కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో జ్యోత్స్నను వెనకేసుకొస్తూ దశరథ్ తో మాట్లాడుతుంది సుమిత్ర. ఏకంగా వాళ్లను తాతను తీసుకుని అత్తను చూడటానికి వెళ్లింది. దీని మనసు ఎలాంటిదో ఇంతకుమించిన రుజువు కావాలంటారా? అని సుమిత్ర చెప్తుంది. నన్ను ఇలా గుడ్డిగా నమ్మాలనే తాతను తీసుకెళ్లా అని జ్యో మనసులో అనుకుంటుంది. కానీ జ్యోత్స్నను మాత్రం నమ్మను అని దశరథ్ అనుకుంటాడు.
ఇంతలో రేపు అందరూ ఇంటి దగ్గరే ఉండాలి అని శివన్నారాయణ వచ్చి చెప్తాడు. గౌతమ్ పేరెంట్స్ తో వస్తున్నాడని, జ్యోత్స్న నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకోవడానికి అని శివన్నారాయణ చెప్పగానే పారిజాతం, జ్యో షాక్ అవుతారు. జాగ్రత్తగా చూసుకోమని సుమిత్రకు చెప్తాడు శివన్నారాయణ. ఎందుకైనా మంచిది ఎస్ఐని అందుబాటులో ఉండమని చెప్పు అని దశరథ్ తో అంటాడు శివన్నారాయణ.
నిద్రపోవడానికి అందరూ గదుల్లోకి వెళ్లిపోయాక పారు, జ్యో మాట్లాడుకుంటారు. ఈ గౌతమ్ కు ఏమైంది? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు? సడెన్ గా ఎంగేజ్ మెంట్ అంటే ఎలా గ్రానీ? అని అంటుంది జ్యోత్స్న. మూలిగే నక్కమీద తాటికాయ పడటం అనే సామెతను ఇప్పటి సిచ్యువేషన్ తో పోల్చి చెప్తుంది పారు. మీ తమ్ముడు కాశీ ఎవరికో రూ.10 లక్షలు ఇప్పించి మోసపోయాడంటా అని జ్యోకు చెప్తుంది పారు.
రేపు ముహూర్తాలు పెట్టకూడదు ఏం చేస్తావో చెయ్ అని పారుతో అంటుంది జ్యో. గౌతమ్ మళ్లీ ఈ ఇంటి గుమ్మం తొక్కకుండా చేస్తా అని జ్యో వెళ్లిపోతుంది. పొద్దున మగ పెళ్లివాళ్లు వచ్చే టైమ్ అయింది, అంతా రెడీ హా అని దీపను అడుగుతాడు కార్తీక్. ఇదంతా జరగడానికి కారణం మనమే అని ఎవరికీ అనుమానం రాకూడదని చెప్తాడు. ముఖ్యంగా నా చిన్న మరదలు అసలే అది జిత్తులమారి నక్క అని అంటాడు.
నాకు బావ మీదే డౌట్ ఉంది అని కార్తీక్ గురించి పారుతో అంటుంది జ్యో. కానీ జ్యో అంత ఈజీగా ట్రాప్ లో పడదు కదా అని ప్లాన్ వేస్తుంది జ్యోత్స్న. ఇంతలో గౌతమ్ ఫ్యామిలీతో కలిసి శివన్నారాయణ ఇంటికి వస్తాడు. కార్తీక్ వచ్చి హడావుడి చేస్తాడు. వీళ్లిద్దరూ ఈ ఇంట్లో ఉన్నారేంటీ అని గౌతమ్ పేరేంట్స్ అనుకుంటారు. అంతా కలిసిపోయారు డాడీ అని గౌతమ్ చెప్తాడు.
దీప అందరికీ స్వీట్లు ఇస్తుంది. అమ్మాయి ఏదండీ? అని అడిగితే తీసుకొచ్చేందుకు దీప వెళ్తుంటే అవసరం లేదు అని పారు వస్తుంది. జ్యోత్స్న రాత్రి ఐస్ క్రీం, పెరుగు తిన్నది అని పారు అనగానే జ్వరం వచ్చింది అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్నకు జ్వరం రావడం ఏంటీ? నేను చూసినప్పుడు బాగానే ఉంది అని సుమిత్ర అంటుంది. జ్యో బెడ్ రూమ్ లోకి సుమిత్ర, గౌతమ్ వాళ్ల అమ్మ, కార్తీక్, పారు వస్తారు.
కార్తీక్ కౌంటర్
ఇంతకుముందు ఎంగేజ్ మెంట్ చెడిపోయింది కదా ఇప్పుడైనా జరుగుతుందో లేదో అని ఆలోచించి అలా అయిపోయింది అని కార్తీక్ అంటాడు. పెళ్లి జరుగుతుంది అని ధైర్యం చెప్పండి అని కార్తీక్ అంటే.. ఏం కాదమ్మ పెళ్లి జరుగుతుంది అని గౌతమ్ వాళ్లమ్మ జ్యోకు చెప్తుంది. ఇది ముందే ఊహించి డాక్టర్ కు కాల్ చేశానని, కావాలంటే అంబులెన్స్ కూడా రప్పిస్తానని కార్తీక్ అంటాడు. దీప వెళ్లి గౌతమ్ ను పిలుస్తా అంటే నేనే వస్తా అంటూ జ్యో గబుక్కున లేస్తుంది. దీంతో ఎలా తప్పించుకుంటావో చూస్తా అని అనుకుంటాడు కార్తీక్.
తప్పదన్నట్లుగా జ్యోత్స్న కిందకు వస్తుంది. ఏదైనా ఉంటే అగ్రిమెంట్ గురించి మగ పెళ్లివాళ్లకు తెలుస్తుంది, అది మనకే చిన్నతనం అని దశరథ్ అంటే.. అందుకే కార్తీక్ ఓవర్ చేస్తున్నా సైలెంట్ గా ఉన్నానని శివన్నారాయణ చెప్తాడు. జ్యోత్స్నను లాగి గౌతమ్ పక్కన కూర్చోబెడతాడు కార్తీక్.
వచ్చే బుధవారం లేదంటే వచ్చే నెల రెండో వారంలో మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తారు. దీంతో రెండో వారంలో ఖాయం చేయమని పారు అంటుంది. ఆ లోపు పెళ్లి చెడగొడతా అని జ్యో అనుకుంటుంది. అది జరగనివ్వను అని నా మనసులో ఉందే చెప్పావు పారు, తాత అదే ముహూర్తం ఖాయం చేసేయండి అని కార్తీక్ అంటాడు. పనోళ్లు పనోళ్లు లాగా ఉండాలి అని శివన్నారాయణ అంటే.. పనోళ్లు ఏంటీ అని గౌతమ్ పేరెంట్స్ అడుగుతారు. మా తాత పని చేసేవాళ్లను పని వాళ్లు అంటాడు అని కార్తీక్ సెటైర్ వేస్తాడు.
కార్తీక్ ప్లాన్ సక్సెయ్ అయ్యి వచ్చే బుధవారం ముహూర్తం ఖాయం చేయమని శివన్నారయణ అనగానే జ్యోత్స్న, పారు కంగారు పడతారు. ఈ నిశ్చితార్థం జరగాలంటే మీ మేనళ్లుడు, దీప ఇంట్లో ఉండకూడదని గౌతమ్ తల్లి సుమిత్రతో చెప్తుంది. గతంలో నిశ్చితార్థం రోజు నా కొడుకును దీప కొట్టింది, అలాంటి మనిషిని క్షమించలేను అని అంటుంది. కాశీ గురించి పారుతో ఫోన్లో మాట్లాడతాడు శ్రీధర్. వచ్చే బుధవారం జ్యో నిశ్చితార్థం అని పారు శ్రీధర్ తో చెప్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్