Karthika Deepam 2 Serial: మా నాన్నకు ఏదైనా జరిగితే నిన్ను వదిలిపెట్టనని పోలీస్ స్టేషన్‌లో ఉన్న దీపకు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. దీపపై నిందలు వేస్తుంది. ఆ మాటలను సహించలేని దీప...జోత్స్న పీక పట్టుకుంటుంది. నీకు ఏ దురుద్దేశం లేకపోతే గన్ ఎందుకు బయటకు తీశావని నిలదీస్తుంది. నొప్పితో విలవిలలాడుతూ తనను వదిలేయమని జ్యోత్స్న అరుస్తుంది. కార్తీక్‌తో పాటు ఎస్ఐ వచ్చి జ్యోత్స్నను వదిలిపెట్టమని దీపకు చెబుతారు.
నన్ను చంపబోయి మా డాడీని దీపనే షూట్ చేసిందని జ్యోత్స్న అంటుంది. ఆమె మాటలతో దీప కోపం పట్టలేకపోతుంది. జ్యోత్స్న అని అరుస్తుంది. సెల్‌లో ఉన్న మనిషికి వార్నింగ్ ఇవ్వాలని చూస్తే ఇలాగే ఉంటుందని కార్తీక్ అంటాడు.
మీరు చేసింది తప్పేనని జ్యోత్స్నకు క్లాస్ ఇస్తాడు ఎస్ఐ. మీకు మీకు ఏమన్నా గొడవలు ఉంటే బయట చూసుకొండి..ఈ కేసు గురించి అయితే కోర్టులో చూసుకొండి. ఇలా స్టేషన్‌లో కొట్టుకుంటే మరో కేస్ బుక్ చేస్తామని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు. మనం కోర్టులోనే తేల్చుకుందామని అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
బయటివాళ్లు ఎవరిని దీపను కలవనివ్వద్దని, డబ్బుతోసాక్ష్యాలు కొనగలదని ఎస్ఐతో అంటుంది జ్యోత్స్న. తమరు వచ్చిన పని చూసుకుంటే మంచిదని కార్తీక్ సెటైర్ వేస్తాడు. జ్యోత్స్న వెళ్లిపోగానే దీపకు క్లాస్ ఇస్తాడు కార్తీక్. ఎందుకు నీకు అంత కోపం...నీ కోపం వల్ల నువ్వు లోతుగా ఇరుక్కుపోతున్నావని, నిన్ను ఎలా కాపాడాలో తెలియడం లేదని అంటాడు.
మీరు నన్ను నమ్మడం లేదా అని కార్తీక్‌ను అడుగుతుంది దీప. తాను ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని దీప అంటుంది. జ్యోత్స్న నీ చేత తప్పు చేయించింది కార్తీక్ అంటాడు. గన్ నీ చేతిలో ఉంది. మావయ్యకు బుల్లెట్ తగిలింది. కానీ నువ్వు తప్పు చేయలేదు అనడానికి మన దగ్గర ఒక్క సాక్ష్యం, ఆధారం కూడా లేదని కార్తీక్ అంటాడు. లాయర్‌కు నిజం చెబితే ఈ కేసు నుంచి బయటపడొచ్చని చెబుతాడు.
దశరథ్ మావయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆయనకు ఏమన్నా జరిగితే అని కార్తీక్ అనగానే అతడి మాటలను దీప ఆపేస్తుంది. దశరథ్‌కు ఇలా జరిగిందంటేనే తట్టుకోలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుమిత్రమ్మకు అన్యాయం జరగడానికి వీలులేదని అంటుంది. మావయ్య ప్రాణాలతో బయటపడాలి. నువ్వు ఈ కేసు బయటపడాలి. రెండు మన చేతుల్లో లేవు. నీ నిజాయితీపై నమ్మకంతో మొండిగా నేను ముందుకు వెళుతున్నానని కార్తీక్ అంటాడు. శౌర్య, అమ్మ, తాత, అత్త ఎవరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదని ఎమోషనల్ అవుతాడు.
కార్తీక్ కోసం పోలీస్ స్టేషన్ బయటే ఎదురుచూస్తుంటుంది జ్యోత్స్న. కార్తీక్ బయటకు రాగానే మా నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న. నా భార్య పోలీస్ స్టేషన్‌లో ఉందని కార్తీక్ బదులిస్తాడు. దీప నన్ను చంపాలని చూసిందని చెబుతుంది. ఈ మాట అనే అర్హత నీకు లేదని కార్తీక్ అంటాడు. నువ్వు దీపను చంపాలని అనుకున్నావు. కానీ దీప నిన్ను మార్చాలని చూసింది. గన్‌తోనా అని వెటకారంగా మాట్లాడుతుంది జ్యోత్స్న.
ఆ గన్ దీప చేతికి ఎలా వచ్చింది? మీ ఇంట్లో బీరువాలో ఉన్న గన్ దీప తీసిందా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నీ ఉద్దేశాలు, ఆలోచనలు తెలిసే నీకు బుద్దిచెప్పాలని మీ ఇంటికి వచ్చింది. మరి మా తాతకు నిజం చెప్పకుండా నాన్నను దీప ఎందుకు కాల్చిందని జ్యోత్స్న కోపంగా అడుగుతుంది.
కూతురు గురించి మాట్లాడితే దీప బుర్ర వేరేలా పనిచేస్తుంది. దీప వీక్‌నెస్ మీద కొట్టి రెచ్చగొట్టావు. గన్ దీప చేతికి వచ్చేలా చేశావని జ్యోత్స్న ప్లాన్‌ను బయటపెడతాడు. మరి గన్ ఎలా పేలింది? డాడీని ఎలా కాల్చింది అని జ్యోత్స్న అడుగుతుంది. భార్య మీద ప్రేమలో ఇలా మాట్లాడుతున్నావు కానీ దీప నిజంగానే తన తండ్రిని కాల్చిందని జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
నిన్ను షూట్ చేసి ఉంటే అలాగే అనుకునేవాడిని అని కార్తీక్ కోపంగా బదులిస్తాడు. ఎవరు ఎవరిని షూట్ చేశారో కోర్టులో తేలుతుందని చెబుతాడు. దీప కావాలని కాల్చిందా...పొరపాటుగా కాల్చిందా అన్నది పక్కన పెడితే తన చేతిలో ఉన్న గన్ పేలింది. మా నాన్నకు ఏమన్నా అయితే అమ్మ, తాత బతుకుతారా? అని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతుంది జ్యోత్స్న.
డాడీ ఎప్పుడు కళ్లు తెరుస్తాడా అని ఏం తినకుండా వాళ్లు హాస్పిటల్‌లోనే ఎదురుచూస్తున్నారని అంటుంది. కానీ నువ్వేమో నీ భార్యను కాపాడటానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావని, నీ ప్రేమలో స్వార్థం ఉందని కార్తీక్‌పై నిందలు వేస్తుంది జ్యోత్స్న.మా కారణాలకే కాదు మా కన్నీళ్లకు మీ దగ్గర విలువ ఉండదని అంటుంది.
కూతురు దూరమవుతుందని తెలిసిన తాత పట్టుదల వదులుకోలేదు. తల్లి పుట్టింటికి దూరమవుతుందని తెలిసిన నువ్వు నీ పట్టుదల వదులుకోలేదు. మీరు పట్టుదల వదులుకోలేనప్పుడు నేను ప్రేమను వదులుకోలేనని అంటుంది. అన్ని నీ కోసమే ప్రేమతో చేశానని నిజం బయటపెడుతుంది.
దేని గురించి నీతో మాట్లాడాలని అనుకోలేదని, ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకుందామని కార్తీక్ అంటాడు.
నీ కారణంగా మేము ఎడుస్తున్నామని కార్తీక్ అంటాడు. కానీ ఇలా రోడ్డున పడి ఏడవటం లేదని అంటాడు. మావయ్య కోసం అమ్మ...అమ్మ కోసం శౌర్య, వీళ్ల కోసం నేను ఏడుస్తున్నామని అంటాడు.
చదువుకునేటప్పుడే నువ్వంటే నాకు ఇష్టం లేదని చెబితే ఈ రోజు ఇంతమంది నీ వల్ల ఏడవాల్సిన అవసరం ఉండేది కాదని కార్తీక్ అంటాడు. నువ్వు ఒక్కదానివే బాధపడుతున్నట్లు మాట్లాడొద్దు అని జ్యోత్స్నకు క్లాస్ ఇస్తాడు కార్తీక్.
దీప మాత్రం ఈ కేసు నుంచి తప్పించుకోలేదని, చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే. జైలు జీవితం గడపటానికి సిద్ధంగా ఉండమని నీ ప్రియమైన భార్యకు చెప్పు అని కార్తీక్‌కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
దీప లేకుండా అన్నం తిననని శౌర్య మొండికేస్తుంది. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. అమ్మ ఏది అని కార్తీక్‌ను అడుగుతుంది శౌర్య. అమ్మ ఊరు వెళ్లిందని కార్తీక్ అబద్ధం ఆడుతాడు. ఇప్పుడే అమ్మతో మాట్లాడుతానని ఫోన్ చేయమని శౌర్య గోల చేస్తుంది. ఇప్పుడే ఇద్దరం అమ్మ దగ్గరకు వెళ్లిపోదామని కార్తీక్‌తో అంటుంది శౌర్య
శౌర్యను బుజ్జగిస్తాడు కార్తీక్. అమ్మ నాకు ఫోన్ చేసి నీకు గురించి అడిగిందని, నువ్వు భోజనం చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావని అమ్మతో చెబుతానని కార్తీక్ అంటాడు. ఈ నాన్న నీకు వద్దా అని శౌర్యను అడుగుతాడు. కావాలి అని శౌర్య బదులిస్తుంది. కావాలి అంటే నువ్వు నా మాట వినాలి. భోజనం చేయాలని అంటాడు. నాకు కథలు చెప్పాలి. ఆడిస్తూ అన్నం తినిపించాలని శౌర్య అంటుంది. శౌర్య చెప్పినట్లే చేస్తాడు కార్తీక్. కథలు చెప్పి అన్నం తినిపిస్తాడు.
శౌర్య లోపలికి వెళ్లగానే లాయర్ కళ్యాణ్ ప్రసాద్ మన కేసు వాదించడానికి ఒప్పుకున్నాడని కాంచన, అనసూయలతో కార్తీక్ చెబుతాడు. దశరథ్ మావయ్య కూడా స్పృహలోకి వచ్చాడని అంటాడు. కార్తీక్ మాటలతో కాంచన, అనసూయ ఆనందపడతారు.
సుమిత్ర, శివన్నారాయణ ఇద్దరు భోజనం చేయకుండా దశరథ్ కోసం ఎదురుచూస్తుంటారు. సుమిత్రను భోజనం చేయమని శివన్నారాయణ అంటాడు. ఆయన కళ్లు తెరిచేవరకు నేను మంచి నీళ్లు కూడా తాగనని అంటుంది. మంగళగౌరి వ్రతం చేసినప్పుడు దీర్ఘ సుమంగళిభవ అని మీరు నన్ను దీవించేవారు. మీ దీవెనలు నిజం కావాలని, మా ఆయన కళ్లు తెరవాలని సుమిత్ర కన్నీళ్లతో అంటుంది. దశరథ్ స్పృహలోకి వస్తాడు. కళ్లు తెరుస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం