కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కన్నీళ్లు పెట్టుకున్న శివనారాయణ- శ్రీధర్ రివేంజ్ ప్లాన్- జ్యోత్స్న పెళ్లితో కార్తీక్ స్కెచ్-karthika deepam 2 serial today episode july 3rd 2025 shivanarayana get emotional sridhar vengeance star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కన్నీళ్లు పెట్టుకున్న శివనారాయణ- శ్రీధర్ రివేంజ్ ప్లాన్- జ్యోత్స్న పెళ్లితో కార్తీక్ స్కెచ్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కన్నీళ్లు పెట్టుకున్న శివనారాయణ- శ్రీధర్ రివేంజ్ ప్లాన్- జ్యోత్స్న పెళ్లితో కార్తీక్ స్కెచ్

Sanjiv Kumar HT Telugu

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 3 ఎపిసోడ్‌లో కూతురు కాంచనను చూడటానికి ఇంటికి కార్తీక్ యజమానిగా వెళ్తాడు శివ నారాయణ. కాంచన మాటలకు తల్లడిల్లిపోయిన శివ నారాయణ కన్నీళ్లుపెట్టుకుంటాడు. శ్రీధర్ ఇంటికి వచ్చిన పారిజాతం అరుపులతో వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్నకు గౌతమ్‌తో పెళ్లి జరిపించేలా కార్తీక్ స్కెచ్ వేస్తాడు.

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 3వ తేది ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కూతురు కాంచన ఇంటికి వెళ్లిన శివ నారాయణ నీతి కథ చెబుతాడు. అది విన్న కార్తీక్ సూపర్ సర్ అని చప్పట్లు కొడతాడు. పిల్లలు వినే కథలోనే అహంకారం ఉండకూడదని చెప్పే మీరు నిజ జీవితంలో ఎందుకు పాటించట్లేదో అని కార్తీక్ అంటాడు. బావ నువ్ మా తాతతో మాట్లాడుతున్నావని గుర్తు పెట్టుకో అని అంటుంది.

బతిమిలాడి తీసుకొచ్చాను

నువ్ మా బావతో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో అని దీప అంటుంది. స్థానాలను బట్టి గుర్తులు మారిపోతాయి. మేము వచ్చింది మీకోసం కాదు అని శివ నారాయణ అంటాడు. నా మీదున్న చెడ్డపేరు పోగొట్టుకునేందుకు తాతను బతిమిలాడి మరి ఇక్కడికి తీసుకొచ్చాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. మరి ఎవరి కోసం వచ్చారని కార్తీక్ అడిగితే ఈమె కోసం అని కూతురుని చూపించిన శివ నారాయణ ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు.

బాగానే ఉంది నాన్నా అని కాంచన అనబోతుంటే ఆ పిలుపు అక్కడే ఆపేయమని తనింట్లో డ్రైవర్ తల్లితో నాన్న అనిపించుకోడానికి సార్ ఇష్టపడకపోవచ్చు. అందుకే ముందు సార్ ఏ హోదాలో వచ్చారో తెలుసుకోవాలి. గాయపడిన నాన్న హోదాలోనా లేదా నా యజమానిలానా అని కార్తీక్ ఫిట్టింగ్ పెడతాడు. నాలో సగం వయసు లేనివాడే అంతలా మాట్లాడుతుంటే నేనేలా మాట్లాడాలి అని శివ నారాయణ అంటాడు.

నా దగ్గర పనిచేసే డ్రైవర్ తల్లికి బాగా లేదని తెలిసి వచ్చాను అని శివ నారాయణ అంటాడు. మీ మంచి మనసు నా తల్లికి తెలియాలనే అలా అడిగాను. అమ్మ విన్నావా. నీ మీద జాలితో వచ్చారు. ఈయనను నువ్ చూడటం ఇదే మొదటిసారి కదా. ఈయనను నీకు పరిచయం చేయాలి. ఈయన శివ నారాయణ మా పెద్ద సారు. చాలా పెద్ద మనసు ఈయనది. నమస్కారం పెట్టు కార్తీక్ చెబుతాడు.

అవమానించడానికి అవకాశం

దాంతో తండ్రికి నమస్కారం అండి అని కాంచన పెడుతుంది. అవమానించడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని నువ్ ఇంత బాగా వాడుకుంటావని అనుకోలేదురా అని శివ నారాయణ అంటాడు. కింద పడి దెబ్బ తగిలిన వ్యక్తి అమ్మ అంటాడు. మా అమ్మకు అమ్మ లేదు. నాన్న ఉన్నాడు. అతను వస్తాడని ఎదురుచూసింది. ఆ తండ్రి హోదాలో వస్తే ఈ కూతురు సంతోషిస్తుంది అని కార్తీక్ అంటాడు.

బంధాలు అన్ని చంపేసింది మీరు. మీ అవసరమే కాదు అందరి అవసరం ఉన్నప్పుడు బంధుత్వం గురించి మాట్లాడితే బాగుంటుంది అని శివ నారాయణ అంటాడు. అత్తకు ప్రమాదం జరిగిందని తెలిస్తే నేనే వచ్చేదాన్ని అని జ్యో అంటే మీకు నమ్మకాలు కుదిరేలోపు మనుషుల ప్రాణాలు పోతాయ్ అని కార్తీక్ అంటాడు. మీరందరూ దూరమైన నాకు మా అన్నయ్య ఉన్నాడని కాంచన కన్నీళ్లు పెట్టుకుంది.

అగ్రిమెంట్ విషయంలో జ్యోత్స్న కనికరం చూపించలేదని, నా కొడుకును, కోడలి నీ ఇంట్లో పనిమనుషుల్లా ఉంటే నాకు ఆనందంగా ఉంటుందా అని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాంచన మాటలు విన్న శివ నారాయణ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ, బయటకు తెలియనివ్వడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు వాళ్లు యజమానుల్లా పలకరించడానికి వచ్చారు అని దీప కుర్చీలు వేసి మర్యాదలు చేస్తుంది.

నా ప్రాణాలు తీసుకుంటా

ఇద్దరు కూర్చోరు. తీసుకొచ్చిన పండ్లు ఇస్తారు. శివ నారాయణ జాగ్రత్తలు చెబితే అలాగే అయ్యాగారు అంటుంది కాంచన. జ్యోత్స్న కొత్త వీల్ చైర్ తెప్పించు అని శివ నారాయణ అంటే అయ్యో బాగానే ఉంది అయ్యగారు. తప్పు వీల్ చైర్‌ది కాదు నాదే. మా నాన్న నన్ను చూడటానికి వస్తాడంటే నా ప్రాణాలు అయిన తీసుకుంటాను అని కాంచన అంటుంది.

మా అమ్మ ఎప్పుడు చనిపోయిందో నాకు తెలీదు. నన్ను మా అన్నయ్యని మా తండ్రి చేతుల్లో పెట్టింది. నాన్నే నాకు తండ్రి, తల్లి. మేముపోయే వరకు ఇలాగే ఉంటాం అని కాంచన అంటుంది. దాంతో శివ నారాయణ ఏడుస్తాడు. మంచిది.. నాకు ఓ కూతురు ఉంది. తండ్రి అంటే లెక్కలేదు. అన్న కూతురిని కాదని ఎవరో అనాధను కోడలిగా తెచ్చుకుంది అని శివ నారాయణ అంటాడు

దీప అనాధ కాదు నీ మనవరాలే అని కార్తీక్ మనసులో అనుకుంటే నేను కూడా నీ మనవరాలినే తాత దాస్ కూతురుని అని జ్యో అనుకుంటుంది. నేను కూడా ఎన్నో మాటలు పడ్డాను. ఇక్కడ లేని మనిషి గురించి ఎందుకు అని భుజంపై చేయి వేసి ఆరోగ్యం జాగ్రత్త. నీకేమైనా నీ తండ్రి బాధపడతాడు. వెళ్లొస్తాను అని శివ నారాయణ వెళ్లిపోతాడు. దాంతో కాంచన ఏడుస్తూ ఉంటుంది.

పారిజాతం వార్నింగ్

మరోవైపు శ్రీధర్ అంటూ అరుస్తూ కోపంగా ఇంటికి వెళ్తుంది పారిజాతం. కాశీ చేసిన గొడవ గురించి అడుగుతుంది. అల్లుడిని ఎగేసి పంపించావా అని పారు అంటుంది. నా అల్లుడు మంచి పనే చేశాడు అని శ్రీధర్ మెచ్చుకుంటాడు. ఇక మీదట ఇలాంటివి జరగకూడదని హెచ్చరించడానికి వచ్చాను అని అరుస్తుంది పారిజాతం. ఫ్యామిలీ అంతా కలిసి పారునుఏదో ఒకటి అంటారు.

నీ మనవడిని నా కొడుకు కొట్టాడని ఇదంతా మాట్లాడుతున్నావ్. మరి నీ మనవడికి పది లక్షలు అప్పు ఉంది. అది రౌడీ షీటర్ దగ్గర అని తెలుసా. మూడు రోజుల్లో కట్టాలి అని శ్రీధర్ చెబుతాడు. అరేయ్ కాశీ ఏంట్రా ఇది అని పారు అడిగితే నాది నేను చూసుకుంటాను అని కాశీ వెళ్లిపోతాడు. ఇంకోసారి మా కొంప మీద పడకండి అని పారు వెళ్లిపోతుంది. ఈ శ్రీధర్ గాడు మళ్లీ మళ్లీ వస్తాడు అని అంటాడు.

నా ఫ్యామిలీని ఇబ్బందిపెట్టారు. కౌంటర్ ఇవ్వాలిగా. టైమ్ చూసుకుని కొడతా. నా పగ తీర్చుకోడానికి నాకు ఓ రోజు వస్తుంది. ఆరోజు చెబుతా అని శ్రీధర్ అంటాడు. నేను సమస్యల్లో ఉన్నా డాడీని ఏం చేయొద్దని చెప్పు అని స్వప్న అంటుంది. మరోవైపు శివ నారాయణ రావడం గురించి దీప, కార్తీక్ మాట్లాడుకుంటారు. తన తండ్రి గురించి చెబుతుంది దీప.

కార్తీక్ ప్లాన్

రేపు పారిజాతం, జ్యోత్స్న గురించి శివ నారాయణకు తెలిస్తే ఏంటీ పరిస్థితి అని దీప అంటుంది. ఏముందు నా మనవరాలినే మారుస్తావా అని రివాల్వర్‌తో పారుని షూట్ చేస్తాడు. ఇక జ్యోత్స్నకు గట్టిగా బుద్ధి చెబుతాడని కార్తీక్ అంటాడు. మార్పుకు శిక్ష అవసరమే. ఆ గౌతమ్ గాడిని పేరెంట్స్‌తో ఇంటికి పిలిపించాలి. దానికి ప్లాన్ చేశా. జ్యోత్స్న కంచు. దానికి గౌతమ్ గాడిని వాడాల్సిందే అని కార్తీక్ అంటాడు.

తర్వాత దీప చేయి మీద కార్తీక్ చేయి వేస్తే తీసేస్తుంది. కాసేపటి తర్వాత దీపనే కార్తీక్ చేయి మీద చేయి వేస్తుంది. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం