తన ఎంగేజ్‌మెంట్ క్యాటరింగ్ ఆర్డర్‌ను కార్తీక్ రెస్టారెంట్‌కు ఇస్తుంది జ్యోత్స్న. ఆర్డర్ తీసుకోవడానికి శివన్నారాయణ ఇంటికొస్తారు కార్తీక్, దీప. ఇక్కడికి వచ్చి తప్పు చేశామని భర్తతో దీప అంటుంది. గొడవలు ఎందుకని కార్తీక్‌కు సర్ధిచెప్పబోతుంది. మనం ఎవరి జోలికి వెళ్లొద్దు. మన జోలికి ఎవరైనా వస్తే వదలొద్దు అని కార్తీక్ బదులిస్తాడు. మనలను జ్యోత్స్న అవమానించాలని చూసింది.
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని కార్తీక్ అంటాడు. ఎంగేజ్‌మెంట్ క్యాటరింగ్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందని దీపతో చెబుతాడు కార్తీక్. క్యాన్సిల్ కాకపోతే అని దీప అడుగుతుంది. క్యాటరింగ్ చేద్దామని కార్తీక్ బదులిస్తాడు. ఆర్డర్ ఓకే అంటే ఫుడ్‌తో వద్దాం...కాదంటే వాళ్లు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేద్దామని కార్తీక్ అంటాడు. ఈ సారి ఈ ఇంటికి మీరు రావద్దు...నేనే వస్తానని కార్తీక్‌తో దీప అంటుంది.
కార్తీక్ రెస్టారెంట్‌కు క్యాటరింగ్ ఇచ్చిన జ్యోత్స్నపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. తాను చేసిన పనిలో ఏ తప్పు లేదని తాతతో జ్యోత్స్న వాదిస్తుంది. శత్రువు ముందు నా పరువు తీశావని జ్యోత్స్నపై విరుచుకుపడతాడు శివన్నారాయణ.
ఆయాసంతో మాట్లాడటానికి ఇబ్బందిపడతాడు. జ్యోత్స్న వాటర్ ఇస్తుంది. కానీ ఆమె చేతిలో బాటిల్ తీసుకోవడానికి శివన్నారాయణ ఒప్పుకోడు. తప్పు చేశావని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. తాను ఏ తప్పు చేయలేదని జ్యోత్స్న బదులిస్తుంది.
రేపు ఎంగేజ్‌మెంట్‌లో అత్త ఫ్యామిలీ లేకపోతే జనాలు ఏం అనుకుంటారు. శివన్నారాయణ కూతురిని తరిమేశారు. ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదని మాట్లాడుకుంటారు. అప్పుడు పోయేది మన పరువే. అత్త రావాలని మమ్మీ, డాడీ కోరుకుంటున్నారు. వారి కోసమే క్యాటరింగ్ ఆర్డర్‌ను కార్తీక్ రెస్టారెంట్‌కు ఇచ్చినట్లు తన ప్లాన్‌ను శివన్నారాయణతో చెబుతుంది జ్యోత్స్న.
వాళ్లు రావడం నాకు ఇష్టం లేదని శివన్నారాయణ కోపంగా అంటాడు. చెల్లెలికి మనం తప్ప ఎవరూ ఉన్నారని దశరథ్ అంటాడు. మనకు అంతా కలిస్తే పది మంది కూడా బంధువులు లేరని, ఉన్నా కొద్ది మందిని కూతురు ఫంక్షన్‌కు పిలుచుకోవాలని నాకు ఉందని సుమిత్ర అంటుంది.
నా ఎంగేజ్‌మెంట్‌కు అత్త, బావ రావాలని కోరుకుంటున్నానని, నా కోరిక తీరుస్తావా అని శివన్నారాయణను అడుగుతుంది జ్యోత్స్న. మీ మాటకు క ట్టుబడి మీ కోసం బావను వదులుకున్నాను. నా కోరిక తీర్చడానికి పంతాన్ని వదులుకోవా అని శివన్నారాయణతో అంటుంది జ్యోత్స్న. కలిసిపొమ్మనడం లేదు. కేవలం ఫంక్షన్‌కు పిలవమని అంటున్నాను. అత్త, బావ నన్ను ఆశీర్వదించడానికి ఫంక్షన్‌కు వస్తే...దీప వంట మనిషిగా వస్తుంది.
బావ రెస్టారెంట్ నుంచి ఫుడ్ వస్తే మనం కలిసిపోయామని అందరూ అనుకుంటారని తన ప్లాన్‌ను శివన్నారాయణకు చెబుతుంది. జ్యోత్స్న ప్లాన్ విని శివన్నారాయణ సెలైంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మౌనమే తాత అంగీకారమని జ్యోత్స్న సంబరపడుతుంది. జ్యోత్స్న తెలివితేటలు చూసి పారిజాతం ఆనందపడుతుంది. శివన్నారాయణను భలేగా కంట్రోల్‌లో పెట్టిందని మురిసిపోతుంది.
జరిగిన గొడవ కార్తీక్ ద్వారా తెలుసుకొని కాంచన ఫైర్ అవుతుంది. అందరిని అవమానించడానికి, మనపై పగ తీర్చుకోవడానికే మనకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిందని కాంచన అంటుంది. నువ్వు నీ కాళ్ల మీద నిలబడి ధైర్యంగా బతకడం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని, పది మందిలో మన పరువు తీయాలని చూస్తున్నారని కార్తీక్‌తో అంటుంది కాంచన. వాళ్లు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెబుతాడు. జరగబోయేది అదే...ఎప్పుడైనా ఫోన్ రావచ్చునని కార్తీక్ అంటాడు. అన్నట్లుగానే జ్యోత్స్న...కార్తీక్‌కు ఫోన్ చేస్తుంది.
లిఫ్ట్ చేయగానే నా ఎంగేజ్‌మెంట్‌కు క్యాటరింగ్ మీరే చేస్తున్నారు...మీరు అందరూ రావాలి అని జ్యోత్స్న అంటుంది. మేము ఈ క్యాటరింగ్ అని కార్తీక్ సమాధానం చెప్పేలేపు...క్యాటరింగ్ చేస్తున్నామని దీప బదులిస్తుంది. మాట మార్చవుగా అని జ్యోత్స్న అంటుంది. ఆర్డర్ తీసుకుంటే మీ వల్ల ఆగాలి కానీ. మా వల్ల ఎప్పుడూ ఆగదని దీప ఆన్సర్ ఇస్తుంది.
వద్దని చెప్పొచ్చుగా అని దీపతో అంటుంది కాంచన. మనం ఫుడ్ ఎందుకు సప్లై చేయాలని, అందరి ముందు అవమానపడటానికా కోప్పడుతుంది. జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో ఎంగేజ్‌మెంట్‌కు సత్యరాజ్ రెస్టారెంట్ ఫుడ్ సప్లై చేస్తుందంటే మనం సక్సెస్ అయినట్లే, ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతుందని కార్తీక్ అంటాడు. శివన్నారాయణ మనవడు, కూతురు క్యాటరింగ్‌కు వచ్చారంటే అందరూ ఆయన్ని ఛీ కొడతారు. అది వాళ్లకే అవమానం. వాళ్లకే ప్రాబ్లెమ్ లేనప్పుడు మనకు ఎందుకు అని తల్లితో అంటాడు కార్తీక్.
ఈ క్యాటరింగ్ ఆర్డర్ వల్ల ఏం గొడవ జరుగుతుందో నని కాంచన భయపడుతుంది. పుట్టింటికి తాను పూర్తిగా దూరమైనట్లేనని బాధపడుతుంది. రెండు కుటుంబాలు ఈ రకంగానైనా కలుస్తాయని దీప మనసులో అనుకుంటుంది. నీ తల్లి కన్నీళ్లు నువ్వు చూశావు...నా కన్నీళ్లు ఈ ఇంట్లో ఎవరికి తెలియదని కాంచన గురించి దశరథ్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు కార్తీక్.
శౌర్య పిలుపుతో ఆలోచనల నుంచి బయటకు వస్తాడు కార్తీక్. నేనంటే నీకు ఇష్టమేనా అని కార్తీక్‌ను అడుగుతుంది శౌర్య ఇష్టమేనని కార్తీక్ బదులిస్తాడు. అమ్మంటే ఇష్టమేనా అని అడుగుతాడు. అమ్మంటే ఇష్టం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావని శౌర్యను అడుగుతాడు కార్తీక్.
నువ్వు అమ్మ టూర్‌కు వెళ్లడం ఎప్పుడూ చూడలేదు. చేయి చేయి పట్టుకొని నడవడం, నవ్వుతూ మాట్లాడటం కూడా చూడలేదని కార్తీక్‌తో శౌర్య అంటుంది. నీకు అమ్మంటే ఇష్టం లేదా అని అడుగుతుంది. చేయి పట్టుకుంటేనే ఇష్టం ఉన్నట్లా, కలిసి భోజనం చేస్తే ఇష్టం ఉన్నట్లు కాదా...కలిసి సైకిల్ మీద రెస్టారెంట్‌కు వెళ్లడం, కూరగాయలు కొనడం ఇష్టం కాదా అని కార్తీక్ అంటాడు.
ఎదుటివాళ్ల మీద చూపించే ఇష్టాలు ఒకేలా ఉండవని కూతురికి సమాధానమిస్తాడు. కార్తీక్ మాటలతో శౌర్య ఆనంద పడుతుంది. నాన్నకు...నేను, అమ్మ అంటే ఎంతో ఇష్టమని సంబరపడుతుంది. కార్తీక్ మాటలను దీప వింటుంది. ఎమోషనల్ అవుతుంది.
దీప రాగానే నేను నానమ్మ దగ్గర పడుకుంటానని శౌర్య వెళ్లిపోతుంది. జరుగుతున్న గొడవల వల్ల మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసునని, అయినవాళ్లతో జరుగుతోన్న యుద్ధంలో గెలుపు కూడా ఓటమి లాంటిదేనని కార్తీక్‌తో అంటుంది దీప. అందరూ అయినవాళ్లే, అన్ని రక్త బంధాలే. అభిమానాలు ఉన్నాయి. అవమానాలు ఉన్నాయి. మొదటిది మర్చిపోయి రెండో గుర్తుపెట్టుకొని బతుకుతున్నాం. మీ రెండు కుటుంబాలు కలిస్తే చూడాలని ఉందని కార్తీక్‌తో అంటుంది దీప.
అసలు జ్యోత్స్న పెళ్లి జరిగితే కదా అని కార్తీక్ అంటాడు. నాకు ఇప్పటికీ నమ్మకం లేదని అంటాడు. జ్యోత్స్న మొండితనం గురించి నీకు తెలియదని, నువ్వు ఎన్ని సార్లు కొట్టిన అవన్నీ మర్చిపోయి మళ్లీ నీతో మాట్లాడుతున్నదని, మన ఇంటి గుమ్మం తొక్కుతుందని అంటాడు.
జ్యోత్స్న మారిందని దీప సర్ధిచెప్పబోతుంది. ఆ మనిషి గురించి ఆలోచిస్తేనే నిద్రరాదని కార్తీక్ చిరాకు పడతాడు. తల్లి గురించి మనసులో బాధపడతాడు కార్తీక్. తన బాధను పంచుకున్న ఎవరూ తీర్చలేరని అంటాడు. అమ్మ కోసం జ్యోత్స్న కుటుంబసభ్యులు ఎవరైనా ఇంటికొస్తే బాగుండునని కార్తీక్ అనుకుంటాడు.
గుమ్మం వైపు పదే పదే చూస్తూ ఎమోషనల్ అవుతుంది కాంచన. అన్న కూతురిని తన చేతుల మీదుగా పెంచింది. కోడలిని చేసుకోవాలని అనుకుంది. కానీ కుదరలేదు. ఇప్పుడు జ్యోత్స్నకు పెళ్లి కుదిరింది. ఇంటి ఆడపడుచుగా పుట్టింటి నుంచి పెళ్లి పిలుపు కోసం కాంచన ఎదురుచూస్తుందని కార్తీక్‌తో అనసూయ అంటుంది.
సౌభగ్యాన్ని, ఆస్తులు వదిలేసుకున్న పుట్టింటిపై ప్రేమను మాత్రం కాంచన వదులుకోలేకపోయిందని అనసూయ చెబుతుంది. పుట్టింటి నుంచి ఎవరైనా వచ్చి ఫంక్షన్ రమ్మని పిలుస్తారని ఆశగా ఎదురుచూస్తుంది. ఎవరూ రారని కాంచనకు తెలుసు. కానీ ఆశతో ఎదురుచూడటం తప్ప ఏం చేయలేదని అనసూయ అంటుంది.
తల్లి బాధను పోగొట్టడానికి ఆమెను రెస్టారెంట్‌కు తీసుకెళ్లాలని కార్తీక్ అనుకుంటాడు. కానీ రానని కాంచన అంటుంది. నీ మనసులోని బాధ నాకు అర్థమైందని, నువ్వు ఎదురుచూసే మనుషులు ఇంటికి రారని, ఈ ఇంటి గడప తొక్కరని కార్తీక్ అంటాడు. బంధాలు కలవాలంటే ఇద్దరు కోరుకోవాలి, రాజీ పడాలి. రాజీ పడే మనస్తత్వం, నీ తండ్రికి, నీకు లేదు.
ప్రేమలు మాత్రం అలాగే ఉన్నాయని అంటాడు. మనలను వద్దనుకున్న వాళ్ల కోసం ఎదురుచూడటం కూడా అమాయకత్వమే తల్లితో అంటాడు కార్తీక్.
అప్పుడే గుమ్మంలో దశరథ్, సుమిత్ర కనిపిస్తారు. వారితో పాటు శివన్నారాయణ కూడా పారిజాతం అంటుంది. అది చూసి కాంచన ఆనందపడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం