాను. వాళ్లు చాలా ప్రీ ప్లాన్‌డ్‌గా ఉంటారు. గౌతమ్ గాడితో నీ గురించి నిజాలు చెప్పిస్తారు. నువ్ తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావ్ పూర్తిగా అని పారు అంటుంది.
మనవరాలు, మనవడు, కొడుకు ముగ్గురు సమస్యల్లో ఉన్నారు. ఈ పెళ్లి ఆగిపోవాలంటే కార్తీక్, దీప అదిరిపడే ట్విస్ట్ ఇవ్వాలి. దానికి వాళ్ల దిమ్మ తిరిగిపోవాలి. చివరికి ఆ నేరం దీప మీదకే వెళ్లాలి అని పారు అంటుంది. రేపు ఒకరిని కలవాలి. అతనే ఈ ఎంగేజ్‌మెంట్ ఆపుతాడు అని జ్యోత్స్న చెబుతుంది. మరోవైపు పాలు పెట్టి సుమిత్ర అన్న మాటలు తలుచుకుంటుంది దీప.
కార్తీక్ వచ్చి మాట్లాడితే గౌతమ్‌తో జ్యోత్స్న పెళ్లి చేయించి ఆడపిల్లకు నష్టం చేస్తున్నామంటుంది దీప. ఈ పెళ్లి జరగదు. ఎంగేజ్‌మెంట్ కూడా జరగదు. జ్యోత్స్సే ఆపుతుంది. నీ వల్ల అని జ్యోత్స్న ఆలోచనల గురించి చెబుతాడు కార్తీక్.
జ్యోత్స్న పెళ్లి చేసుకుంటే అని దీప అంటే.. నువ్ మంచి చెప్పాలని చూస్తే అది రికార్డ్ చేసి తనను పెళ్లి చెడగొట్టుకోమని చెప్పి నీ మీద నింద వేస్తుందని కార్తీక్ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్