Karthika Deepam 2 Serial December 28 Episode: కార్తీక్ వద్దన్న పని చేసేందుకు దీప సిద్ధం.. ఓకే చెప్పిన కాంచన-karthika deepam 2 serial today december 28th episode deepa to start tiffin center despite karthik abjection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial December 28 Episode: కార్తీక్ వద్దన్న పని చేసేందుకు దీప సిద్ధం.. ఓకే చెప్పిన కాంచన

Karthika Deepam 2 Serial December 28 Episode: కార్తీక్ వద్దన్న పని చేసేందుకు దీప సిద్ధం.. ఓకే చెప్పిన కాంచన

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 28, 2024 07:49 AM IST

Karthika Deepam 2 December 28th Episode Today: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో వంట మనిషిగా దీప, డెలివరీ బాయ్‍గా కార్తీక్ ఇక పని చేయకూడదని అనుకుంటారు. ప్లాన్‍లు ఇలాగే కొనసాగిస్తానని జ్యోత్స్న అంటుంది. దీప ఓ ఆలోచన చేస్తుంది. కార్తీక్ వద్దన్నా వినదు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

Karthika Deepam 2 Serial December 28 Episode: కార్తీక్ వద్దన్న పని చేసేందుకు దీప సిద్ధం.. ఓకే చెప్పిన కాంచన
Karthika Deepam 2 Serial December 28 Episode: కార్తీక్ వద్దన్న పని చేసేందుకు దీప సిద్ధం.. ఓకే చెప్పిన కాంచన

కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 28) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప వంట మనిషిగా చేరిన ఇంటికి డెలివరీ బాయ్‍గా సరుకులు ఇచ్చేందుకు వస్తాడు కార్తీక్. దీంతో దీప, కార్తీక్ ఇద్దరూ షాక్ అవుతారు. తాము భార్యాభర్తలం అని ఆ ఇంటి ఓనర్‌కు చెప్పరు. ఇంతలోనే.. నీ భర్తకు ఉద్యోగం కావాలంటే సూపర్ మార్కెట్‍లో ఇప్పిస్తానంటూ దీపతో ఆ ఓనర్ చెబుతుంది. అప్పుడు ఎం చక్కా మీ ఆయన ఇంటికి సరుకులు తీసుకొస్తాడంటుంది. ఇంతలోనే ఇబ్బందిగా ఫీలైన దీప వంటకు టైమవుతుందని చెబుతుంది. సరుకులు టేబుల్‍పై పెడతాడు కార్తీక్.

yearly horoscope entry point

కార్తీక్‍‍కు రూ.50 ఇవ్వబోయిన కార్తీక్

సరుకులన్నీ లిస్ట్ ప్రకారం వచ్చేశాయి నేను బయలుదేరతా అని ఓనర్‌తో కార్తీక్ చెబుతాడు. సాయంత్రం కల్లా వచ్చేస్తానని కార్తీక్‍కు అర్థమయ్యేలా దీప అంటుంది. దీంతో ఎవరికి చెబుతున్నావ్ అని ఓనర్ అంటే మీకేనమ్మా అని దీప అంటుంది. వస్తానని ఎవరికి చెబుతున్నావ్.. వెళతానని కదా అనాల్సింది అని ఓనర్ సందేహిస్తుంది. “ఆవిడ చెప్పింది నాకు. దీప ఈ ఇంట్లో వంట మనిషిగా చేరిందన్న మాట” అని మనసులో అనుకుంటాడు. త్వరగా వచ్చేస్తానని దీపతో చెబుతాడు. వచ్చేస్తానేంటి.. వెళతానని కదా అనాల్సింది అని ఓనర్ మరోసారి కలుగజేసుకుంటుంది. కార్తీక్ బాబు సూపర్ మార్కెట్లో పని చేస్తున్నారన్న మాట అని దీపకు అర్థమవుతోంది.

సరుకులు తీసుకొచ్చిన వారికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలని, రూ.50 తీసుకొచ్చి కార్తీక్‍కు ఇవ్వాలని ఓనర్ చెబుతుంది. దీంతో కబోర్డులోని రూ.50 తెచ్చి కార్తీక్‍కు ఇచ్చేందుకు దీప సిద్ధమవుతుంది. ఇచ్చేందుకు దీప.. తీసుకునేందుకు కార్తీక్ ఇబ్బంది పడతారు. ఇలా చూసుకుంటారు. ఇలా డబ్బు ఇవ్వడం మాకు అలావాటే అని ఓనర్ అంటే.. నాకు అలవాటు లేదు మేడమ్ అని చెప్పి డబ్బు వద్దంటాడు కార్తీక్. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీప బాధగా చూస్తుంది. సూపర్ మార్కెట్‍లో పని చేస్తున్నా.. పొగరుకు ఏం తక్కువ లేదని ఓనర్ అంటుంది. కోటీశ్వరుడిగా చెబుతున్నాయని అంటుంది. దీంతో కార్తీక్ గొప్ప వ్యక్తి అనేలా మనసులో అనుకుంటుంది దీప.

మాటల్లో, చేతల్లో దీపను గెలువలేం

జ్యోత్స్న గదిలో పారిజాతం కూర్చొని ఉంటుంది. దీంతో నా రూమ్‍లో ఎందుకు ఉన్నావని జ్యోత్స్న అడుగుతుంది. మీ అమ్మ నీపై చాలా కోపంగా ఉందని పారిజాతం చెబుతుంది. ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తుంది. తాను బావ కార్తీక్ ఇంటికే వెళ్లానని అంటుంది. ఏమన్నారని పారిజాతం ప్రశ్నిస్తుంది. ఉండేది మండువాలో అయినా వారి మాట తీరు ఏం మారలేదని జ్యోత్స్న అంటుంది. దీపకు గట్టిగా ఇవ్వాలిందని పారిజాతం అంటే.. “దీప స్టామినా తెలిసే మాట్లాడుతున్నావా. దాని వీక్ పాయింట్ టచ్ చేసి గెలువాలని కానీ.. మాటల్లోనో.. చేతలతోనే దాన్ని గెలువడం కష్టం” జ్యోత్స్న.

ఇక ఇదే నా ప్లాన్

వాళ్ల బతుకు తెరువు ఏంటని పారిజాతం ఏంటే.. బావ జాబ్ కోసం ట్రై చేస్తుంటే తాను ఫాలో అయి.. చెడగొట్టానని జ్యోత్స్న చెబుతుంది. జాబ్ రాకుండా చేశానని అంటుంది. నాలుగైదు రెస్టారెంట్లు తిరిగినా అన్ని చోట్ల మన ఇన్‍ఫ్లుయెన్స్ వాడి బయటికి వెళ్లిపోయేలా చేశానని జ్యోత్స్న చెబుతుంది. బావ ఎక్కడా ఉద్యోగం కోసం ట్రై చేయడని అంటుంది. దీప కోసం బావ ఏం చేసినా దాన్ని తెలుసుకొని చెడగొట్టడమే మన ప్లాన్ అని జ్యోత్స్న అంటుంది. దీంతో బావ తన దగ్గరికే వస్తాడని అనుకుంటుంది. బావను తన వాడిని చేసుకునేందుకు అవకాశం వస్తుందని చెబుతుంది. దీప మూలన కూర్చొని బాధపడే రకం కాదని పారు అంటుంది. ఏదో ఒకటి చేస్తుందని, అది మనం తెలుసుకోవాలని అంటుంది.

మహానాభావుడు కాదు.. మోసగాడు

సాయంత్రమైనా దీప, కార్తీక్ రాకవపోవడంతో కాంచన ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇద్దరూ ఒకేసారి వచ్చేస్తారు. ఇద్దరూ చేరిన పని గురించి ఒకరిని ఒకరు అడగాలనుకుంటారు. ఇంతలోనే నాన్న అని శౌర్య పిలుస్తుంది. ఆ మహానుభావుడు ఉద్యోగం ఇచ్చాడా అని కాంచన అడిగితే.. “ఉద్యోగం ఉందని కాళ్ల దగ్గరికి రప్పించుకుంది మహానుభావుడు కదమ్మా.. ఓ మోసగాడు. పిలిస్తే వరుసకు నాన్న అవుతాడు. పేరు శ్రీధర్” అని కార్తీక్ చెబుతాడు. దీంతో కాంచన షాక్ అవుతుంది. ఆఫీస్‍కు పిలిచి అవమానం చేశాడని కార్తీక్ అంటాడు. తిట్టాడా అని దీప అడిగితే.. ఎగతాళి చేశాడని, తాను చెప్పిన పని చేయడం తప్ప గత్యంతరం లేదనేలా మాట్లాడాడని కార్తీక్ చెబుతాడు.

పని మానేయాలని ఇద్దరి నిర్ణయం

మాట్లాడాలి రా అని దీపను కార్తీక్ పిలుస్తాడు. “మా నాన్న పిలిచి ఇవ్వకపోతే నాకు ఉద్యోగం దొరకదా. ఏం చేయాలో అర్థం కాలేదు. కోపంగా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే సూపర్ మార్కెట్లో పని చేసేందుకు వర్కర్లు కావాలని పాంప్లెట్ కనిపించింది. ఇంటి ఖర్చులకు డబ్బు కావాలి. చేసేందుకు పని కావాలి. చదువుకు తగ్గట్టు ఉద్యోగం కావాలంటే నూటికి 80 మంది ఖాళీగా ఉంటారని” అని కార్తీక్ చెబుతాడు. అందుకని సూపర్ మార్కెట్‍లో చేరతారా అని దీప ప్రశ్నిస్తుంది. వంట మనిషిగా ఎందుకు వెళ్లావని తిరిగి ప్రశ్నిస్తాడు కార్తీక్. ఇంటి కోసమని దీప అంటుంది. ఇంటి కోసం నేను పని చేయకూడదా అని కార్తీక్ అంటాడు. ఈ క్రమంలో డబ్బు గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇద్దరూ పనికి ఇక వెళ్లకూడదని నిర్ణయించుకుంటారు. ఈ విషయాలు అమ్మకు చెప్పొద్దని, తట్టుకోలేదని కార్తీక్ అంటాడు. తన వద్ద ఓ ఆలోచన ఉందని దీప అనుకుంటుంది.

ఇంతలో స్వప్న వాంతులు చేసుకుంటుంది. దీంతో దిల్లూ (స్వప్న) ఏమైందని కాశీ టెన్షన్ పడతాడు. అయితే, స్వప్న నెల తప్పిందంటూ కాశీ సంతోషిస్తాడు. అలాంటిది ఏమీ లేదని, మీరు చేసిన వంట ఎఫెక్ట్ ఇదని స్వప్న చెప్పేస్తుంది. దీంతో కాశీ నిరాశపడతాడు. ఇంతలో దీప పిలిచిందని, వాళ్ల దగ్గరికి వెళతాడని కాశీతో దాసు చెబుతాడు. దీంతో తాము కూడా వస్తామని దాసుతో బయలుదేరతారు కాశీ, స్వప్న.

కన్నీరు పెట్టుకున్న కాంచన

పది మందికి ఉద్యోగాలు ఇచ్చే నా కొడుకు.. ఈరోజు ఉద్యోగం కోసం కష్టపడుతున్నాడని పరిస్థితులను తలుచుకొని కాంచన ఏడ్చేస్తుంది. కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో దాసు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఇదంతా మా నాన్న వల్లే కదా అని కాంచన అంటుంది. “మీ నాన్న మనకు మంచే చేశాడు. నేను ఏంటో నాకు గుర్తు చేశాడు” అని కార్తీక్ అంటాడు. మరోచోట ప్రయత్నించాలని దీప అంటే.. ఇక ఉద్యోగం కోసం వెతకనని కార్తీక్ అంటాడు. బిజినెస్ పెట్టాలని స్వప్న అంటుంది. పెట్టుబడి కోసం తాను సాయం చేస్తానని కాశీ.. అంటే కార్తీక్ వద్దంటాడు.

దీప టిఫిన్ సెంటర్ ఆలోచన.. వద్దన్న కార్తీక్

ఏం చేద్దామో చెప్పండని స్వప్న అంటుంది. దీంతో.. “నా దగ్గర ఓ సలహా ఉంది. మనం ఎదుటివారి కడుపు నింపితే మన కడుపు నింపుతుంది” అని దీప అంటుంది. అదెలా మనకే లేకపోతే ఎదుటి వాళ్లకు ఏం పెతడాం అని స్వప్న అడుగుతుంది. “బాగా ఆలోచించు స్వప్న. మనం టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టకూడదు. తక్కువ పెట్టుబడితో ఎక్కడో అక్కడ జీవితాన్ని మొదలుపెట్టవచ్చు కదా” అని దీప అంటుంది. తనకు ఇష్టం లేదని, వద్దని కార్తీక్ అంటాడు. తాను ఒకప్పుడు సైకిల్‍పై టిఫిన్స్ అమ్మిన విషయాన్ని వంటలక్క దీప చెబుతుంది. “దీపగా నువ్వు ఏం చేశావో అవసరం.. కార్తీక్ భార్యగా నువ్వు ఈ పని చేయడం ఇష్టం లేదు” అని కార్తీక్ అంటాడు. కానీ తాను టిఫిన్ సెంటర్ పెడతానని దీప చెప్పేస్తుంది.

నిర్ణయం తీసుకున్న దీప

వేరే ఆలోచిస్తానని, దీన్ని ఇంతటితో ఆపేయాలని కార్తీక్ అంటాడు. వాడికి ఇష్టం లేదంటున్నాడు కదా, వదిలేయ్ దీప అని కాంచన అంటుంది. “లేదమ్మా కార్తీక్ బాబు అలాగే అంటారు. మనం టిఫిన్ సెంటర్ పెడదాం” అని దీప అంటుంది. టిఫిన్ సెంటర్ కోసం బండి చూడాలని దాసును దీప అడుగుతుంది. బండి పెట్టేందుకు ఎవరినో ఒకరిని బతిమాలదాం అని చెబుతుంది. తమ ఇంటి ముందు పెట్టుకోవచ్చని దాసు అంటాడు. సరుకులు తీసుకొద్దామని కాశీతో దీప అంటుంది. టిఫిన్ సెంటర్‌కు ఏ పేరు పెడదామని స్వప్న అంటే.. మన మనుసులో ఏ పేరు ఉందని దీప చెబుతుంది.

సరేనన్న కాంచన

నీ పేరే పెట్టు దీప అని కాంచన అంటుంది. అయితే కార్తీక్‍కు ముందే చెప్పాలని అంటుంది. “ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి. ఆయన నా మర్యాద గురించి ఆలోచిస్తున్నారు. నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నా. కార్తీక్ బాబు బిజినెస్ స్టార్ట్ చేసే వరకైనా నన్ను టిఫిన్ సెంటర్ నడపనివ్వండి” అని దీప అడుగుతుంది. నువ్వు ఒప్పుకుంటే బావ ఒప్పుకున్నట్టే అత్త అని కాశీ అంటాడు. స్వప్న, దాసు కూడా అలాగే అంటాడు. “అందరూ చెబుతుంటే నేను ఎందుకు కాదంటాను. సరే కానివ్వండి” అని కాంచన అంగీకరిస్తుంది. అత్త ఒప్పుకుంది.. మనం పనులు మొదలుపెట్టొచ్చని కాశీ అంటాడు. తాను బండి చేస్తానని దాసు చెబుతాడు. కోట్లకు వారసురాలివి నువ్వు ఇడ్లీ బండి పెట్టుకోవడం ఏంటమ్మా దాసు మనసులో అనుకుంటాడు. దీప ఏం పేరు పెడుతుందో నీకు తెలుసా అని స్వప్నను కాంచన అడుగుతుంది. నేనైతే అదే అనుకుంటున్నా అని స్వప్న అంటుంది. అది ఏంటే ఏదే అని కాంచన అంటే.. సర్‌ప్రైజ్ అని అంటుంది స్వప్న. దీంతో కార్తీక దీపం 2 నేటి డిసెంబర్ 28 ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner

సంబంధిత కథనం