కార్తీక దీపం టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 30: దీపకు బెయిల్.. జ్యోత్స్నపై ఎంక్వైరీ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తాత-karthika deepam 2 serial today episode april 30 deepa gets bail shivannarayana blames karthik star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 30: దీపకు బెయిల్.. జ్యోత్స్నపై ఎంక్వైరీ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తాత

కార్తీక దీపం టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 30: దీపకు బెయిల్.. జ్యోత్స్నపై ఎంక్వైరీ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తాత

కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్ ఏప్రిల్ 30: దీపకు బెయిల్ ఇస్తుంది కోర్టు. జ్యోత్స్నపై ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. ఇంతలోనే తాత శివన్నారాయణను జ్యోత్స్న రెచ్చగొడుతుంది. కార్తీక్, దీపను నిందించేలా చేస్తుంది. తాత ఫైర్ అవుతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

కార్తీక దీపం టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 30: దీపకు బెయిల్.. జ్యోత్స్నపై ఎంక్వైరీ.. జ్యో రెచ్చగొట్టడంతో వార్నింగ్ ఇచ్చిన తాత (Photo: Credit JioHotstar)

కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 30) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దశరథ్ శరీరంలో దిగిన బుల్లెట్ దీప పట్టుకున్న గన్ నుంచి రాలేదని ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్టును జడ్జి చదువుతారు. నా క్లైంట్ దీప కూడా తాను గన్ పేల్చలేదని ముందు నుంచి చెబుతోందని లాయర్ కల్యాణ్ ప్రసాద్ అంటాడు. ఇప్పుడు దానికి ఆధారాలు వచ్చాయని చెబుతాడు. జ్యోత్స్న రెచ్చగొట్టడం వల్లే దీప గన్‍ను చేతిలోకి తీసుకుందని అంటాడు. సరిగ్గా అదే సమయంలో బుల్లెట్ తగిలిందని, మరి పేల్చిన గన్ ఎవరది అని కల్యాణ్ ప్రసాద్ అంటాడు.

ఆ బుల్లెట్ ఏమైంది

“దశరథ్‍కు తగిలిన బుల్లెట్ ఏ గన్‍లో నుంచి వచ్చింది.. అక్కడ వీళ్లలతో పాటు వేరే మనిషి కూడా ఉన్నాడు.. అతను ఎవరు? దీపను ఎందుకు ఈ కేసులో ఇరికించాలని అనుకుంటున్నాడు? దీపపై అంత పగ ఎవరికి ఉంది?” అని కల్యాణ్ ప్రసాద్ అంటాడు. వేరే గన్ నుంచి బుల్లెట్ వచ్చి ఉంటే.. శివన్నారాయణ లైసెన్స్డ్ గన్‍లోని బుల్లెట్ ఏమైందనే పాయింట్ తీస్తాడు కల్యాణ్ ప్రసాద్. దీంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. రిపోర్ట్ తారుమారు చేసేందుకు ఆ బుల్లెట్‍ను జ్యోత్స్ననే తీసి ఉంటుంది. ఆ బుల్లెట్ ఎలా మిస్ అయింది, ఎవరు మిస్ చేశారు, ఆ వివరాలు కూడా తెలియాల్సి ఉందని జడ్జికి చెబుతాడు కల్యాణ్ ప్రసాద్.

దీప నేరం చేయలేదు.. కానీ

ఈ ఆధారాలన్నీ పరిగణనలోకి తీసుకొని దీపను నిర్దోషిగా విడుదల చేసి, అసలైన నేరస్తులను శిక్షించాలని జడ్జిని కోరతాడు కల్యాణ్ ప్రసాద్. రిపోర్టుల్లో పొరపాటు జరిగిందని జ్యోత్స్న తరఫున లాయర్ భగవాన్ దాస్ అంటాడు. దీనికి అభ్యంతరం చెబుతాడు కల్యాణ్ ప్రసాద్. సాక్ష్యాధారాలను బట్టి దీప నేరం చేయలేదని అర్థమవుతోందని, కానీ భగవాన్ దాస్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు జడ్జి చెబుతారు.

దీపకు బెయిల్

ఇంతలో దశరథ్‍కు బుల్లెట్ తలిగిన ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఫొటోలను జడ్జికి కల్యాణ్ ప్రసాద్ ఇస్తాడు. అప్పుడు గన్ ట్రిగర్‌పై దీప అసలు వేలి పెట్టలేదని అంటాడు. ఫొటోలను జడ్జి పరిశీలిస్తారు. నిజమే.. దీప ఆ ట్రిగర్ మీద వేలి పెట్టలేదని అంటాడు. అవి మార్ఫింగ్ ఫొటోలు అనేలా భగవాన్ దాస్ వాదించబోతే.. అవి ఒరిజినలే అని ల్యాబ్ ధృవీకరించిందని కల్యాణ్ ప్రసాద్ చెబుతాడు. నేరం దీప చేయలేదని, నా క్లైంట్‍ను విడుదల చేయాలని కోర్టును అడుగుతున్నానని అంటాడు. ఈ కేసులో ఇప్పటి వరకు కోర్టుకు అందించిన సాక్ష్యాలు, ఆధారాలు, వాదనలు పరిశీలించిన మీదట ఈ కేసులో అసలైన నేరస్తులు వేరే వాళ్లు ఉన్నారని అర్థమవుతోందని జడ్జి చెబుతారు. అసలైన నేరస్తులు దొరికే వరకు దీపకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తోందని తీర్పు చెబుతారు జడ్జి. ప్రాసిక్యూటర్ వాదన పరిశీలనలోకి తీసుకొని ఈ తీర్పు ఇచ్చామని, ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.

జ్యోత్స్నపై విచారణకు ఆదేశం

గన్ తీసుకోవడం కూడా నేరమే కాబట్టి కోర్టు దీపను హెచ్చరిస్తోందని జడ్జి అంటారు. కోపంలో అలా చేశానంటూ క్షమాపణ చెబుతుంది దీప. జ్యోత్స్న పట్టుకున్న లైసెన్స్డ్ గన్‍లో బుల్లెట్ ఎలా మిస్ అయిందో ఆమెను విచారించాలని పోలీస్ శాఖను ఆదేశిస్తున్నానని జడ్జి చెబుతారు. వచ్చే నెల 15వ తేదీకి విచారణ వాయిదా వేశారు. బెయిల్ రావటంతో సంతోషంగా కార్తీక్ వైపు చూస్తుంది దీప. కోర్టు నుంచి కోపంగా బయటికి వస్తుంది జ్యోత్స్న.

దీపను ఆపార్థం చేసుకున్నామా!

ఏంటి మామయ్య మనం అవసరంగా దీపను అపార్థం చేసుకున్నామా అని శివన్నారాయణతో సుమిత్ర అంటుంది. వీళ్లేంటి దీప మీద సింపతీ చూపిస్తున్నారు.. వీళ్లు దీపపై కోపంతోనే ఉండాలి అని మనసులో అనుకుంటుంది దీప. కోర్టులో జరిగింది చూస్తే అలాగే ఉందని శివన్నారాయణ అంటాడు.

బావ చీట్ చేశాడు.. రెచ్చగొట్టిన జ్యో

దీప తప్పు చేయలేదేమోనని ఆలోచిస్తున్న శివన్నారాయణ, సుమిత్రను జ్యోత్స్న రెచ్చగొట్టేస్తుంది. ఏం జరిగిందో తెలియదం లేదా. దీప రావడానికి ముందే బావ ఎందుకు అంత కాన్ఫిడెంట్‍గా ఉన్నాడో అర్థం కావడం లేదా. భార్యను కాపాడుకోవడం కోసం, ఈ కేసు నుంచి తప్పించడం కోసం రిపోర్టులను మార్చేశాడు” అని అబద్ధం చెబుతుంది జ్యోత్స్న. ఈ మాటలను శివన్నారాయణ, సుమిత్ర నమ్మేస్తారు. మన కళ్ల ముందే దశరథ్‍ను దీప కాల్చిందకా అని జ్యోత్స్నకు వంత పాడుతుంది పారిజాతం. బావతో దీపే ఈ నాటకాలు ఆడిస్తోందని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు దశరథ్ ఇచ్చిన వాగ్మూలం అబద్ధం అయిపోయినట్టే కదా అని చెబుతుంది.

దీపకు.. బావకు తేడా ఏముంది?

డాడీని చంపాలనుకున్న దీపకు.. సాక్ష్యాలను చంపేసిన బావకు తేడా ఏముంది దీప అని జ్యోత్స్న అంటుంది. అసలు నేరస్తులు ఎవరో మనసు తెలియదా అని మాట్లాడుతుంది. జ్యోత్స్న మాటలతో శివన్నారాయణలో కోపం పెరిగిపోతుంది. దీప జైలులోనే ఉంటే రిపోర్టులు మారిపోతే, బయటికి వస్తే పరిస్థితి ఏంటని జ్యోత్స్న అంటుంది. దీపకు శిక్ష పడదని చెబుతుంది. శౌర్యకు పెళ్లి వయసు వచ్చే వరకు ఈ కేసు వాయిదా పడుతూనే ఉంటుందని, మనం మౌనంగా ఉంటే వాళ్లు గెలిచినట్టే అని అంటుంది. బావ మనుషులను కొనేశాడని విషం నింపుతుంది. మీరు అడుగుతారా, దీప నిర్దోషి అని ఒప్పుకుంటారా అన జ్యో అంటుంది. ఇలాగే చూస్తూ ఉంటే నేరం చేసిన దీప తప్పించుకుంటుంది, అప్పుడు శివన్నారాయణ పరువు దీప కాళ్ల దగ్గర పెట్టినట్టే అని ఫుల్‍గా రెచ్చగొట్టేస్తుంది జ్యోత్స్న. అలా నా ప్రాణం ఉండగా జరగదని తాత అంటాడు.

నువ్వు అంత కంటే దిగజారిపోయావ్

ఏం నేరం చేయలేదని నమ్మినందుకు కోర్టు బెయిల్ ఇచ్చిందని దీపతో కార్తీక్ అంటాడు. బెయిల్ ఇవ్వలేదు రా.. ఇచ్చేలా చేశావ్ అంటూ తాత శివన్నారాయణ వారి దగ్గరికి వస్తాడు. ఏం తాత జడ్జి చెప్పింది వినలేదా అని కార్తీక్ అంటాడు. అంతా నువ్వు అనుకున్నట్టు జరిగింది కదా అని సుమిత్ర అంటుంది. నేను అనుకోవడం ఏంటి అత్తా అని కార్తీక్ అడుగుతాడు. రిపోర్టుల్లో ఏముందో విన్నావ్ కదా అని అంటాడు. ఇన్నాళ్లు నీ భార్యే దిగజారిపోయిందని అనుకున్నాం, నువ్వు అంత కంటే దిగజారిపోయావని సుమిత్ర నిందిస్తుంది. ఏం జరిగిందన్నట్టు కార్తీక్, దీప చూస్తారు.

డబ్బుతో రిపోర్టులను కొనేశావ్

డబ్బుతో రిపోర్టులను కొనేశావ్ అని సుమిత్ర అంటుంది. దీంతో అత్తా అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. నువ్వు చేసిన పని ఎలా వచ్చిందని అనుకుంటున్నావా అని తాత శివన్నారాయణ అంటాడు. నిరూపించడం అని కార్తీక్ అంటాడు. రేపైనా అసలు నిజాలు బయటపడతాయి కదా అని జ్యోత్స్న.. అంటే నేను కూడా వాటి కోసమే ఎదురుచూస్తున్నానని కార్తీక్ అంటాడు.

నా కొడుకును షూట్ చేసింది దీపే

నువ్వు జీవితాంతం ఎదురుచూసినా ఆరోజు రాదు.. ఎందుకంటే నా కొడుకును షూట్ చేసింది దీపే అని తాత శివన్నారాయణ అంటాడు. అదంతా మా కళ్ల ముందే జరిగిందని అంటాడు. ఇంత నీతి తప్పి ప్రవర్తిస్తావని అనుకోలేదని కోప్పడతాడు. కార్తీక్ బాబును ఏమీ అనొద్దు.. రిపోర్టులు కాదు.. నేను ఏ తప్పు చేయాలని దీప అంటుంది. నేను తప్పు చేసి ఉంటే బుల్లెట్ నేను పట్టుకున్న గన్‍లోది అని రిపోర్ట్ రావాలని కదా అని అడుగుతుంది. అదంతా నీ భర్త చేసిన మోసం అంటూ నిందిస్తాడు శివన్నారాయణ.

నన్ను, మా మనవరాలిని ఇరికించావ్

నిజాన్ని.. నిజంలా ఉంచి ఉంటే నువ్వు జైలుకు వెళ్లే దానివని దీపతో శివన్నారాయణ అంటాడు. మీ ఇద్దరి తెలివితేటలను మెచ్చుకోలేకపోతున్నానని, నన్ను, నా మనవరాలిని కూడా ఈ కేసులు ఇరికించావని అంటాడు. మేం ఇరికించడం ఏంటి అని దీప అడుగుతుంది. లైసెన్స్డ్ గన్‍లో ఉన్న బుల్లెట్ ఎక్కడ అంటే ఎవరు సమాధానం చెప్పాలి అని సుమిత్ర అంటుంది. నేను సమాధానం చెప్పాలి, లేకపోతే నేను నేరం చేసిన మనిషిని అవుతానని చెబుతాడు. నా లైసెన్స్డ్ గన్ తీసుకున్న జ్యోత్స్న సమాధానం చెప్పాలి, లేకపోతే తాను నేరం చేసినట్టు అవుతుందని నానా మటాలు అంటాడు శివన్నారాయణ. చూశారా మమ్మల్ని ఏ స్థాయికి తీసుకొచ్చారో, మా పరువు కూడా పోయేలా చేశారని అంటాడు.

కట్టు కథ అల్లారు

పరువు పోగొట్టుకుంది మీరే, మీరు సాక్ష్యం చెబితే అవతలి వాళ్లకు శిక్ష పడిపోలా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు కార్తీక్. “న్యాయస్థానం ఉంది.. మన వ్యక్తిగత అభిప్రాయాలకు తగ్గట్టుగా తీర్పు ఇవ్వడానికి కాదు. యథార్థాలను బయటపెట్టేందుకు” అని కార్తీక్ అంటాడు. అయినా దీపనే దోషి అంటూ శివన్నారాయణ మాట్లాడతాడు. అక్కడ వేరే మనిషి ఉండి గన్ కాల్చి దీపను ఇరికించినట్టు లేని అపోహను సృష్టించారని అంటాడు. ఎవరా మనిషి అని అడుగుతాడు. నా ఇంటికి ఎందుకు వస్తాడని అంటాడు. కట్టుకథ అల్లి తప్పించుకునేందుకు చూస్తున్నాడని అంటాడు.

న్యాయవ్యవస్థ నుంచి తప్పించుకున్నా.. దేవుడి నుంచి తప్పించుకోవాలి కదా అని సుమిత్ర అంటుంది. వీళ్లు దేవుడిని కూడా మోసం చేస్తారని జ్యో అంటుంది. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. కేసు మీ కల్యాణ్ ప్రసాద్ నువ్వు చెప్పినట్టుగా మార్చేశాడు.. ఇవన్నీ దీప తెలివితేటలే అన్ని కన్నింగ్‍గా మాట్లాడుతుంది జ్యోత్స్న. కొన్ని రోజుల్లో యథార్థాలు బయటపడతాడని కార్తీక్ అంటాడు.

దీపకు శివన్నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్

ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో.. చేసిన పాపాలు ఎక్కడికీ పోవని శివన్నారాయణ అంటాడు. పాపాలను భగవంతుడు పగపడతాడని, మేం పడే బాధకంటే రెట్టింపు మీరు పడతారని అంటాడు. నీ శాపనార్థాలు ఫలించవని కార్తీక్ అంటాడు. ఇక వెళదామని సుమిత్ర అంటుంది. గుర్తు పెట్టుకో దీప. నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. చేసిన పాపాలకు నువ్వు శిక్ష అనుభవించాల్సింది. తప్పించుకున్నానని సంబరపడకు. వస్తావ్.. తొందరలోనే మళ్లీ వెనక్కి వస్తావ్. శిక్ష పడుతుంది, జైలుకు కూడా వెళావ్. ఆరోజు తొందరలోనే వస్తుంది” అని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. ముందు నేను ఆ ఎస్సైగాడిని కలవాలని జ్యోత్స్న అనుకుంటుంది. అక్కడి నుంచి వెళ్లిపోతారు.

వాళ్లు కూడా నమ్ముతారు

దీప నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు.. నేను నమ్మాను.. ఇప్పుడు కోర్టు నమ్మింది.. రేవు వాళ్లు కూడా నమ్ముతారని కార్తీక్ అంటాడు. ముందు బెయిల్ తీసుకొని ఇంటికి వెళదాం పదా, శౌర్య ఇంటికి దగ్గర ఎదురుచూస్తుంటుందని చెబుతుంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపిస్తామని దీపను స్టేషన్‍కు తీసుకెళతారు పోలీసులు. జ్యోత్స్న కావాలనే అందరినీ రెచ్చగొడుతోందని, ఇక ఆ మనిషి బుద్ధి మారదు అని అనుకుంటాడు కార్తీక్. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 30) ఎపిసోడ్ ముగిసింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం