Karthika Deepam 2 Serial February 13: కార్తీక్ పిలుపుతో పొంగిపోయిన కావేరి.. శ్రీధర్‌కు షాక్.. డబ్బు తిరిగిస్తానని సవాల్-karthika deepam 2 serial today episode february 13th kaveri happy with karthik words star maa disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial February 13: కార్తీక్ పిలుపుతో పొంగిపోయిన కావేరి.. శ్రీధర్‌కు షాక్.. డబ్బు తిరిగిస్తానని సవాల్

Karthika Deepam 2 Serial February 13: కార్తీక్ పిలుపుతో పొంగిపోయిన కావేరి.. శ్రీధర్‌కు షాక్.. డబ్బు తిరిగిస్తానని సవాల్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 13, 2025 07:28 AM IST

Karthika Deepam 2 Serial Today Episode February 13: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కావేరికి కాంచన థ్యాంక్స్ చెబుతుంది. నా తోబుట్టువువే అని అంటుంది. ఇంతలో కావేరి ఇంటికి కార్తీక్ వస్తాడు. అతడి మాటలతో కావేరి మరింత సంతోషిస్తుంది. శ్రీధర్‌కు కార్తీక్ సవాల్ చేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందంటే..

Karthika Deepam 2 Serial February 13: కార్తీక్ పిలుపుతో పొంగిపోయిన కావేరి.. శ్రీధర్‌కు షాక్.. డబ్బు తిరిగిస్తానని సవాల్ (Photo: Hotstar)
Karthika Deepam 2 Serial February 13: కార్తీక్ పిలుపుతో పొంగిపోయిన కావేరి.. శ్రీధర్‌కు షాక్.. డబ్బు తిరిగిస్తానని సవాల్ (Photo: Hotstar)

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 13) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు సాయం చేసిన సవతి కావేరికి కాంచన కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. తాను చేసిన పాపం ముందు చేసిన సాయం చిన్నదక్కా అంటూ కావేరి కూడా ప్రేమ కురిపిస్తుంది. నాది ఒక్కటే కోరిక అని.. నువ్వు అక్కా అని పిలిచే పిలుపు మాత్రం ఎప్పుడూ దూరం చేయవద్దని కావేరి అడుగుతుంది.

నాకు తోబుట్టువు అయ్యావ్

పసి ప్రాణాన్ని కాపాడి నా అహంకారం మీద దెబ్బకొట్టావ్.. నీ మంచితనాన్ని తెలియజేసి నాకు తోబుట్టువు అయ్యావ్ అని కావేరితో కాంచన అంటుంది. ఈ ఒక్క మాట చాలక్కా అని కావేరి అంటుంది. తన ఇద్దరు భార్యల మధ్య ఆప్యాయతను చూసి శ్రీధర్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. చెడగొట్టాలని చూస్తాడు. డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు కాంచన, దీపను కార్తీక్ పంపాడని అంటాడు. మనుషులను అర్థం చేసుకోడం చేతకాదా మీకు అని దీప ఆగ్రహిస్తుంది.

శ్రీధర్ మరింత నోరు పారేసుకుంటాడు. అక్కను, దీపను ఏమీ అనవద్దని కావేరి అంటుంది. నా పెద్ద పెళ్లాం నీకు అక్క, నా కొడుకు పెళ్లాం నీకు కోడలు సరిపోయింది అని శ్రీధర్ అంటాడు. లెక్క లేకుండా మాట్లాడొద్దని కావేరి కోప్పడుతుంది. డబ్బులు ఎగ్గొట్టడానికి నాటకాలు ఆడుతున్నారని శ్రీధర్ అంటాడు.

కార్తీక్ సడెన్ ఎంట్రీ

శ్రీధర్ ఆ మాట అనగానే.. అక్కడితో ఆగితే అందరికీ మంచిది మాస్టారు అని తండ్రి కార్తీక్ అంటాడు. శౌర్యతో కలిసి కావేరి ఇంటికి సడెన్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ రాకతో అందరూ ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఎనిమిదో వింత అంటే ఇదేనేమో.. జరగవని అనుకున్నవన్నీ జరుగుతున్నాయని శ్రీధర్ అంటాడు. ఎలా ఉన్నావంటూ శౌర్యను కావేరి అడుగుతుంది. నువ్వు నా నానమ్మవే కదా అని శౌర్య అంటుంది. కార్తీక్‍ ఎందుకు వచ్చాడో అని దీప, కాంచన అనుకుంటారు. మనం తర్వాత మాట్లాడుకుందాం దీప అని కార్తీక్ అంటాడు. నువ్వు హెల్ప్ చేశావంట కదా.. నాన్నను థ్యాంక్స్ చెప్పమన్నాడు అని కావేరితో అంటుంది శౌర్య. పరాయివాడిలా థ్యాంక్స్ చెప్పిస్తున్నావా కార్తీక్ అని కావేరి అంటుంది.

నా ముందు నువ్వు ఆకాశంమంత

మీరు వచ్చారు కాబట్టే తెలిసిందని, లేకపోతే ఇచ్చిన మాట కోసం కొందరు నిజాన్ని జీవీతాంతం దాచేవారని దీపను ఉద్దేశించి కార్తీక్ అంటాడు. మీరు మాట్లాడడం అయిపోతే వెళ్లండి అని కాంచనతో కార్తీక్ చెబుతాడు. దీపను కూడా వెళ్లిపోవాలని అంటారు. మేం బయలుదేరతాం అని కాంచన అంటుంది. చాలా విషయాలు చెప్పకుండానే అర్థం చేసుకున్నావని కాంచన చెబుతుంది. ఇప్పటి నుంచి మా బంధువువే అని అంటుంది.

కొన్నిసార్లు నేను నిన్ను బాధపెట్టానని కాంచన అంటుంటే.. అలా అనొద్దని కావేరి అంటుంది. “నేను డబ్బులే ఇచ్చాను.. నువ్వు నాకు సౌభాగ్యాన్ని ఇచ్చావ్.. నీ మంచితనంతో పోల్చుకుంటే నా ముందు నువ్వు ఆకాశమంత ఉంటావ్ అక్కా. నాకు ఈ ఒక్క పిలుపు చాలు. ఇక నీ నుంచి నేను ఏమీ ఆశించడం లేదు” అని కావేరి అంటుంది. కాంచన, దీప, శౌర్య బయలుదేరేందుకు రెడీ అవుతారు. నాన్న.. చిన్న నానమ్మ మన ఇంటికి వస్తుందా అని శౌర్య అంటే కార్తీక్ మౌనంగా ఉంటాడు.

కార్తీక్ ఎందుకొచ్చినట్టు అని ఇంటి నుంచి బయటికి వెళ్లాక కాంచన అంటుంది. చూసివస్తానని దీప గుమ్మం దగ్గరికి వెళుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వారే దేవుడు అని ఓ స్వామిజీ చెప్పారంట అంటూ కావేరితో కార్తీక్ అంటాడు. అంటే ఇప్పుడు నీకు దేవుడిలా కనిపిస్తున్నానన్న మాట అని శ్రీధర్ సంతోషిస్తాడు. కావేరి చేసిన సాయాన్ని తాను చేసినట్టు చెప్పుకుంటున్న తండ్రి శ్రీధర్‌ను దరిద్రుడు అనేలా కామెంట్ చేస్తాడు. నువ్వు అన్న ప్రతీ మాటకు బదులిస్తానని చెబుతాడు.

జీవితాంతం రుణపడి ఉంటాను

కావేరికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు కార్తీక్. “మీ వల్ల నా తల్లికి అన్యాయం జరిగిందని నేను కూడా మిమల్ని ద్వేషించాను. ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడలేదు. ప్రేమగా పలుకరించలేదు. అయినా సరే నా రక్తబంధాలకు అర్థం కాని బాధ కూడా మీకు అర్థమైంది. నా కూతురు ప్రాణాలు కాపాడారు. దానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను” అని కార్తీక్ అంటాడు.

డబ్బు తిరిగిచ్చేస్తా

శౌర్య ఆపరేషన్‍కు కావేరి ఇచ్చిన రూ.41లక్షలను తాను అప్పుగా తీసుకున్నట్టు స్టాంప్ పేపర్లు ఇస్తాడు కార్తీక్. తాను అప్పుగా ఇవ్వలేదని, శౌర్య నా మనవరాలు అని కావేరి అంటుంది. తాను అన్న మాటలకు పౌరుషం వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నావా అని శ్రీధర్ అంటాడు. తనకు ముందు విషయం తెలిసి ఉంటే నిన్ను అన్ని మాటలు అననిచ్చే వాడిని కాదని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. సంవత్సరంలోలోపు అప్పు తీరుస్తానని కార్తీక్ అంటాడు. వద్దు అని కావేరి అంటుంది. మా అమ్మ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇవి తీసుకోండి అని కార్తీక్ అంటాడు. రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని అంటాడు. మీ గొప్ప మనసు అర్థమైనా, రుణం తీర్చుకోకుండా ప్రశాంతంగా ఉండలేనని చెబుతాడు.

ఆకలితో ఉన్న సింహం వేటకు వస్తే.. శ్రీధర్‌కు కార్తీక్ సవాల్

డబ్బు ఇవ్వలేకపోతే అని శ్రీధర్ అంటాడు. అప్పు తీర్చలేవంటాడు. నన్ను, నా తల్లిని అవమానించి నా లక్ష్యాన్ని గుర్తు చేశావని అతడితో కార్తీక్ అంటాడు. ఆకలితో ఉన్న సింహం గుహలో నుంచి వేటకు వస్తే ఎలా ఉంటుంది.. ఇక నుంచి నా ప్రయాణం అలా ఉంటుందని కార్తీక్ గట్టిగా చెబుతాడు. నన్ను కాదని బతకలేవని శ్రీధర్ అంటే.. బతికి చూపిస్తానని కార్తీక్ అంటాడు. క్యాలెండర్ మారేలోపు కార్తీక్ అంటే ఏంటో అందరితో పాటు నీకూ చూపిస్తానని కార్తీక్ సవాల్ చేస్తాడు. రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు కావేరికి థ్యాంక్స్ అని నమస్కరించి వెళతాడు కార్తీక్.

చిన్నమ్మ అంటూ కార్తీక్ పిలుపు.. పొంగిపోయిన కావేరి

ఇప్పటికైనా అర్థమైందా కావేరి.. నువ్వు వెంపర్లాడుతున్నావ్ కానీ వారికి ప్రేమ లేదు అని చిచ్చుపెట్టేందుకు శ్రీధర్ ప్రయత్నిస్తాడు. ప్రేమ ఉంటే కార్తీక్ నిన్ను పిన్ని అని పిలుస్తాడు కదా అని అంటాడు. పౌరుషంతో స్టాంప్ పేపర్ చేతిలో పెట్టి వెళ్లాడని అంటాడు. కార్తీక్ దృష్టిలో తల్లిని మోసం చేసిన మనిషివే అని చెబుతాడు. ఇంతలో కార్తీక్ మళ్లీ వస్తాడు. ఓ మాట చెప్పడం మరిచిపోయానని అంటాడు.

చిన్న నానమ్మ మన ఇంటికి వస్తుందా అని శౌర్య అడిగింది.. దానికి సమాధానం చెప్పడం మరిచిపోయానని కార్తీక్ అంటాడు. “నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావొచ్చు చిన్నమ్మా” అని కావేరితో కార్తీక్ చెబుతాడు. కార్తీక్ చిన్నమ్మ అని పిలువడంతో కావేరి సంతోషంతో పొంగిపోతుంది. నీ కూతురు ఇంటికి వెళ్లినట్టే నీ కొడుకు ఇంటికి రావొచ్చు అని కార్తీక్ అంటాడు. ఉంటాను చిన్నమ్మ అని బయలుదేరతాడు. కావేరి సంబరపడిపోతుంది. దీప కూడా సంతోషిస్తుంది.

శ్రీధర్ షాక్

కావేరి సంతోషంలో ఉంటే.. వాడేంటే అన్నాడు అని శ్రీధర్ అడుగుతాడు. చిన్నమ్మ అన్నాడు అని మురిసిపోతుంది కావేరి. “ఈ పిలుపు సరిపోతుందా.. ఇంకేమైనా సరిపోతుంది. కార్తీక్ నన్ను.. తల్లిని మోసం చేసిన మనిషిలా కాదు.. తల్లితో సమానంగా చూస్తున్నాడు. ఇప్పటికైనా కాస్త మనిషిని అర్థం చేసుకోండి” అని కావేరి అంటుంది. కావేరిని కార్తీక్ చిన్నమ్మ అనడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. “ఏంటి కార్తీక్ ఇలా షాకిచ్చాడు. నేను తప్ప అందరూ ఒక్కటయ్యారు. ఇంతకీ ఈ కార్తీక్ గొప్పోడు అయిపోతాడా. నా సాయం లేకుండా ఎలా అవుతాడులే. చూద్దాం ఏం చేస్తాడో” అని శ్రీధర్ అనుకుంటాడు.

చిన్నమ్మ అని పిలిచావంట

నువ్వు అక్కడికి రావేమో అనుకున్నానని కార్తీక్‍తో కావేరి అంటుంది. నీ కొడుకును కదా.. నా మనసు కూడా నీలాగే ఆలోచిస్తుంది కార్తీక్ అంటాడు. సాయం చేసిన మనిషికి కృతజ్ఞత చెప్పడం ధర్మం అంటాడు. కావేరిని చిన్నమ్మ అని పిలిచావంట అని కాంచన అడుగుతుంది. నువ్వు కూడా ఆమెను చెల్లెలు అనుకొనే వెళ్లావ్ కదా అని కార్తీక్ అంటాడు.

నువ్వు ఏ తప్పు చేయలేదు దీప

సాయం చేసిన మనిషిని అర్థం చేసుకున్న మీరు.. ఏ నేరం చేయని నన్ను ఎందుకు దోషిని చేస్తున్నారు కార్తీక్ బాబు అని దీప అడుగుతుంది. ఎవరికో ఇచ్చిన మాట కోసం నా వద్ద నిజం దాచడం తనను బాధపెట్టిందని అంటాడు. భార్యభర్త ఒక్కటే అని ప్రపంచానికి చెప్పేందుకు శివుడు.. తనలో సగభాగాన్ని భార్యకు ఇచ్చాడని అంటాడు.

“నువ్వు ఏమైపోతావో అని శౌర్య ఆరోగ్యం గురించి నీ దగ్గర నేను దాచాను.. నేను బాధపడతానని చిన్నమ్మ డబ్బులు ఇచ్చిన సంగతి నా దగ్గర నువ్వు దాచావ్. అర్ధనారీశ్వర తత్వానికి నిజమైన అర్థం ఇదే దీప” అని కార్తీక్ అంటాడు. దీపకు అర్థం చేసుకునే గుణం మెండుగా ఉందని అంటాడు. అంటే మీరు నన్ను క్షమించినట్టేనా కార్తీక్ బాబు అని దీప అంటుంది. నా ముందు నీ తప్పు నిరూపిస్తే దూరం పెడతానని మా నాన్న అనుకున్నాడని కార్తీక్ అంటాడు. తల్లి విలువ తెలిసిన వాడికి భార్య విలువ తెలియదంటావా దీప అని కార్తీక్ చెబుతాడు. నువ్వు ఏ తప్పు చేయలేదని కార్తీక్ అంటాడు.

డబ్బు ఎలా కడతావ్..

తీసుకున్న డబ్బుకు నోట్ రాసిచ్చావంట.. రూ.41లక్షలు ఎలా కడతావ్ అని కార్తీక్‍ను కాంచన అడుగుతుంది. కట్టకపోతే మీ నాన్న మనల్ని ఎంత అవమానిస్తాడని ఆందోళన చెందుతుంది. కార్తీక్ బాబు సవాల్ చేస్తే నిలబెట్టుకుంటారమ్మా అని దీప అంటుంది. తాతకు ఇచ్చిన మాటనే కాదు.. తండ్రికి ఇచ్చిన మాటను కూడా నిలబెడతారు.. నాకు ఆ నమ్మకం ఉంది అని దీప అంటుంది. నీ నమ్మకాన్ని నిలబెడతాను దీప అని కార్తీక్ అంటాడు. దీంతో నేటి (ఫిబ్రవరి 13) కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం