Karthika Deepam 2 Serial February 10: హోమానికి దశరథ్, సుమిత్ర.. దీపపై కార్తీక్ ఆగ్రహం.. సంతోషాన్ని నీరుగార్చిన శ్రీధర్-karthika deepam 2 serial february 10th today episode dasarath at deepa homam sridhar slams star maa karthika deepam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial February 10: హోమానికి దశరథ్, సుమిత్ర.. దీపపై కార్తీక్ ఆగ్రహం.. సంతోషాన్ని నీరుగార్చిన శ్రీధర్

Karthika Deepam 2 Serial February 10: హోమానికి దశరథ్, సుమిత్ర.. దీపపై కార్తీక్ ఆగ్రహం.. సంతోషాన్ని నీరుగార్చిన శ్రీధర్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 10, 2025 07:27 AM IST

Karthika Deepam 2 Serial Today Episode February 10th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య ఆపరేషన్ విజయవంతం అయినందుకు హోమం చేస్తారు కార్తీక్, దీప. హోమానికి దశరథ్, సుమిత్ర రావటంతో ఎంతో సంతోషిస్తుంది కాంచన. అయితే శ్రీధర్ వచ్చి నానామాటలు అంటాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam 2 Serial February 10: హోమానికి దశరథ్, సుమిత్ర.. దీపపై కార్తీక్ ఆగ్రహం.. సంతోషాన్ని నీరుగార్చిన శ్రీధర్
Karthika Deepam 2 Serial February 10: హోమానికి దశరథ్, సుమిత్ర.. దీపపై కార్తీక్ ఆగ్రహం.. సంతోషాన్ని నీరుగార్చిన శ్రీధర్

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 10) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లను కావేరి డ్రా చేసిందని తన స్నేహితుడికి ఫోన్ చేసి తెలుసుకుంటాడు శ్రీధర్. శౌర్య ఆపరేషన్ కోసం దీపకు డబ్బు సాయం చేసింది కావేరి అని అతడికి అర్థమవుతుంది. “ఎంత పని చేశావ్ కావేరి. నేను గీసిన గీత దాటవు అవుకున్నా.. కానీ గడపే దాటేశావ్” అని అనుకుంటాడు. పూజ సామగ్రి తెచ్చావని ఎందుకు అబద్ధం ఆడావో.. దీప ఇంటికి వచ్చినా ఎందుకు చెప్పలేదో మందు తాగకుండానే నాకు అర్థమైందంటాడు.

హోమానికి దీప పిలిచిందిగా.. నేను బాగా మండిస్తాడా కదా అని శ్రీధర్ అనుకుంటాడు. “అంతా ఒక్కటైపోతారా.. నా ప్రతాపం రేపు చూపిస్తా.. రేయ్ కార్తీక్ నువ్వు, నీ భార్య భలే దొరికారు రా. మీ అందరితో రేపు కబడ్డీకబడ్డీ ఆడుకుంటారా” అని గొడవ చేసేందుకు సిద్ధమవుతాడు.

కార్తీక్, దీప హోమం.. కాంచన కన్నీరు

శౌర్య ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కార్తీక్, దీప హోమం మొదలుపెడతారు. తన పుట్టింటి నుంచి ఎవరూ రారని తలచుకుంటూ కాంచన బాధగా ఉంటుంది. ఎన్ని కన్నీరు పెట్టినా ఎవరూ రారని కార్తీక్ మనసులో అనుకుంటుంది. తాను శివన్నారాయణ కుటుంబాన్ని ఆహ్వానించిన విషయాన్ని దీప గుర్తు చేసుకుంటుంది. మీ బాధ తీర్చేందుకు నేను ఓ ప్రయత్నం చేశానని చెబుతుంది. “మీ పుట్టింటి వాళ్లు కానీ.. మీ కోడలు పుట్టింటి వాళ్లు కానీ హోమంలో కూర్చున్న వారికి పట్టుబట్టలు పెట్టాలి” అని కాంచనతో పూజారి చెబుతాడు. ఎవరైనా వచ్చారా.. ఎవరూ వచ్చినట్టు లేరు అని అంటాడు.

అన్నీ నేనే

వీళ్లకు ఎవరూ లేరా హోమానికి వచ్చిన వారు అనుకుంటారు. కాంచన భర్తైనా ఉండాలి కదా ఓ మహిళ అంటుంది. తన భార్య దీప, తల్లి కాంచనకు అన్నీ తానే అని కార్తీక్ చెబుతాడు. “మా అమ్మకు నేనే పుట్టిల్లు. ఆవిడకు తల్లి, తండ్రి స్థానంలో నిలబటి బట్టలు పెడతా” అని కార్తీక్ చెబుతాడు. కార్తీక్ బాబు అని దీప అంటే.. మనం అవసరం లేని మనుషుల గురించి మనం ఎందుకు ఆలోచించాలని చెబుతాడు.

దశరథ్, సుమిత్ర వచ్చేశారు.. కాంచన సంతోషం

శివన్నారాయణ మాటను కాదని దీప, కార్తీక్ చేస్తున్న హోమానికి దశరథ్, కాంచన వస్తారు. దీంతో కాంచన చాలా సంతోషిస్తుంది. అన్నయ్యా, వదిన అంటూ నవ్వుతుంది. అత్తయ్యకు, మామయ్యకు హోమం గురించి తెలుసా అని దీపను కార్తీక్ ప్రశ్నిస్తాడు. కావాల్సిన వాళ్లను పిలవమన్నారు కదా.. పిలిచా అని దీప బదులిస్తుంది. నువ్వు సూపర్ వదినా అని స్వప్న అంటుంది.

మేమూ అంతే బాధపడ్డా

తన అన్నావదినలు దశరథ్, సుమిత్ర రావటంతో కాంచన ఆనందిస్తుంది. అన్నయ్యా.. నాన్నను దాటుకొని తోడబుట్టిన దాన్ని చూడడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా అని అంటుంది. నాన్న గౌరవాన్ని కాపాడాలా.. చెల్లి మర్యాదను కాపాడాలా.. నా బాధను నీ కంటే ఎవరు గొప్పగా అర్థం చేసుకోగలరు అని దశరథ్ అంటాడు. నువ్వు ఇంటికి వచ్చినా సాయం చేయనందుకు నువ్వు ఎంత బాధపడ్డావో.. సాం చేయలేనందుకు మేము అంతే బాధపడ్డామని చెబుతాడు. నిజం తెలుసుకొని సాయం చేయాలని అనుకునేలోపే నిజం తెలిసిందని, అప్పుడు ఎలా ముఖం చూపించమంటావు అని దశరథ్ ఎమోషనల్ అవుతాడు.

దీప నా కూతురు

దీప అంత ప్రేమగా పిలిచాక రాకుండా ఉంటామా అని సుమిత్ర అంటుంది. కూతురి కోసమే వచ్చారా.. అల్లుడి కోసం కాదనుకుంటా అని సరదాగా అంటాడు కార్తీక్. నాపైన కోపమా అని సుమిత్ర అంటే.. కార్తీక్ కోపం నాపై అని దశరథ్ చెబుతాడు. తన అత్తామామలను పిలిచిన దీపకు మళ్లీ థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. వీళ్లు పుట్టింటి వాళ్లేనా అని పూజారి అడుగుతాడు. కాంచనమ్మకు దశరథ్ స్వయానా అన్న అని దీప చెబుతుంది. దీప నా కూతురు, కార్తీక్ నా అల్లుడు అని సుమిత్ర అంటుంది. రెండు వైపులా పుట్టింటి వాళ్లం తామే అని చెబుతుంది. దీంతో ఎంత గొప్ప మనసమ్మా, మీరు అన్న మాటతో మా దీపకు కూడా అమ్మనాన్న దొరికారన్న సంతోషం కలుగుతోందని అనసూయ ఆనందిస్తుంది. నా అల్లుడి భార్య నా కూతురే కదా అని సుమిత్ర అంటుంది.

భర్త లేడు కదమ్మా

ఇంటికి ఒకరైనా నీ లాంటి అత్త ఉండాలి అని స్వప్న అంటుంది. సుమిత్ర మాటలతో అందరూ సంతోషంగా ఉంటారు. కాశీ రాలేదా అని అడిగితే.. మామయ్య దాసును చూసుకునేందుకు ఇంట్లో ఉన్నాడని స్వప్న బదులిస్తుంది. ముందు సుమిత్రకు బట్టలు పెడతామని దశరథ్‍తో సుమిత్ర అంటుంది. అయితే, కాంచన పక్కన భర్త లేడు కదమ్మా అని పూజారి అంటాడు.

హోమానికి కావేరి.. కోపంలో కాంచన, కార్తీక్

శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు సాయం చేసిన కాంచన సవతి కావేరి.. హోమానికి వస్తుంది. ఈమెను ఎవరు పిలిచారని కార్తీక్ అంటే.. నేనే పిలిచానని దీప చెబుతుంది. కాంచన రావడంతో కాంచన, కార్తీక్ కోపంగా మారతారు. ఈవిడను పిలవకుండా ఉండాల్సిందమ్మా అని దీపతో దశరథ్ అంటారు. దీపకు ఎవరిని పిలవాలో తెలియదు అని అనసూయ అనుకుంటుంది. నమస్తే అక్కా అని కావేరి అంటే.. కోపంగా చూస్తుంది కాంచన. నమస్తే అని విసుగ్గా అంటుంది.

