Karthika Deepam 2 Serial: ప్రాణదాతను కలిసిన కార్తీక్ - భర్త దగ్గర నిజం దాచిన దీప - పారిజాతం రివేంజ్
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 3 ఎపిసోడ్‌లో తన దగ్గరున్న లాకెట్ కథను దీపకు చెబుతాడు కార్తీక్. ఆ కథ విని దీప ఎమోషనల్ అవుతుంది. చిన్నతనంలో కార్తీక్ ప్రాణాలను కాపాడింది తానే అని తెలిసిన నిజం చెప్పలేకపోతుంది.
Karthika Deepam 2 Serial: తాను చాలా ఏళ్లుగా భద్రంగా దాచుకుంటున్న లాకెట్ వెనకున్న కథను దీపకు చెబుతాడు కార్తీక్. చిన్నతనంలో దేవుడి మొక్కు కోసం పల్లెటూరికి వెళ్లిన సమయంలో జ్యోత్స్న కోసం కలువ పూలు కోయడానికి కోనేరులో దిగానని అంటాడు కార్తీక్. అనుకోకుండా జారి లోతులో పడిపోయానని, ఈత రాకపోవడంతో మునిగిపోయానని, చనిపోతానని అనుకున్న టైమ్‌లో ఓ అమ్మాయి వచ్చి తనను కాపాడిందని కార్తీక్ చెబుతాడు.
దీప ఎమోషనల్...
కార్తీక్ ప్రాణాలు కాపాడింది తానే అన్నది దీపకు అర్థమవుతుంది. కార్తీక్ చెప్పిన కథ విని ఎమోషనల్ అవుతుంది. ఎర్ర రిబ్బన్లు కట్టుకొని, రెండు జడలతో పువ్వులు ఉన్న ఎరుపు రంగు బుట్ట గౌనులో ఉన్న ఆ అమ్మాయి ముఖం ఇంకా గుర్తుందని కార్తీక్ అంటాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మన వంతు సహాయం చేశారని మా నాన్న చెబుతుంటారని ఆ అమ్మాయి ఆ రోజు చెప్పిన మాటను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నానని కార్తీక్ అంటాడు. నేను కూడా ఆమెకు ఏదో ఒక రోజు సాయం చేస్తానని ఆ అమ్మాయికి మాటిచ్చానని కార్తీక్ అంటాడు.
పేరు మర్చిపోయా...
మళ్లీ కలుద్దామని అంటే చూద్దామని ఆ అమ్మాయి వెళ్లిపోయిందని, ఆమె పేరు కూడా ఆడగలేకపోయానని కార్తీక్ అంటాడు. నన్ను కాపాడే క్రమంలో ఆ అమ్మాయి లాకెట్ నా దగ్గరే ఉండిపోయిందని కార్తీక్ అంటాడు. ఆమెను కలిసి లాకెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నానని, కానీ ఆమెను ఇప్పటికీ కలవలేకపోయానని చెబుతాడు.
ఆమెకు భర్త అయ్యారు...
కార్తీక్ చెప్పిన మాటలు విని దీప ఎమోషనల్ అవుతుంది. ఆ అమ్మాయికి సాయం చేయడం కాదు...ఆమెకు భర్త అయ్యారని, ఆ అమ్మాయి మీ భార్య రూపంలో మీ పక్కనే, మీతోనే ఉందని మనసులో అనుకుంటుంది. కానీ నిజం మాత్రం బయటపెట్టదు. మీ ప్రాణాలు నేను కాపాడినట్లే...నా ప్రాణాలు మీరు కాపాడి రుణం తీర్చుకున్నారని, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారని దీప అనుకుంటుంది.
జన్మనిచ్చిన అమ్మతో...
ఆ ప్రాణదాత నేనే అని చెప్పేలా లేదా దీప డైలమాలో పడిపోతుంది. తన కథ విని దీప కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కార్తీక్ షాకవుతాడు. చిన్నతనంలో మీ ప్రాణాలు కాపాడిన ప్రాణదాతను బాగా గుర్తుపెట్టుకున్నారని అంటుంది. ఆ అమ్మాయి నా ప్లేస్‌లో మీ కళ్ల ముందే ఉంటే ఏం చేస్తారని కార్తీక్‌ను అడుగుతుంది దీప. జన్మనిచ్చిన అమ్మతో, చేతులెత్తి మొక్కే దేవతతో ఏం మాట్లాడుతాం. లోకాన్ని చూపించే కంటిపాపతో ఏం మాట్లాడుతాం. ఆ మనిషికి కృతజ్ఞత చెప్పుకొని జీవితాంతం రుణపడి ఉంటానని కార్తీక్ అంటాడు.
ప్రాణం నాది కాదు...
