Karthika Deepam 2 Serial:దీపతో బంధాన్ని తెంచుకున్న సుమిత్ర -భార్యను తప్పు పట్టిన కార్తీక్ -జ్యోత్స్న ప్లాన్ సక్సెస్
Karthika Deepam 2: కార్తీక దీపం 2 మార్చి 28 ఎపిసోడ్‌లో జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్‌ను దీపనే చెడగొట్టిందని అపోహ పడుతుంది కాంచన. దీపను కొట్టడానికి చెయ్యేత్తుతుంది. ఇంకోసారి నన్ను అమ్మ అని పిలవొద్దని, నా ఇంటి గుమ్మం తొక్కద్దని వార్నింగ్ ఇస్తుంది. కార్తీక్ కూడా దీపనే తప్పు పడతాడు.
జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్‌ను దీపనే చెడగొట్టిందని సుమిత్ర కూడా నమ్ముతుంది. గౌతమ్‌పై చేసిన ఆరోపణలను నిరూపించమని దీపతో ఛాలెంజ్ చేస్తుంది సుమిత్ర. గౌతమ్ చెడ్డవాడైతే ఒక్క సాక్ష్యం చూపించమని దీపను కోపంగా అడుగుతుంది. గౌతమ్ మా కూతురు ఫ్రెండ్ కాకపోతే నువ్వు చెప్పిన అబద్ధం నిజమని నమ్మేవాళ్లమని సుమిత్ర అంటుంది.
తప్పుగా ఆలోచిస్తున్నావు...
జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్ చెడగొడితే నాకు ఏం కలిసివస్తుందని సుమిత్రతో అంటుంది దీప. మొదటి నుంచి నా కూతురు విషయంలో ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదని దీపపై కోపంతో అరుస్తుంది సుమిత్ర. తప్పుగా ఆలోచించడం కాదు తప్పు జరుగుతుందని దీప అంటుంది. జగడం కాదు జరిగిపోయిందని సుమిత్ర కోపంగా బదులిస్తుంది.
మీరు అవకాశవాదులు...
ఎంగేజ్‌మెంట్ ఆగిపోవడం మీ కూతురు మంచికే జరిగిందని అనసూయ అంటుంది. వెనక ముందు తెలియకుండా నీ కోడలిని వెనకేసుకురాకు అంటూ అనసూయపై సుమిత్ర ఫైర్ అవుతుంది. ఒకప్పుడు నువ్వు నడిరోడ్డు మీద వదిలేసింది ఈ కోడలినే. మీరు అవకాశవాదులు కాబట్టి అవసరానికి తగ్గట్లుగా మాట్లాడుతారు.
గుండెల మీద తన్నింది...
నా ప్రాణాలు కాపాడిందని దీపను నేను కూతురిలా చూసుకున్నాను. కానీ దీప మాత్రం గుండెల మీద తన్నిందని సుమిత్ర కోపంగా అంటుంది. దీప నన్ను ఎంతలా మాయ చేసింది అంటే కన్న కూతురు మాటల కంటే దీప మాటలే నిజమని నమ్మేలా చేసింది. నా కూతురు విషయంలో మాట దాటేసినప్పుడే ఈ మనిషి ఎలాంటిదో తెలుసుకొని ఉండాల్సింది. ఇప్పటికైనా తెలిసింది సంతోషం అని సుమిత్ర దీపపై నిప్పులు చెరుగుతుంది సుమిత్ర.
చెంప పగలగొడతా...
తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని అంటారా అని సుమిత్రను అడుగుతుంది దీప. నువ్వు రెచ్చిపోయి ఎవరి ఇంట్లో, ఎలాంటివాళ్ల ముందు ఉన్నావో మర్చిపోయి మాకు కాబోయే అల్లుడిని కొడితే మేము ఏం చేశాం. చూస్తూ నిలబడ్డాం. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావని జ్యోత్స్న కన్నీళ్లు పెట్టుకుంటే మేం ఏం చేయగలిగాం. చూస్తూ నిలబడ్డాం అని సుమిత్ర అంటుంది.
సుమిత్ర ఎంత చెప్పిన గౌతమ్ మాత్రం మంచివాడు కాదని దీప అంటుంది. మరోసారి ఆ మాట అంటే నీ చెంప పగలగొడతానని దీపపై చెయ్యెత్తుతుంది సుమిత్ర. నా కూతురి మీద ఏదో గట్టిగానే మనసులో పెట్టుకున్నావు. అవకాశం దొరికినప్పుడల్లా దానిని బాధపెడుతున్నావని సుమిత్ర ఆరోపిస్తుంది.
అమ్మ అని పిలవొద్దు...
నువ్వు నన్ను అమ్మ అని పిలవొద్దని అంటుంది, ఆ పిలుపుకే కళంకమని అంటుంది. నువ్వు నాకు ఇంకోసారి ఎదురుపడొద్దని, నా ఇంటి గుమ్మం తొక్కద్దని దీపకు వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. మరోసారి నా కూతురి కంట్లో క న్నీళ్లకు కారణమయ్యావని తెలిస్తే ఎంతకైనా తెగిస్తానని దీపతో కోపంగా అంటుంది.
అప్పుడే అక్కడికి దశరథ్ వస్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని, దీపతో గొడవ పడితే ఆగిపోయిన మన కూతురు నిశ్చితార్థం జరుగుతుందా అని సుమిత్రతో దశరథ్ అంటాడు.
అన్నయ్య అని కాంచన పిలుస్తుంది. నేను నా భార్యను తీసుకెళ్లడానికి వచ్చానని, నా భార్య నీ కోడలిని బాధపెట్టి ఉంటే క్షమించమని కాంచనతో చెబుతాడు దశరథ్.
పారిజాతం అనుమానం...
జ్యోత్స్నకు జూస్ ఇవ్వడానికి ఆమె రూమ్‌కు వస్తుంది పారిజాతం. జ్యోత్స్న ఏం జరగనట్లు మామూలుగా కనిపించడం చూసి డౌట్ పడుతుంది. గౌతమ్ గురించి దీప చెప్పింది నిజమేనా అని జ్యోత్స్నను అడుగుతుంది. దీప ఎప్పుడు అబద్ధం చెప్పదుగా అని అంటుంది. నన్ను ఒంటరిగా వదిలేయమని పారిజాతాన్ని రూమ్ నుంచి బయటకు పంపిస్తుంది జ్యోత్స్న.
ప్లాన్ సక్సెస్...
దీపను ఇరికించడానికి తాను వేసిన ప్లాన్ ఎలా సక్సెస్ అయ్యిందో చెప్పుకుంటూ సంబరపడుతుంది జ్యోత్స్న. పనిమనిషితో ఎఫైర్ గురించి గౌతమ్‌తో దీప గొడవ పడిన టైమ్‌లో జ్యోత్స్న కూడా అక్కడే ఉంటుంది. పెళ్లికి నో చెప్పడానికి గౌతమ్ దగ్గరకు వెళుతుంది. కానీ అదే టైమ్‌లో దీప, గౌతమ్ గొడవ పడటం చూసి కొత్త ప్లాన్ వేస్తుంది. దీపను అడ్డుపెట్టుకొని తన పెళ్లి చెడగొట్టుకోవాలని అనుకుంటుంది. గౌతమ్‌ను తాను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే....దీప ఎలాగైనా అడ్డుకుంటుందని జ్యోత్స్న ముందే ఊహిస్తుంది.
దీప ఎదుటివాళ్ల మంచి కోసం ఎంతదూరమైన వెళుతుందని తెలిసే...క్యాటరింగ్ ఆర్డర్ దీప రెస్టారెంట్‌కు ఇస్తుంది. ఇంట్లో నాటకం ఆడి దీప ఇంటికి తల్లిదండ్రులతో పాటు తాతను పంపిస్తుంది. దీప ఎంగేజ్‌మెంట్‌కు వచ్చేలా చేసి చెడగొట్టిస్తుంది జ్యోత్స్న. తన ప్లాన్ వర్కవుట్ కావడంతో ఇంట్లో తనపై సానుభూతి పెరిగిందని, దీప దోషిగా మిగిలిపోయిందని జ్యోత్స్న సంబరపడుతుంది.
నా ప్రేమ అమరం...
కార్తీక్ కోసమే ఈ ప్లాన్ మొత్తం వేసినట్లు జ్యోత్స్న బయటపెడుతుంది. అప్పటికి, ఇప్పటికి..ఎప్పటికి కార్తీక్ తన భర్త అని అంటుంది. బావ కోసమే బతుకుతాను. బావ కోసం అవసరమైతే నాకు అడ్డొచ్చిన ఎవరినైనా చంపుతానని జ్యోత్స్న శపథం చేస్తుంది. నాకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎన్ని దండయాత్రలైనా చేస్తాను. ఎంతమందినైనా చంపుతానని అంటుంది. నా ప్రేమ అమరం అని, దానికి చావులేదని జ్యోత్స్న అంటుంది.
దీప కన్నీళ్లు...
సుమిత్ర అన్న మాటలు గుర్తుచేసుకొని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక కార్తీక్ డైలమాలో పడతాడు. అప్పుడే స్కూల్ నుంచి శౌర్య అక్కడికి వస్తుంది. దీప కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఏమైంది. ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. తప్పు చేసినవాళ్లే ఏడుస్తారని నువ్వే అన్నావుగా...నువ్వు ఏమైనా తప్పు చేశావా అని తల్లిని అడుగుతుంది శౌర్య.
ఎందుకు అడ్డుకోలేదు...
నేను తప్పు చేశానని శౌర్య చేతులను పట్టుకొని తన చెంపలపై వాయించుకుంటుంది దీప. బోరున కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా దీపపై ఫైర్ అవుతాడు కార్తీక్.
నువ్వు తప్పు చేశావా అని కూతురు అడుగుతుంటే ఏం చేయమంటారని దీప అంటుంది. నేను తప్పు చేశానని ఆ ఇంట్లోవాళ్లే కాదు...ఈ ఇంట్లో వాళ్లు కూడా అనుకుంటున్నారని దీప అంటుంది.
నువ్వు తప్పు చేశావని మేము ఎవరం అనుకోవడం లేదని కార్తీక్ బదులిస్తాడు. నోటితో అనాల్సిన పనిలేదని దీప అంటుంది. మీ అందరికి నా మాటల మీద నమ్మకం ఉంటే సుమిత్ర తిడుతుంటే ఎందుకు అడ్డుకోకుండా మౌనంగా ఉన్నారని కార్తీక్, కాంచన, అనసూయలను నిలదీస్తుంది దీప.
అవును నువ్వు నిజంగానే తప్పు చేశావని దీపకు బదులిస్తాడు కార్తీక్. నువ్వు పెద్ద తప్పు చేశావని అంటాడు.
పాఠాలు కాదు గుణ పాఠాలు...
గౌతమ్ మంచివాడని మీరు నమ్ముతున్నారా అని కార్తీక్, కాంచనలను నిలదీస్తుంది దీప. వాడు ఎలాంటి వాడైనా అందరి ముందు కొట్టడం తప్పు అని కాంచన కూడా దీపనే తప్పుపడుతుంది. శివన్నారాయణ దయ వల్ల, మనవరాలి దయ వల్ల పాఠాలు కాదు గుణపాఠాలు నేర్చుకున్నాం. ఆయిన మారకపోతే ఎలా కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న టార్చర్
జ్యోత్స్న పెళ్లి ఆగితే నాకు వచ్చే ఉపయోగం ఏమిటో సమాధానం చెప్పమని కార్తీక్, కాంచనలతో దీప అంటుంది. జ్యోత్స్న తనను ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టిందని, నా బావ నాకు కావాలని, నా బావ జీవితం నుంచి తప్పుకోమని రెండు రోజుల గురించి ఒకసారి నరకం చూపించేది. ఇక చేసిన పనుల గురించి అయితే చెప్పడానికే కష్టంగా ఉందని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం