కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చిన్న సార్‌ను షూట్ చేసింది నా భార్య కాదని నిరూపిస్తాను. ఎలానో తెలియదు. కానీ, నిరూపిస్తాను. అది చేసింది ఎవరైనా సరే మెడపట్టుకుని తీసుకొచ్చి మీ కాళ్ల ముందు మోకరిల్లేలా చేస్తాను. అలా నిలబెట్టకపోతే నేను దీప భర్తనే కాదు అని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. వాడు ఛాలెంజ్ చేశాడంటే కచ్చితంగా చేస్తాడని అర్థం అని దశరథ్ అంటాడు.
మళ్లీ కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని జ్యోత్స్న అనుకుంటుంది. అన్ని సమస్యలు తీరినట్లేగా నేను వెళ్తాను అని దాసు అంటే.. నా మనవరాలి జీవితాన్ని కాపాడిన నిన్ను ఊరికే ఎలా పంపిస్తాను. ఈరోజు దాసు మన ఇంట్లోనే మనతోనే భోజనం చేస్తాడు అని శివ నారాయణ అంటాడు. వద్దుసార్ ప్లేట్‌లో భోజనం పెట్టండి. మూలన తింటాను అని దాసు అంటాడు.
సహాయానికి వెల కట్టలేం. కేవలం కృతజ్ఞత మాత్రమే చూపించగలం. ఈ అవకాశాన్ని నాకు ఇవ్వు. దాసు మనతోనే భోజనం చేస్తాడు అని చెప్పేసి వెళ్లిపోతాడు శివ నారాయణ. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. ఇన్నాళ్లు అంటరానివాడిలా దూరంగా ఉన్నావ్. ఇకనుంచి నీకు ఆ బాధ ఉండదు అని పారు అంటుంది. మా చెడు కోరుకునేవాళ్లు మా ఇంట్లో తింటున్నప్పుడు నువ్ ఎందుకు ఉండకూడదు అని సుమిత్ర అనేసి వెళ్లిపోతుంది.
ఏదైనా నిజం తెలిసేవరకు అబద్ధం విలువ. దీప నీ చేత్తో వండు. నా తమ్ముడు తృప్తిగా భోజనం చేస్తాడు అని దశరథ్ అంటాడు. కాశీకి రావట్లేదని చెబుతానని బయటకు వెళ్తాడు దాసు. తమ్ముడు నీతో చాలా మాట్లాడాలి అని దశరథ్ అనుకుంటాడు. పారుకు శ్రీధర్ కాల్ చేస్తాడు. పెద్ద గండం నుంచి తప్పించుకున్నారుగా. జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందిగా అని శ్రీధర్ అంటాడు.
అంతమంది ముందు జరిగింది నీకు కచ్చితంగా తెలుస్తుందిలే. నువ్ దండం మీద ఆరేసిన చీర లాంటోడివి. గాలి ఎటు వస్తే అటు ఊగుతావ్ కదా అని పారిజాతం అంటుంది. ఇంతమాటి అంది నన్నే అని శ్రీధర్ అంటే అవును అని పారు అంటుంది. నా కొడుకు వల్లే కదా నీ మనవరాలి లైఫ్ సేఫ్ అయింది అని శ్రీధర్ అంటే నిశ్చితార్థం ఆపింది నా కొడుకు అని పారిజాతం అంటుంది.
శివ మామ దాసు చెప్పింది ఎలా నమ్మాడు అని శ్రీధర్ అంటాడు. నమ్మాడు. ఇవాళ మాతోపాటు భోజనం చేయమన్నాడు అని పారు చెబితే శ్రీధర్ నమ్మదు. ఒరేయ్ తిక్క అల్లుడు ఇది నిజం నిజం అని పారు అరుస్తూ వెనక్కి తిరిగే సరికి అక్కడ శివ నారాయణ కోపంగా చూస్తూ ఉంటాడు. ఫోన్ కట్ చేస్తుంది. పారు కవర్ చేస్తే శివ నారాయణ మరింత ఫైర్ అవుతాడు.
ఈరోజు దాసును క్షమించినట్లే ఏదో ఒక రోజు శ్రీధర్‌ను క్షమిస్తారేమో అని పారు అంటే.. నేను దాసును క్షమించలేదు. కృతజ్ఞత చూపించాను అని చెప్పేసి పారుకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. భోజనానికి అంతా కూర్చుంటారు. కార్తీక్‌ను కూడా దాసు కూర్చోమంటాడు. వద్దులే చిన్న మావయ్య. మేమిక్కడ పనివాళ్లం అని కార్తీక్ అంటాడు. అయితే, మీకే విలువ లేనప్పుడు నాకుండి ఏం ఉపయోగం. మీతోపాటే నేను కూడా తింటాను అని దాసు అంటాడు.
ఈరోజు దాసు మన అతిథి. కార్తీక్ మీరు కూడా కూర్చోని తినండి అని శివ నారాయణ అంటాడు. దీప ఇవాళ మనకు పండగే. యజమానులతో కలిసి భోజనం చేస్తున్నాం అని కార్తీక్ అంటాడు. దీపను సుమిత్ర పక్కన కూర్చోమని కార్తీక్ చెబుతాడు. దాంతో సుమిత్ర లేస్తే నేను వడ్డిస్తాను అంటుంది. జ్యోని కూర్చోమంటే నేను కూడా అమ్మతోపాటు వడ్డిస్తాను అంటుంది.
దీపకు జ్యోత్స్న వడ్డిస్తుంది. తల్లి వడ్డించట్లేదని దీప ఫీల్ అవుతుంటే సుమిత్ర చేతులతో తనకు అన్నట్లుగా చెప్పి దీప ప్లేట్‌లో సుమిత్ర వడ్డించేలా చేస్తాడు. తర్వాత స్పూన్ కింద పడేసినట్లు చేసి తల్లి పాదాలు తాకుతుంది దీప. అది జ్యోత్స్న చూస్తుంది. అల్లుడుకి ఫొటో తీసి పంపిస్తే.. అని శివ నారాయణతో దాసు కలిసి తిన్న ఫొటోలు తీస్తుంది పారిజాతం.
శివ నారాయణ పర్మిషన్ ఇస్తాడు. మనం గెలిచాం దీప. అది తెలుస్తుంది అని కార్తీక్ అంటాడు. ఆ ఫొటోలు శ్రీధర్‌కు పంపిస్తుంది పారిజాతం. అవి చూసి షాక్ అయిపోతాడు శ్రీధర్. ఈ ఘోరం నిజమే. శివ మామతో దాసుగాడు భోజనం చేయడం ఏంటీ అని అసూయ పడతాడు శ్రీధర్. దాసు ఇంట్లో ఎలా ఉండేవాడు, శ్రీధర్ ఎలా ఉండేవాడో చెబుతాడు.
ఇప్పుడు దాసు పొజిషన్ మీకు వచ్చింది మీ పొజిషన్ దాసుకు వచ్చిందని, దాసుకు శివ నారాయణ గారు వడ్డిస్తున్నారు కూడా కావేరి అంటుంది. నేను లేకుండా వీళ్లంతా ఎలా హ్యాపీగా ఉంటారో చూస్తాను అని శ్రీధర్ అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్