నా ప్రాణం తప్ప తను ఏది అడిగిన ఇచ్చేస్తానని కార్తీక్ అంటాడు. ఈ ప్రాణం నాది కాదు...నా భార్యది అంటే నీది అని చెబుతాడు కార్తీక్. దీప దగ్గర నుంచి లాకెట్ తీసుకుంటాడు. శౌర్య వచ్చి లాకెట్ అడిగిన ఇవ్వనని కార్తీక్ అంటాడు.
అమ్మ గుర్తుగా...
అమ్మ గుర్తుగా నాన్నతన మెడలో వేసిన జ్ఞాపకమని, అది కార్తీక్ దగ్గరకు చేరిందని, నేను కాపాడిన అబ్బాయి మీరే అని ఇన్నాళ్లు తెలుసుకోలేకపోయానని దీప ఎమోషనల్ అవుతుంది. లాకెట్‌ను నా జ్ఞాపకంగా పెట్టుకొని తన కోసం ఎదురుచూస్తున్న కార్తీక్‌కు నేనే మీ ప్రాణ దాత అని చెబితే ఇప్పటి కంటే ఇంకాస్త ఎక్కువ ప్రేమను చూపిస్తారని, ఇంకాస్త ఎక్కువ దగ్గరవుతారని దీప అనుకుంటుంది. అది తనకు వద్దని దీప అనుకుంటుంది.
ఛాలెంజ్‌లో గెలవాలి...
తన వల్లే కార్తీక్ కుటుంబం రెండు ముక్కలు అయ్యిందని, ఆస్తులు వదలుకొని నిరుపేదగా భర్త బతుకుతున్నాడని అనుకుంటుంది. సరిగ్గా సంవత్సరం లోపు రెస్టారెంట్ పెట్టుకొని అవార్డు అందుకుంటానని తాతయ్యతో చేసిన ఛాలెంజ్‌లో కార్తీక్ ఎలాగైనా గెలవాలని అనుకుంటుంది. కార్తీక్‌ను వెలేత్తి చూపించిన వాళ్లే అతడి విజయాన్ని పొగడాలని. కార్తీక్ నా మనవడు తాతయ్య గర్వపడేలా చెప్పుకొని అతడిని ఇంటికి తీసుకెళ్లాలి. కార్తీక్ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయిన రోజే ఆ ప్రాణదాతను తానే భర్తకు చెప్పాలని దీప నిర్ణయించుకుంటుంది.అంత వరకు ఈ నిజం తనలోనే దాచుకోవాలని అనుకుంటుంది.
బరువు కాదు...పరువు పోదు...
మార్కెట్‌కు వెళతారు దీప, కార్తీక్. కూరగాయల సంచి పట్టుకొని కార్తీక్ నడవటం చూసి దీప ఇబ్బందిపడుతుంది. తనకు ఇవ్వమని అంటుంది. కూరగాయల సంచి మోయలేనని అనుకుంటున్నావా...సంసారం అన్న తర్వాత బాధ్యతలు భార్యాభర్తలకు సమానమని, మోయడం బరువు కాదు...మోస్తే పరువు పోదని కార్తీక్ అంటాడు.
పారిజాతం ఎంట్రీ...
మీరు నడవటం మీ వాళ్లు ఎవరైనా చూస్తే ఎలా దీప అనగానే పారిజాతం సడెన్‌గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. విజిల్ వేసి ఇది కదా వైభోగం. ఇటువంటి సుమనోహర సుందర దృశ్యాన్ని చూసిన తన కళ్లు అదృష్టం చేసుకుంటున్నాయని అంటుంది. కార్తీక్ కూరగాయల సంచి పట్టనేల, కాలి నడకన పోవనేలా...ఇద అంతయు దరిద్రదేవతకు అక్క, శనిదేవతకు చెల్లి అయిన దీప పాదధూళి మహత్యమని అచ్చ తెలుగులో డైలాగ్స్ కొడుతుంది, మీ నాటక రంగ పాండిత్యం మా ముందు కాదు స్టేజ్‌పై చూపించమని కార్తీక్ అంటాడు. దీప నీ పక్కన ఉంటే ఇంతకంటే దరిద్రాన్ని అనుభవించాలని అంటుంది.
చూపు పడితే పాపం..
నీ పేరు చెబితే పాపం, నీ చూపు పడితే శాపం, నువ్వు ఎదురుపడితే దరిద్రం...అడుగుపెడితే నాశనం అని దీపను అవమానిస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.
లుంగీ కట్టుకొని టిఫిన్ సెంటర్‌లో పొట్లాలు కట్టినప్పుడే నీ మర్యాద మొత్తం పోయిందని కార్తీక్‌కు బదులిస్తుంది పారిజాతం. పుట్టుకతోనే తల్లిని మింగేసిన నష్టజాతకురాలు అంటూ దీపను మనసు నొచ్చుకునేలా మాట్లాడుతుంది. పారిజాతం ఎన్ని మాటలు అన్న కార్తీక్ మాత్రం దీపకు సపోర్ట్ చేస్తుంటాడు. పారిజాతానికి మాటకు మాట బదులిస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.