శ్రీధర్ సడెన్ ఎంట్రీ

మా నాన్నను కూడా పిలిచావా అని దీపను కార్తీక్ అడుగుతాడు. లేదని దీప సమాధానమిస్తుంది. ఇంతలో శ్రీధర్ సడెన్‍గా ఎంట్రీ ఇస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఎవరు అసలైన పెళ్లాం అని హోమానికి వచ్చిన వారు అనుకుంటే.. ఈవిడే అనుకుంటా అని కాంచనను చూస్తూ ఓ మహిళ అంటుంది. మీరొచ్చారేంటి అని శ్రీధర్‌ను కావేరి ప్రశ్నిస్తుంది. దీప వచ్చి హోమానికి పిలిచినా.. నువ్వు అబద్ధం చెప్పావ్.. నమ్మినట్టు నటించా అని శ్రీధర్ అంటాడు. హోమానికి నా వాళ్లు రాకూడదా ఏంటి అని ప్రశ్నిస్తాడు. తన నుంచి విడిపోయిన భర్త శ్రీధర్ రావటంతో కాంచన చాలా ఇబ్బంది పడుతుంది. బాధగా కనిపిస్తుంది.

సంతోషాన్ని నీరు గార్చిన శ్రీధర్

దశరథ్ నన్ను గుర్తు పట్టారా.. మీ చెల్లెలు మొగుడినే అంటూ వెటకారంగా పలకరిస్తాడు శ్రీధర్. కోపంగా చూస్తాడు శ్రీధర్. సుమిత్ర కూడా అసహనంగానే ఉంటుంది. శివన్నారాయణ వచ్చి ఉండరులే.. ఆ పౌరుషం అలాంటిది అని మాట్లాడాడు. హోమానికి దశరథ్, సుమిత్ర వచ్చారని అందరూ సంతోషంగా ఉంటే.. దాన్ని తన సూటిపోటి మాటలతో నీరు గార్చేస్తాడు శ్రీధర్. ఆయన వస్తారని నాకు తెలియదు బాబు అని కోపంగా ఉన్న కార్తీక్‍తో దీప చెబుతుంది. శ్రీధర్ తన వాగుడు వాగుతూనే ఉంటాడు. పంతులు గారు కావాల్సిన కార్యక్రమం జరిపించండి అని స్వప్న చెబుతుంది.

శ్రీధర్ అవసరం లేదు..

తన తల్లి కాంచను బట్టలు పెట్టేందుకు.. తండ్రి శ్రీధర్ అవసరం లేదని కార్తీక్ కోపంగా అంటాడు. కాంచన ఒక్కరికే బట్టలు పెట్టాలని తన అత్త కాంచనకు చెబుతాడు. దశరథ్, సుమిత్ర అలాగే చేస్తారు. అన్నావదినల కాళ్లకు సంతోషంగా నమస్కరిస్తుంది కాంచన. దీంతో రగిలిపోతాడు శ్రీధర్. వీడికి నాన్న అవసరం లేదు.. ఆవిడకు భర్త అవసరం లేదు అంటూ మళ్లీ నోరుపారేసుకుంటాడు శ్రీధర్. ఈ మనిషికి ఇంటికి వెళ్లాక గట్టిగా ఉందిలే అని కావేరి అంటుంది. కార్తీక్, దీపకు కూడా దుస్తులు పెడతారు దశరథ్, సుమిత్ర. హోమం అయ్యాక బుద్ధి చెబుతా అని శ్రీధర్ అనుకుంటాడు.

పూర్ణాహుతిని కార్తీక్ మంటల్లో వేశాక హోమం పూర్తవుతుంది. తాము బయలుదేరతామంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు సుమిత్ర, దశరథ్. వచ్చినందుకు థ్యాంక్స్ మామయ్య అంటాడు కార్తీక్.

దీపపై కార్తీక్ ఆగ్రహం

హోమం పూర్తయ్యాక కోపంగా ఇంట్లోకి వెళతాడు కార్తీక్. అబ్బాయికి ఏమైందని పూజారి అడిగితే.. ఈ ఫ్యామిలీ ఇంతేనంటూ వెటకరిస్తాడు శ్రీధర్. అసలు కథ ఇప్పడే మొదలైందని చెబుతాడు. ఇంతలో దీప కూడా లోపలికి వెలుతుంది. హోమానికి తన తల్లి సవతి కావేరిని పిలిచినందుకు దీపపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు కార్తీక్. కావాల్సిన వారు అంటే ఎవరు అని ప్రశ్నిస్తాడు. స్వప్న వాళ్ల అమ్మను ఎందుకు పిలిచావంటాడు. మన మేలు కోరుకునే వారు, ఆవిడంటే మీకు కోపం లేదు కదా అని దీప అంటుంది.

మా అమ్మకు అన్యాయం చేసింది

“ఆవిడ మా అమ్మ మేలు కోరుకుందా.. నా గురించి, ఆ అమ్మ గురించి ఆలోచించిందా.. ఆవిడ ఇష్టానికి పెళ్లి చేసుకొని మా అమ్మకు అన్యాయం చేసింది” అని కావేరి గురించి దీపతో అంటాడు కార్తీక్. శౌర్య ప్రాణాలు కాపాడింది కార్తీక్ బాబు అని మనసులో అనుకుంటుంది దీప. తన సౌభాగ్యాన్ని పంచుకున్న సవతిని చెల్లిగా మా అమ్మ చూస్తుందని అనుకుంటున్నావా అని నిలదీస్తాడు. చూసే వాళ్లకు ఆవిడ సవతిగా లేదు.. మా అమ్మ.. అంటూ ఆగ్రహిస్తాడు. భరించే వాళ్లు సహనాన్ని పరీక్షించకూడదు దీప అని అంటాడు. నువ్వెందుకు మా అమ్మను ఏడిపిస్తావ్ అని అంటాడు. కావాల్సిన వాళ్లను పిలవాలని చెప్పినందుకు.. రాకూడని వాళ్లను పిలుస్తావా అని నిలదీస్తాడు.

నేను చేసిన పుణ్యం కూడా తెలియాలి

ఎవర్రా రాకూడని వారు ఇంట్లోకి వస్తాడు శ్రీధర్. ఇంట్లోకి ఎందుకొచ్చావ్ అని కార్తీక్ కోప్పడతాడు. నేనేదో పాపం చేసినట్టు నా కొడుకు అసహ్యించుకుంటున్నాడని, నేను చేసిన పుణ్యం కూడా తెలియాలి కదా అని శ్రీధర్ అంటాడు. మీరు నాకు పెద్ద పుణ్యమే చేశారులే.. ముందు మీర బయలుదేరండి అని కోపంగా అంటుంది కాంచన. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని శ్రీధర్‌తో కావేరి అంటుంది.

డబ్బు ఎవరు ఇచ్చారో తెలుసా..

నేను కూడా మంచి వాడినని ప్రూవ్ చేసుకోవాలి కదా అని శ్రీధర్ అంటాడు. నువ్వు మంచి వాడివని మేం ఒప్పుకోవాలంటే.. ఇంకో జన్మెత్తాలి అని చిరాకుగా అంటాడు కార్తీక్. అర్థంపర్థం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు.. ఇక్కడి నుంచి వెళ్లొచ్చు కదా అని అనసూయ అంటుంది. మై డియర్ చీపురుకట్ట అనసూయ నువ్వు కూడా అంత మాట అన్నాక ఇక నేను వచ్చిన పని మొదలుపెట్టకపోతే నాకే అవమానం అని శ్రీధర్ అంటాడు. “నీ కూతురు ఆపరేషన్‍కు డబ్బులు ఎవరు ఇచ్చారు” కార్తీక్‍ను శ్రీధర్ ప్రశ్నిస్తాడు. ఓ మనసు ఉన్న మనిషి అని కార్తీక్ అంటాడు. కావేరి ఇచ్చారని ఈయనకు తెలుసా.. ఆమె ఎవరికీ చెప్పనని అన్నారు కదా అని దీప అనుకుంటుంది. కావేరి వైపు దీప చూస్తే.. చెప్పలేదన్నట్టుగా తల ఊపుతుంది. మరి తెలియకుండా ఎందుకు అడుగుతున్నారని దీప అనుకుంటుంది.

ఆ మనిషి ఎవరో నేను చెప్పనా..

“ఆ మనసు ఉన్న మనిషి ఎవరో తెలుసుకోవచ్చా. ఆ మనిషి ఎవరో నీకైనా తెలుసా” అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. తెలియదు అని బదులిస్తాడు కార్తీక్. నీకు చెప్పాల్సిన అవసరం లేదంటాడు. ఆ మనిషి ఎవరో నేను చెప్పనా అని శ్రీధర్ అంటే.. అందరూ షాక్ అవుతారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ ముగిసింది. ఆపరేషన్‍కు డబ్బు ఇచ్చింది కావేరి అని శ్రీధర్ చెబితే.. కార్తీక్ ఎలా స్పందిస్తాడో తదుపరి ఎపిసోడ్‍లో ఉండనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం