Karthika Deepam 2 Today February 11: నీ భార్యే మోసం చేసింది: చిచ్చుపెట్టిన శ్రీధర్.. దీపను నిలదీసిన కార్తీక్-karthika deepam 2 serial february 11th today episode sridhar tells truth karthik shatters star maa karthika deepam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Today February 11: నీ భార్యే మోసం చేసింది: చిచ్చుపెట్టిన శ్రీధర్.. దీపను నిలదీసిన కార్తీక్

Karthika Deepam 2 Today February 11: నీ భార్యే మోసం చేసింది: చిచ్చుపెట్టిన శ్రీధర్.. దీపను నిలదీసిన కార్తీక్

Chatakonda Krishna Prakash HT Telugu
Updated Feb 11, 2025 07:40 AM IST

Karthika Deepam 2 Serial Today Episode February 11: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఇచ్చింది కావేరి అనే నిజాన్ని బయటపెట్టేశాడు శ్రీధర్. ఈ క్రమంలో కార్తీక్‍ను బాధపెట్టేలా చాలా మాటలు అంటాడు. దీపపై కూడా కోపం రగిలేలా చేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 Karthika Deepam 2 Serial February 11: నీ భార్యే నిన్ను మోసం చేసింది: నిజం చెప్పిన శ్రీధర్.. కుంగిపోయిన కార్తీక్. .నిలదీత
Karthika Deepam 2 Serial February 11: నీ భార్యే నిన్ను మోసం చేసింది: నిజం చెప్పిన శ్రీధర్.. కుంగిపోయిన కార్తీక్. .నిలదీత

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 11) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దేవుడి దయవల్ల తన కూతురు శౌర్య ప్రాణాలతో బయయపడిందని, సంతోషంగా హోమం చేసుకుంటుంటే ఈ మనిషి వచ్చి దానికి విలువ లేకుండా చేశాడు అని తండ్రి శ్రీధర్‌పై కార్తీక్ ఆగ్రహిస్తాడు. నిజానికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది దేవుడికి కాదు.. నాకు అని శ్రీధర్ అంటాడు. నిజం చెబితే అది మీ అందరికీ పడుతుందని చెబుతాడు. నీ కూతురు ఆపరేషన్‍కు డబ్బు ఎవరు ఇచ్చారని అంటాడు. కావేరినే సాయం చేసిందని శ్రీధర్‌కు తెలిసిపోయిందా అని దీప కంగారు పడుతుంది. ఇంతలోనే నిజం చెప్పేస్తాడు శ్రీధర్.

డబ్బు సాయం చేసింది నేనే

శౌర్య ఆపరేషన్‍కు డబ్బు సాయం చేసేంది ఎవరో తెలుసా అని కార్తీక్‍ను శ్రీధర్ అడుగుతాడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కార్తీక్. పోనీ నేను చెప్పనా అని శ్రీధర్ అంటాడు. ఈయనకు ఎలా తెలుసునని శ్రీధర్ సవతి భార్య, డబ్బు సాయం చేసిన కావేరి కంగారు పడుతుంది. ఇప్పుడు శ్రీధర్ నిజం బయటపెడితే కార్తీక్ బాబు ఏమైపోతారో అని దీప భయపడుతుంది. చెప్పేయనా అని కావేరిని శ్రీధర్ అడుగుతాడు. చెప్పమనే కదా అడిగేది అని కార్తీక్ అంటాడు. ఆసుపత్రిలో డబ్బు కట్టి సాయం చేసింది నేనే అని శ్రీధర్ అంటాడు.

ప్రాణదానం చేశానని చెప్పేందుకు..

శౌర్య ఆపరేషన్‍కు డబ్బు నేనే ఇచ్చానని శ్రీధర్ అనడంతో అతడి మొదటి భార్య కాంచన, కార్తీక్ షాక్ అవుతారు. ఎందుకు అబద్ధం చెబుతున్నారని శ్రీధర్‌ను రెండో భార్య కావేరి నిలదీస్తుంది. తమరు నోరు మూసుకోండి శ్రీమతిగారు అని శ్రీధర్ అరుస్తాడు. బీరువాలో నగలు, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమయ్యాయో చెంపపగులగొట్టి అడగాలి అని అంటాడు. “జన్మనివ్వడం తప్ప నేను ఘనకార్యం చేయలేదనే నా కొడుకుకు.. నీ కూతురు కానీ కూతురుకు నేనే ప్రాణదానం చేశానని చెప్పేందుకు” అని శ్రీధర్ అంటాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు.

మా ఆవిడ ఇస్తే నేను ఇచ్చినట్టే.. కుంగిన కార్తీక్

శ్రీధర్‌ను నమ్మొద్దని స్వప్న అంటుంది. అయితే, మీ మమ్మీని అడుగు అని శ్రీధర్ అంటాడు. బ్యాంకు ఆనందరావుకు కాల్ చేసి కన్నుక్కున్నా శ్రీమతిగారు.. తమరు నాకు దొరికిపోయారు అని చెబుతాడు. నిజం ఒప్పుకోకతప్పదు అంటాడు. తానే డబ్బు ఇచ్చానని కావేరి నిజం చెప్పేస్తుంది. ఆ డబ్బులు మా ఆవిడ ఇచ్చిందంటే.. నేను ఇచ్చినట్టే అని కార్తీక్‍తో శ్రీధర్ చెబుతాడు. అవన్నీ వింటూ తనకు నచ్చని వారి నుంచే సాయం తీసుకోవాల్సి వచ్చిందనుకుంటూ మోనంగా కుంగిపోతాడు కార్తీక్.

కార్తీక్.. తలతిరుగుతోందా..

అవి నా డబ్బులు.. మీకూ వాటికి ఏం సంబంధం లేదని శ్రీధర్‌పై కావేరి కోప్పడుతుంది. అల్లరి చేయకండి అని అంటుంది. కావేరికి తాను భర్తనని, ఆవిడ ఆస్తి కూడా నాదేనని.. నేనే సాయం చేసినట్టు అని శ్రీధర్ అంటాడు. “ఏం కార్తీక్.. తల తిరుగుతోందా. ఛీఛీ వాళ్ల డబ్బుతో నా కూతురు లోలోపల ఎవరు కెలికేసినట్టు ఉందా” అని మరింత రెచ్చగొడతాడు శ్రీధర్.

కార్తీక్ ఆ డబ్బు నాది.. తెలిస్తే తీసుకోరని చెప్పలేదు.. వీళ్లందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కన్నీటితో కావేరి అంటుంది. శ్రీధర్ మాత్రం నానా మాటలు అంటూనే ఉంటాడు. సూటిపోటి మాటలతో బాధపెడుతూనే ఉంటాడు.

నీ భార్య నిన్ను మోసం చేసింది

కార్తీక్.. నీకు కూడా అన్యాయం జరిగింది రా అని శ్రీధర్ అంటాడు. అన్యాయం కంటే మోసం అనడం బెటర్ ఏమో అని చెబుతాడు. ఏంటది అని కార్తీక్ బాధగా అడుగుతాడు. “నా భార్య నన్ను మోసం చేసినట్టే.. నీ భార్య కూడా నిన్ను మోసం చేసింది” అని శ్రీధర్ అంటాడు. కొత్త డ్రామా చేశావా డాడీ నువ్వు అని స్వప్న అరుస్తుంది.

దీపకు ముందే తెలుసు.. నీకు చెప్పలేదు

శౌర్య ఆపరేషన్‍కు కావేరి డబ్బు ఇచ్చినట్టు నాకు తెలుసని శ్రీధర్‌కు తెలిసిపోయిందని, ఇప్పుడు ఆ విషయం చెబితే కార్తీక్ బాబు నన్ను ఏమనుకుంటారో అని మనసులో బాధపడుతుంది దీప. “రేయ్ కార్తీక్.. నా భార్య.. నీ కూతురు కోసం డబ్బు ఇచ్చిన విషయం నీ భార్యకు తెలుసు రా. కానీ నిజం నీ దగ్గర దాచింది. కావాలంటే అడుగు” అని నిజం కక్కేస్తాడు కార్తీక్.

దీపను నిలదీసిన కార్తీక్

ఆ పెద్ద మనిషి చెప్పింది నిజమేనా.. నీకు తెలుసా లేదా అని దీపను కోపంగా కార్తీక్ నిలదీస్తాడు. నీకు తెలుసా లేదా చెప్పు దీప అని మళ్లీ ప్రశ్నిస్తాడు. తెలుసు అని కన్నీరు పెట్టుకుంటూ చెబుతుంది దీప. దీంతో అందరూ షాక్ అవుతారు. పాపం జెంటిల్మెన్ కార్తీక్.. భార్య చేతిలో మోసపోయారంటూ మరింత బాధపెడతాడు శ్రీధర్. ఎవరికి చెప్పవద్దని నేనే దీప వద్ద మాట తీసుకున్నానని కావేరి అంటుంది. నీ భార్య నా భార్య ఇచ్చిన మాటకు కట్టుబడింది తప్ప.. నీ మనసుకు కట్టుబడలేదంటూ శ్రీధర్.. కార్తీక్, దీప మధ్య దూరం పెరిగేలా మాటలు అంటాడు.

నీ కూతురు బతుకు నేను పెట్టిన భిక్ష

నీ ఇంట్లో వెలుగు నా దయ వల్ల వచ్చిందని కార్తీక్‍తో శ్రీధర్ అంటాడు. మనం చేసిన సాయానికి వీళ్లంతా మనకు జీవితాంతం రుణపడి ఉండాలని అంటాడు. “ఒరేయ్ గుర్తుపెట్టుకో.. నీ కూతురు బతుకు నేను పెట్టిన భిక్ష” అని శ్రీధర్ అంటాడు. దీంతో బాధతో రగిలిపోతాడు కార్తీక్. పక్కనే కుర్చీని నేలకేకి కొడతాడు. ఇంట్లో స్తంభాన్ని పట్టుకొని ఏడ్చేస్తాడు. నిజాలన్నీ ఒకేసారి తెలిస్తే ఎవరి గుండైనా తట్టుకోవడం కష్టంలే అని కుటిలంగా మాట్లాడతాడు శ్రీధర్. తాను ఏం చెప్పాలనుకున్నానో చెప్పేశానని, ఇక వెళతానని చెబుతాడు. తనకు రెస్పెక్ట్ ఇవ్వాలని కాలర్ ఎగరేస్తాడు. కార్తీక్.. ఇందులో దీప తప్పేం లేదని అని కావేరి అంటుంది. వాళ్లు తేల్చుకుంటారులే అంటూ కావేరిని గద్దిస్తాడు శ్రీధర్. నువ్వు వద్దు అనుకున్న మనిషే.. నీ ఇంట్లో శుభం జరిగేందుకు కారణం అని గుర్తు పెట్టుకో అని కాంచనతో శ్రీధర్ అంటాడు. అందరూ జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని అంటాడు. కాంచన, దీప కన్నీరు పెట్టుకుంటారు.

నీకు ఎవరు మర్యాద ఇవ్వరు

శ్రీధర్, కావేరి బయటికి వస్తారు. తన తండ్రి శ్రీధర్‌పై స్వప్న ఆగ్రహిస్తుంది. మమ్మీ చేసిన సాయాన్ని నీ క్రెడిట్‍లో వేసుకుంటావా అని ఫైర్ అవుతుంది. భార్యభర్తల మధ్య రావొద్దంటూ శ్రీధర్ కోప్పడతాడు. అందరి ముందు కార్తీక్ ఫ్యామిలీ పరువు తీయాలా అంటే.. అద్దె కొంపలో ఉంటూ.. టిఫిన్ సెంటర్ నడిపే వీళ్లకే ఇంత పరువు ఉంటే పెద్ద మనిషి నాకెంత పరువు ఉండాలని అంటాడు. నీకు నువ్వే అనుకుంటే ఎవరు మర్యాదు ఇవ్వరని స్వప్న అంటుంది. నీవ్వు నా రెండు పెళ్లిళ్ల గురించి కామెంట్ చేయవద్దని శ్రీధర్ అంటారు.

తాను దొరికానని, దొరకకుండా ఎంత మంది ఉన్నారో ఎవరికి తెలుసునని, నీ మొగుడు కూడా వేరే ఏ అమ్మాయితోనేనా సంబంధం ఉండొచ్చేమో శ్రీధర్ అంటాడు. మీ కూతురుతో మాట్లాడుతున్నారు గుర్తుందా అని కావేరి అరుస్తుంది. ఈయనతో ఎలా వేగుతున్నావమ్మా అని స్వప్న అంటుంది. తనను కాంచన తల్లిలా ఆదరించిందని స్వప్న చెబుతుంది. నీకు వార్నింగ్ ఇచ్చేందుకు వచ్చానని శ్రీధర్‌తో అంటుంది.

సారీ చెప్పండి.. శ్రీధర్‌కు వార్నింగ్

చేసిన దానికి కార్తీక్‍కు సారీ చెప్పాలని శ్రీధర్‌తో కావేరి అంటుంది. చస్తాను కానీ సారీ చెప్పనని శ్రీధర్ తెగేసి చెబుతాడు. నీ మాటలతో మమ్మల్ని చంపేశావ్ కదా అని స్వప్న అంటుంది. మీరందరూ కలిసి నన్ను ఎంతో చంపారు అని శ్రీధర్ చెబుతాడు. పగ తీర్చుకుంటున్నావా అని స్వప్న అంటే.. ప్రాయశ్చితం చేసుకోమంటున్నానని అంటాడు. “ఇంకోసారి అన్నయ్య జోలికి వస్తే ఊరుకోను డాడీ” అని తండ్రి శ్రీధర్‌కు స్వప్న వార్నింగ్ ఇస్తుంది. ఊరుకోకపోతే ఊరేగు అంటూ కారు ఎక్కుతాడు శ్రధర్. నువ్వు వెళ్లు మమ్మీ.. నడిరోడ్డుపై పంచాయితీ పెట్టేలా ఉన్నాడని కావేరితో స్వప్న అంటుంది. శ్రీధర్ దారుణంగా తయారువుతున్నాడని, ఏం చేయాలని మనసులో అనుకుంటుంది.

చూపులే చెంప దెబ్బల్లా..

కార్తీక్ ఆపరేషన్‍కు కావేరి డబ్బు ఇచ్చిందని, తాను ఇచ్చినట్టేనని శ్రీధర్ అన్న మాటలను గుర్తుచేసుకొని కార్తీక్ బాధపడుతుంటాడు. దీపకు తెలిసి కూడా నీకు చెప్పలేదని, మోసం చేసిందని చెప్పిన విషయాలను తలుచుకుంటాడు. ఇంతలో కార్తీక్ వద్దకు దీప వస్తుంది. దీప వంక కోపంగా చూస్తాడు కార్తీక్. మీ కళ్లు నన్ను మోసం చేసినదానిలా చూస్తున్నాయి. చూపులే చెంపదెబ్బల్లా తగులుతున్నాయ్. కానీ నేనెంటో” అని అంటుంది. నువ్వేంటో ఆ పెద్ద మనిషి చెప్పి వెళ్లాడు కదా.. మాట్లాడలేక మౌనంగా నిలబడి పోయానని కార్తీక్ అంటాడు. శ్రీధర్ అన్న ఏ మాటకు సమాధానం చెప్పలేకపోయానంటాడు.

ఒక్కసారైనా చెప్పాలనిపించలేదా

దీనంతటికీ కారణం ఎవరు.. నువ్వు అని దీపపై ఆగ్రహిస్తాడు కార్తీక్. శౌర్యకు ఆపరేషన్ జరిగినప్పటి నుంచి.. సాయం చేసిన మనిషి ఎవరు అని వందసార్లైనా మాట్లాడుకున్నాం కదా.. ఒక్కసారైనా ఆ మనిషి ఫలానా అని నీకు చెప్పాలనిపించలేదా అని దీపను నిలదీస్తాడు కార్తీక్. చెప్పొద్దని కావేరి మాట తీసుకుందని దీప అంటుంది. మాట తీసుకుంది కాబట్టే.. నేను మాటపడ్డానని కార్తీక్ చెబుతాడు. నేను తప్పు చేశానని అనుకంటున్నారా అని కన్నీళ్లతో దీప అడుగుతుంది. “నిజం చెప్పకపోవడాన్ని ఏమంటారు దీప.. నాన్న అయితే మోసం అన్నాడు.. నేను దానికి ఏ పేరు పెట్టాలి” అని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 11) కార్తీక్ అడుగుతాడు.

Whats_app_banner

సంబంధిత కథనం