Karthika Deepam Today Episode April 15: డాక్టర్ మాటతో కుంగిపోయిన శివన్నారాయణ.. దీపను బయటికి రానీయకూడదన్న సుమిత్ర-karthika deepam 2 serial today episode april 15 shivanarayana emotional on dasarath health deepa cried star maa hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today Episode April 15: డాక్టర్ మాటతో కుంగిపోయిన శివన్నారాయణ.. దీపను బయటికి రానీయకూడదన్న సుమిత్ర

Karthika Deepam Today Episode April 15: డాక్టర్ మాటతో కుంగిపోయిన శివన్నారాయణ.. దీపను బయటికి రానీయకూడదన్న సుమిత్ర

Karthika Deepam 2 Serial Today Episode April 15: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దశరథ్‍కు బుల్లెట్ తగిలిందని తెలిసి తల్లడిల్లుతుంది కాంచన. అన్నయ్యను చూడాలంటే వద్దంటాడు కార్తీక్. దశరథ్ పరిస్థితి గురించి డాక్టర్ చెప్పిన విషయంతో ఏడ్చేస్తాడు శివన్నారాయణ. పూర్తిగా ఏం జరిగిందంటే..

Karthika Deepam 2 Today April 15: డాక్టర్ మాటలతో కుంగిపోయిన శివన్నారాయణ.. దీపను బయటికి రానీయకూడదన్న సుమిత్ర

కార్తీక దీపం 2 నేటి ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప చేతిలో రివాల్వర్ ఉండగా దశరథ్‍కు బుల్లెట్ గాయమైందని కాంచన, అనసూయకు కార్తీక్ చెబుతాడు. దీంతో వారిద్దరూ షాక్ అవుతారు. దీపను పోలీసులు అరెస్ట్ చేశారని కార్తీక్ చెబుతాడు. దీప కాల్చడమేంటి బాబు అని అనసూయ అడుగుతుంది. “నేను కాల్చలేదని దీప అంటోంది.. దీప వల్లే గాయమైందని వాళ్లు అంటున్నారు. సరిగ్గా నేను వెళ్లే సరికి దీప చేతిలో గన్ ఉంది. మామయ్యకు గాయమైంది” అని కార్తీక్ బాధగా చెబుతాడు. అన్నయ్యకు ఎలా ఉంది.. ఆసుపత్రికి వెళదాం పదా అని కాంచన అంటుంది.

తాత రావొద్దన్నాడు

దశరథ్‍ను చూసేందుకు ఆసుపత్రికి వెళతామని కాంచన అంటే వద్దంటాడు కార్తీక్. రావొద్దన్నారని అంటాడు. ఎవరు రావొద్దన్నారని కాంచన అడుగుతుంది. తాత అని కార్తీక్ చెబుతాడు. మేం తోడబుట్టిన వారం, ఆయన ఎవర్రా అని కాంచన బాధగా అంటుంది. మా అన్నయ్య రా అని ఏడ్చేస్తుంది. నా తల్లి రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యకు బుల్లెట్ తగిలితే నన్ను వెళ్లొద్దని ఎలా అంటారంటూ అడుగుతుంది.

నేను తిట్లుతిన్నా

పదా చెల్లెమ్మా.. ముందు దశరథ్‍ను చూసి పోలీస్ స్టేషన్‍కు వెళ్లి దీపను చూసొద్దామని అనసూయ అంటుంది. అయినా, దశరథ్‍ను దీప కాల్చడమేంటి, ఏదో జరిగిందని అనసూయ ఏడుస్తుంది. మనమే అడుగుదాం పదా అని చెబుతుంది. “జరగాల్సిందంతా జరిగింది, నేను కాల్చలేదని దీప చెప్పింది. నీ భార్య వల్లే నా భర్తకు ఈ పరిస్థితి వచ్చిందని అత్త తిట్టింది” అని కార్తీక్ చెబుతాడు. మామయ్యను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లి అందరితో తిట్లుతిని వచ్చానని అంటాడు. ఎవరూ రావొద్దని పేరుపేరునా తాత చెప్పాడని చెబుతాడు. నా మీద ఏ మాత్ర గౌరవం ఉన్నా మీరు ఎక్కడికీ వెళ్లవద్దని కన్నీటితో అంటాడు కార్తీక్. తాత అనే మాటలు నువ్వు తట్టుకోలేమ్మా అని అంటాడు. తనకు అందాక గుండె దడగా అనిపించింది అందుకే అక్కా అని కాంచన ఏడుస్తుంది.

జ్యోత్స్న అన్నంత పని చేసింది

రేయ్.. నువ్వు మీ మామయ్యను చూశావా రా అని కాంచన అడుగుతుంది. మీ నాన్న చూడనివ్వలేదని కార్తీక్ చెబుతాడు. ఏంట్రా ఈ ఖర్మ అని తల పట్టుకొని ఏడుస్తుంది కాంచన. జ్యోత్స్న గన్ తీయడం ఏంటి.. దీప కాల్చడమేంటి.. అది మా అన్నయ్యకు తగలడం ఏంటి.. అని అంటుంది. నా చేతిలో గన్ పేలలేదని దీప అంటోందని కార్తీక్ అంటాడు. చేతిలో గన్ పేలకుండా బుల్లెట్ ఎలా తగిలింది రా కాంచన అంటే.. అదే అర్థం కావడం లేదమ్మా అని కార్తీక్ బాధగా అంటాడు. దీప చేతిలో ఉండడం తాను చూశానని చెబుతాడు. ఏం చేసిందో.. ఏం జరిగిందో భగవతుండికే తెలియాలని అంటాడు.

“జ్యోత్స్న అన్నంత పని చేసింది బాబు.. మీకు దూరం చేస్తానంది.. దూరం చేసింది. దీపా.. నేను నిన్ను వెళ్లకుడా ఆపాల్సిందే” అని బోరున విలపిస్తుంది అనసూయ. శౌర్యకు ఏమీ తెలియకూడదని కార్తీక్ అంటాడు. దీపకు ఏం కాదు కదా బాబు అని అనసూయ అడుగుతుంది. దీపకు, మామయ్యకు ఏమీ కాదని అంటాడు. శౌర్యకు ఈ విషయం తెలిస్తే ఓదార్చలేమని, దీప గురించి అడిగితే ఊరు నుంచి వచ్చేస్తుందని చెప్పాలని కార్తీక్ వివరిస్తాడు. భయంగా ఉందని కాంచన ఏడుస్తుంది.

దశరథ్ పోతే.. లాభమా.. నష్టమా..

దశరథ్‍కు ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. శివన్నారాయణ, సుమిత్ర ఏడుస్తూనే ఉంటారు. దీప ఇలా చేసి చచ్చిందేంటి. ఇప్పుడు దశరథ్ పోతే మనకు లాభమా.. నష్టమా అని మనసులో అనుకుంటుంది పారిజాతం.

గుండెకు దగ్గరగా బుల్లెట్

ఇంతలో డాక్టర్ బయటికి వస్తాడు. మా కొడుకు దశరథ్‍కు ఎలా ఉందని శివన్నారాయణ అడుగుతాడు. సుమిత్ర కూడా అడుగుతుంది. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కదా అని కన్నీటితో అడుగుతుంది. గుండెకు అతి దగ్గరగా బుల్లెట్ తగిలిగిందని, కళ్లు తెరిస్తే కానీ ఏం కాదని కాన్ఫిడెంట్‍గా చెప్పలేమని డాక్టర్ చెబుతాడు. ఏదో దాస్తున్నారు.. నేను ఆయనను చూడాలని అంటూ ఏడుస్తుంది సుమిత్ర. దశరథ్ స్పృహలోకి వచ్చే వరకు వేచిచూడాల్సిందేనని డాక్టర్ అంటాడు. ఏం కాలేదని కాన్ఫిడెంట్‍గా ఎందుకు చెప్పడం లేదని జ్యోత్స్న అడుగుతుంది. పరిస్థితి క్రిటికల్‍గా ఉందంటాడు డాక్టర్. ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తామని డాక్టర్ అంటే.. ప్రయత్నించడం కాదు, కాపాడాలని శివన్నారాయణ బాధగా అడుగుతాడు.

బతకడం చాలా కష్టం.. కుంగిపోయిన శివన్నారాయణ

మీతో మాట్లాడాలంటూ శివన్నారాయణను ఒక్కడిని పక్కకు పిలుస్తాడు డాక్టర్. మిమల్ని ఒక్కరినే రమ్మంటున్నారని అంటున్నారంటే ఏదో జరిగిందని సుమిత్ర ఏడుస్తుంది. ఏ గుండెకు ఏమైనా అయి ఉంటే.. ఈ గుండె ఆగేదని శివన్నారాయణ అంటాడు. వాడు బతుకుతాడు, మన కోసం బతుకుతాడని సర్దిచెబుతాడు. ఏదో తేడాగా ఉందే.. కొంపతీసి దశరథ్ చనిపోయాడా అని మనసులో అనుకుంటుంది పారిజాతం.

వాడి ప్రాణాలకు ప్రమాదం అన్న మాట తప్ప ఏదైనా చెప్పండని డాక్టర్‌ను అడుగుతాడు శివన్నారాయణ. సాధారణం ఇలాంటి మాటను నేరుగా చెప్పనని, తెలిసిన వారి కావడంతో చెబుతున్నానని డాక్టర్ అంటాడు. దశరథ్ బతకడం చాలా కష్టం అని డాక్టర్ చెబుతాడు. దీంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. “ట్రీట్‍మెంట్ కంటిన్యూ అవుతోంది. ఆక్సిజన్ మీద ఆయన ప్రాణాలు నిలిచాయి. ఎంత సేపు అలా ఉంటుందో తెలియదు. 48 గంటల్లోపు స్పృహలోకి వచ్చే అవకాశం లేదు. వస్తే మీ అదృష్టం. మీ ఫ్యామిలీని మీరు మెంటల్‍గా ప్రిపేర్ చేయండి. సారీ సర్” అని డాక్టర్ చెబుతాడు.

విషయం దాచిన శివన్నారాయణ

దీంతో ఛాతిని పట్టుకొని.. బాధగా అక్కడే ఉన్న కుర్చీలో కుప్పకూలినట్టుగా కూర్చుంటాడు శివన్నారాయణ. బోరును ఏడుస్తాడు. ఇంతలో అక్కడి వచ్చిన జ్యోత్స్న డాక్టర్ ఏం చెప్పాడని అడుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నారు మామయ్య అని సుమిత్ర అంటుంది. “ఏం కాలేదు, వాడికి ఏమవుతుంది, ఏం కాదు, వాడు చిన్నప్పుడు స్కూల్ బిల్డింగ్ నుంచి పడినా ఏం కాలేదు. ఆ గండాన్ని ఎలా దాటాడో, ఈ గండాన్ని కూడా దాటతాడు” అని శివన్నారాయణ ఏడుస్తాడు. డాక్టర్ చెప్పిన విషయాలను దాచేస్తాడు. ఆ ముదనష్టపు దీప మనల్ని బతకనిచ్చేలా లేదని శాపనార్థాలు పెడుతుంది పారిజాతం. సుమిత్ర ఏడుస్తూనే ఉంటుంది.

దశరథ్‍కు ఏమైనా అయితే నిన్ను బతకనివ్వం అంటూ దీపపై మరింత కోపం పెరిగేలా పారిజాతం అంటుంది. మన కంట్లో నుంచి వస్తున్న ప్రతీ కన్నీటి బొట్టుకు దీప సమాధానం చెప్పాల్సిందేనని కసిగా అంటుంది జ్యోత్స్న.

జైలులో దీప బాధ

“శౌర్యకు కార్తీక్ బాబు ఏం చెప్పారో ఏంటో, అందరికీ ఈ విషయం తెలిసి ఉంటుంది, నేను తప్పు చేశానని అనుకుంటున్నారేమో. అనుకున్నా పర్లేదు. ముందు దశరథ్ బతకాలి” అని జైలులో ఉన్న దీప బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఓ కానిస్టేబుల్ నీళ్లు ఇచ్చినా దీప తాగదు.

అలా జరిగితే యావజ్జీవ శిక్షే

ఇంతలో ఎస్ఐ వస్తాడు. దశరథ్‍కు ఆపరేషన్ చేశారని శివన్నారాయణ చెప్పారని, ఆయన బతకడం కష్టమని డాక్టర్ చెప్పారంట అని దీపతో చెబుతాడు. దీంతో దీప షాక్ అవుతుంది. అతడి బాడీలో నుంచి తీసిన బుల్లెట్‍ను ఫోరెన్సిక్ ల్యాబ్‍కు పంపాం. అది నీ చేతిలో ఉన్న గన్‍లో నుంచే పేలిందని రుజువైతే.. నేరం నువ్వు చేశావనేందుకు ఏ సాక్ష్యం అవసరం లేదు. ఈలోపు దశరథ్‍కు ఏమైనా అయితే నీకు యావజ్జీవ శిక్షే” అని ఎస్ఐ చెబుతాడు. దశరథ్‍కు ఏమీ కాకూడదు, ఆయన బతకాలి అని దీప ఏడుస్తుంది.

శౌర్యకు సర్దిచెప్పిన కార్తీక్

శౌర్య స్కూల్‍కు వెళ్లేందుకు రెడీ అవుతుంది. దీప కోసం ఎదురుచూస్తుంటుంది. నేను బయటికి వెళుతానని కార్తీక్ అంటే.. ఆసుపత్రికా, పోలీస్ స్టేషన్‍కా అని కాంచన అడుగుతుంది. అక్కడికి కాదని, వెళ్లి వచ్చాక చెబుతానని కార్తీక్ అంటాడు. అమ్మ ఎక్కడికి వెళ్లిందని శౌర్య అడుగుతుంది. చిన్న పని ఉంటే వెళ్లమన్నానని కార్తీక్ చెబుతాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావ్ నాన్న, అమ్మ నాతో చెప్పకుండా వెళుతుందా అని శౌర్య అంటుంది. అమ్మ వచ్చేస్తుందిలేరా అని కార్తీక్ సర్దిచెబుతాడు. నాన్న ఏం చేసినా నీ కోసమే కదా అని అంటాడు. సాయంత్రం అమ్మతో మాట్లాడదామని చెబుతాడు. నిజం తెలిస్తే నిన్ను ఏదార్చడం నా వల్ల కాదు రౌడీ అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఇక స్కూల్‍కు వెళ్లాలని అంటాడు.

నా ధైర్యమే వాడు

దశరథ్ ట్రీట్‍మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. సుమిత్ర విలపిస్తూనే ఉంటుంది. డాడీ దగ్గర నేనుంటా ఇంటికి వెళ్లు మమ్మ అని జ్యోత్స్న చెబుతుంది. ఏమీ తినకుండా, నిద్రపోకుండా బాధపడుతున్నావ్.. ఇంటికెళ్లు అని పారిజాతం కూడా చెబుతుంది. మామయ్య ఆయన పరిస్థితి గురించి మళ్లీ డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారా అని శివన్నారాయణను సుమిత్ర అడుగుతుంది. దశరథ్ బతకడం కష్టమని డాక్టర్ చెప్పిన మాటలను శివన్నారాయణ గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంటాడు. ధైర్యం చెప్పాల్సిన నువ్వే కంట తడి పెట్టుకుంటే ఎలా అని తాతను జ్యోత్స్న అడుగుతుంది. నేను ధైర్యంగా ఉండేదే మీ నాన్నను చూసి.. వాడే ప్రాణాలతో పోరాడుతుంటే ఈ కళ్లు ఏడవకుండా ఎలా ఉంటాయని శివన్నారాయణ అంటాడు.

జ్యోత్స్నపై పారు డౌట్

ముసలోడి వాలకం చూస్తుందే దశరథ్ టపా కట్టేసినట్టు మాట్లాడుతున్నాడని మనసులో అనుకుంటుంది పారిజాతం. ఈకాసేపైనా ఏడుపునటిస్తే కనీసం ఇల్లైనా రాసిస్తాడేమోనని ఆలోచిస్తుంది. బాధగా ఫేస్ పెడుతుంది. తాత డాడీకి ఏం కాదు అని, నా పెళ్లి డాడీ చేతుల మీదే జరుగుతుందని జ్యోత్స్న బాధగా అంటుంది. దశరథ్.. జ్యోత్స్నకు సొంత తండ్రి కాదు. కానీ ఎందుకు ఇంత ప్రేమ ఒలకబోస్తోంది. ఏంటో దరిద్రం. నాకు జ్యోత్స్నను చూసినా అనుమానం ఉంది. నేను ఇలా అనుకుంటున్నా.. జ్యోత్స్న కూడా ఇలాగే ఆలోచిస్తుందా” అని పారిజాతం అనుకుంటుంది.

దీప బయటికి రాకూడదు

ఎంతలో శివన్నారాయణకు ఎస్ఐ ఫోన్ చేస్తాడు. స్టేషన్‍కు వచ్చి ఒకసారి కలవాలని అంటాడు. సరే అని అంటాడు శివన్నారాయణ. ఏమైంది తాత అని జ్యోత్స్న అంటే.. స్టేషన్‍కు రావాలని అంటున్నారని శివన్నారాయణ చెబుతాడు. దీపకు బెయిల్ కోసం బావ ట్రై చేస్తున్నాడేమోనని అంటుంది జ్యో. దీప బయటికి రావడానికి వీల్లేదని సుమిత్ర అంటుంది. ఇది దెబ్బతిన్న ఆడదాని మాట అంటే.. దాని బతుకు జైలులోనే గడిచిపోవాలని కసిగా అంటుంది పారిజాతం. జరగబోయేది అదే గ్రానీ అని జ్యోత్స్న చెబుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 15) ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం