కాంచనకు ప్రమాదం జరిగితే దీప, కార్తీక్ ఇంటికి రాకుండా జ్యోత్స్నతో పాటు ఆమె కుటుంబసభ్యులు అడ్డుకున్నారని అపార్థం చేసుకున్న కాశీ శివన్నారాయణ ఇంటికొచ్చి గొడవ చేస్తాడు కాశీ. ఆ గొడవను అడ్డుపెట్టుకొని కుటుంబసభ్యుల ముందు దీపను ఇరికిస్తుంది జ్యోత్స్న. దీపనే కాశీని రెచ్చగొట్టి గొడవలు చేయిస్తుందని నిందలు వేస్తుంది.
నన్ను ఎవరూ రమ్మని చెప్పలేదని కాశీ అంటాడు. మనుషులను కొట్టే అలవాటు, మాటలతో బాధపెట్టే అలవాటు మీ కుటుంబం మొత్తానికి ఉందని కాశీ అంటాడు. నన్ను ఏమైనా అను కానీ మా తాతను ఏం అనొద్దు అని జ్యోత్స్న. ఆ పెద్ద మనిషి వల్లే నువ్వు ఇలా తయారు అయ్యావని కాశీ బదులిస్తాడు.
మాటలు మర్యాదగా మాట్లాడు అని కాశీకి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. వాడి చేత అనిపించేది నీ భార్య అంటూ సుమిత్ర కూడా అపార్థం చేసుకుంటుంది. మాటల విలువ, మనుషుల విలువ మాకు తెలుసు..కొన్ని మాటలు కత్తి కంటే లోతైనా గాయాన్ని చేస్తాయని, ఆ గాయలను చాలా మోస్తున్నామని కార్తీక్ అంటాడు. శివన్నారాయణ కూడా దీప, కార్తీక్‌తో పాటు కాశీని తప్పు పడతాడు. జ్యోత్స్న ...కాశీని మరింత రెచ్చగొడుతూ తన మాటలతో గొడవ పెద్దది చేస్తుంది.
కాశీని మెడపట్టి బయటకు గెంటేయమని దశరథ్‌కు ఆర్డర్ వేస్తాడు శివన్నారాయణ. కాంచన ఈ ఇంటి పడచు కదా...ఆమెకు ఏదన్నా అయితే మీరు బాధపడరా? ఆ మాత్రం బుద్ది కూడా లేదా? అని నిలదీస్తాడు కాశీ. మీ తమ్ముడికి నీకు దండం పెడుతున్నా, మా కుటుంబాన్ని రోడ్డున పడేయద్దు అని దీపతో అంటుంది సుమిత్ర. కాశీని బయటకు వెళ్లమని దీప అంటుంది.
ఈ ఇంట్లో ఉండేది మనుషులు కాదు రాక్షసులు అని కాశీ అంటాడు. అతడి మాటలతో కోపం పట్టలేని కార్తీక్ కాశీ చెంపపై గట్టిగా ఒక్కడి కొడతాడు. కాశీని కాలర్ పట్టుకొని నీకు ఇవన్నీ ఎవరూ చెప్పారని అంటాడు. శ్రీధర్ మావయ్య తనకు ఈ నిజాలన్ని చెప్పాడని కాశీ అంటాడు. నువ్వు ముందు బయటకు పో అని కాశీని మెడపట్టి బయటకు గెంటేస్తాడు కార్తీక్.
ఇంకోసారి కాశీ ఇంటికి వస్తే అతడిపై పోలీస్ కేసు పెడతానని అంటాడు శివన్నారాయణ. కాశీ వచ్చి మంచి పని చేశాడని, తన తాత, తల్లి దృష్టిలో దీప మరింత చెడ్డది అయ్యిందని జ్యోత్స్న సంబరపడుతుంది.
కాశీని కొట్టి తప్పుచేశావని, వాడు ఎంత బాధపడతాడో తెలుసా అని కార్తీక్‌ను నిలదీస్తుంది దీప. కాశీ నా సొంత చెల్లెలు భర్త, కాశీని నేను కొట్టానని తెలిస్తే స్వప్న ఎంతో బాధపడుతుందని కార్తీక్ అంటాడు. కాశీని కొట్టినందుకు అతడి కంటే తానే ఎక్కువ బాధపడుతున్నట్లు దీపతో చెబుతాడు కార్తీక్. నిన్ను చెడ్డదానిని చేయడానికే కాశీని రెచ్చగొట్టి కాశీని తాను కొట్టేలా జ్యోత్స్నచేసిందని కార్తీక్ అంటాడు. కాశీ తన సొంత తమ్ముడు అని తెలిసి కూడా జ్యోత్స్న కుట్ర పన్నిందని కార్తీక్ బాధపడతాడు.
నువ్వే వారసురాలు అని తెలిసేలోపు నిన్ను మంచి మనిషిలా ఈ ఇంట్లో వాళ్లు చూడాలి. కానీ జ్యోత్స్న అలా అనుకునేలా చేయడం లేదని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న మాటలు నిజమని సుమిత్ర నమ్ముతుందని కార్తీక్ అంటాడు. ఏదో ఒక రోజు జ్యోత్స్న గురించి సుమిత్రకు అన్ని నిజాలు తెలుస్తాయని దీప అంటుంది. వెంటనే కాశీని కలిసి అతడికి క్షమాపణలు చెప్పాలని కార్తీక్, దీప బయలుదేరుతారు.
నువ్వు చేసే పనులకు దండేసి దండం పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నానని జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది పారిజాతం. కాశీని రెచ్చగొట్టి కార్తీక్ అతడిని కొట్టేలా చేసింది నువ్వే అని పారిజాతం అంటుంది. అదంతా దీప ప్లాన్ అని బుకాయించబోతుంది జ్యోత్స్న. కాశీ నీ తమ్ముడు అని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. కాదు నీ మనవడు అని జ్యోత్స్న బదులిస్తుంది. కాశీని తమ్ముడిగా ఎప్పటికీ ఒప్పుకోనని అంటుంది. తాను దశరథ్, సుమిత్రల కూతురిగానే బతుకుతానని, దాసు, కళ్యాణిలా కూతురిగా కాదని అంటుంది.
నువ్వు ఏదో ఒకటి చేసుకో...నీతో ఉంటే నన్ను ఛీ అంటున్నారని పారిజాతం అంటుంది. నీ బలం నీ తాత..నీ తాతకు నీపై మనసు విరిగే లోపు ఏదో ఒకటి చేయకపోతే నీకే ప్రమాదం, అది మాత్రం గుర్తు పెట్టుకో అని జ్యోత్స్న సలహా ఇచ్చి వెళ్లిపోతుంది పారిజాతం. తాతకు తనపై ఉన్న చెడు అభిప్రాయాన్ని పొగొట్టడానికి మరో కొత్త స్కెచ్ వేస్తుంది జ్యోత్స్న.
కాశీ, స్వప్నను కలుస్తారు దీప, కార్తీక్, కాశీకి సారీ చెబుతాడు కార్తీక్. నీపై చేయిచేసుకొని ఉండాల్సింది కాదని అంటాడు. ఆ ఇంటికి వెళ్లొద్దని నేను చెప్పిన కాశీ వినలేదని స్వప్న చెబుతుంది. నేను తప్పు చేస్తే సరిదిద్దే హక్కు మీకు ఉందని, ఇంటి కొచ్చి గొడవ చేయడం నా తప్పే అని కాశీ ఒప్పుకుంటాడు. తప్పు చేస్తే సరిదిద్దమే కాదు మీకు ఏదైనా సమస్య వస్తే అండగా ఉండే బాధ్యత కూడా మాకుందని కాశీతో అంటాడు కార్తీక్. పది లక్షల గురించి కార్తీక్, దీపలకు చెప్పబోతుంది స్వప్న. కానీ కాశీ చెప్పకుండా అడ్డుకుంటాడు.
వాళ్ల పరిస్థితి గురించి తెలిసి కూడా మన సమస్యలకు వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని, పది లక్షలు తిరిగి ఇచ్చేందుకు ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుందని స్వప్నతో అంటాడు కాశీ. కాంచనను చూడటానికి ఆమె ఇంటికి వస్తాడు శివన్నారాయణ. ఇది జ్యోత్స్న ప్లానే అని కార్తీక్ అర్థం చేసుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.