Karthika Deepam 2:జ్యోత్స్నతో కార్తీక్ పెళ్లి పెటాకులు - భ‌ర్తకు కాంచ‌న స‌ర్‌ప్రైజ్ - త‌ల్లితో శౌర్య గొడ‌వ‌-karthika deepam 2 june 14th episode deepa upset with jyothsna behavior ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2:జ్యోత్స్నతో కార్తీక్ పెళ్లి పెటాకులు - భ‌ర్తకు కాంచ‌న స‌ర్‌ప్రైజ్ - త‌ల్లితో శౌర్య గొడ‌వ‌

Karthika Deepam 2:జ్యోత్స్నతో కార్తీక్ పెళ్లి పెటాకులు - భ‌ర్తకు కాంచ‌న స‌ర్‌ప్రైజ్ - త‌ల్లితో శౌర్య గొడ‌వ‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 14, 2024 10:41 AM IST

Karthika Deepam 2: నేటి కార్తీక దీపం -2 సీరియల్ఎపిసోడ్‌లో జ్యోత్స్న కార‌ణంగా దీప ఇబ్బందులు ప‌డ‌టం కార్తీక్ స‌హించ‌లేక‌పోతాడు. పెళ్లి గురించి త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను డైరెక్ట్‌గా జోత్స్న‌కు చెప్పాల‌ని ఫిక్స‌వుతాడు.

కార్తీక దీపం -2  సీరియల్
కార్తీక దీపం -2 సీరియల్

Karthika Deepam 2: స్కూల్‌లో పేరేంట్స్ మీటింగ్ ఉంద‌ని దీప‌తో చెబుతాడు కార్తీక్‌. దీప‌కు ఇంగ్లీష్ రాక‌పోవ‌డంతో ఆ మీటింగ్‌కు దీప‌తో పాటు కార్తీక్ కూడా రావాల‌ని శౌర్య ప‌ట్టుప‌డుతుంది.

పాప‌కు తండ్రి నేనా...ఆ కార్తీకా అంటూ న‌ర‌సింహం చేసిన అవ‌మానం గుర్తొచ్చి దీప ఆలోచ‌న‌లో ప‌డుతుంది. తాను మీటింగ్‌కు వెళితే మ‌ళ్లీ న‌ర‌సింహంతో గొడ‌వ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని కార్తీక్ కూడా ఆ మీటింగ్‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఫిక్స‌వుతాడు. శౌర్య‌కు స‌మాధానం చెప్ప‌డానికి త‌డ‌బ‌డిపోతాడు. నిన్ను మీటింగ్‌కు నేను తీసుకెళ‌తాన‌ని శౌర్య‌కు దీప స‌ర్ధిచెబుతుంది.

కార్తీక్ కంగారు...

కార్తీక్ వెళ్లిపోతుండ‌గా దీప అత‌డిని ఆపుతుంది. మీతో మాట్లాడాల‌ని అంటుంది. దీప‌ ఏం మాట్లాడుతుందోన‌ని కార్తీక్ టెన్ష‌న్ ప‌డ‌తాడు. మ‌ళ్లీ తాను ఏదో త‌ప్పు చేసి ఉంటాన‌ని, తిట్ట‌డానికే దీప త‌న‌ను ఆపి ఉంటుంద‌ని అనుకుంటాడు. కానీ స్వ‌ప్న కోసం కార్తీక్‌ను ఆపుతుంది దీప.

ఆమెకు ఎలా ఉంద‌ని అడుగుతుంది. స్వ‌ప్న బాధ్య‌త‌ల‌ను త‌న‌కు దీప అప్ప‌జెప్పిన సంగ‌తిని గుర్తుచేస్తాడు కార్తీక్‌. క‌లుపుగోలుగా మాట్లాడుతుంటే స్వ‌ప్న‌ను త‌న బంధువుగా ఫీలైన‌ట్లు చెబుతాడు కార్తీక్‌. స్వ‌ప్న‌కు మీకు బంధం ఉంద‌ని ఇన్‌డైరెక్ట్‌గా స్వ‌ప్న చెల్లెలు కార్తీక్ అనే నిజం బ‌య‌ట‌పెడుతుంది దీప‌. నిజం బ‌య‌ట‌ప‌డిన‌రోజు త‌న‌లా స్వ‌ప్న అనాథ‌లా మిగిలిపోకుండా కార్తీక్ చూసుకోవాల‌ని మ‌న‌సులో దీప కోరుకుంటుంది.

జోత్స్న‌ను పెళ్లిచేసుకోవ‌డం ఇష్టం లేదా...

జ్యోత్స్నను పెళ్లిచేసుకోవ‌డం నీకు ఇష్టం లేదా అని కార్తీక్‌ను అడుగుతుంది దీప‌. ఇంట్లో అనుకుంటున్న మాట‌ల‌కు చేస్తోన్న ప‌నుల‌కు సంబంధం లేద‌ని చెబుతుంది. పెళ్లి చేసుకుంటాన‌ని జ్యోత్స్న చేతిలో చేయి వేయ‌డానికి మీరు కంగారు ప‌డ‌టం తాను గ‌మ‌నించాన‌ని దీప అంటుంది. అంద‌రిలో ఎవ‌రికి రానీ అనుమానం దీప‌కు వ‌చ్చింద‌ని, త‌న‌కు నా మ‌న‌సు అర్థ‌మ‌వుతుంద‌ని కార్తీక్ అనుకుంట‌డు.

స‌మాధానం ఉందా...

ఇది మీ సొంత విష‌యం దీనికి స‌మాధానం నాకు చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం మీ ద‌గ్గ‌ర అయినా ఉందా అని కార్తీక్‌ను అడుగుతుంది దీప‌. శౌర్య‌తో జ్యోత్స్న క‌ఠువుగా మాట్లాడిన విష‌యం బ‌య‌ట‌పెడుతుంది దీప‌. మీరు జోత్స‌ను ఎంత దూరం పెడితే..ఆ దూరానికి మ‌రొక‌రు కార‌ణం అనుకొని క‌ఠిన‌మైన మాట‌ల‌తో ఇత‌రుల‌ను ఇబ్బంది పెడుతుంద‌ని కార్తీక్‌తో చెబుతుంది దీప‌. మీరంటే ఏమిటో, మీ మ‌న‌సులో ఏముందో జోత్స్న‌కు చెబితే అర్థం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని, అవ‌త‌లి వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌డం మానుకుంటుంద‌ని కార్తీక్‌తో అంటుంది దీప‌.

దీప ఇబ్బందులు ప‌డ‌కూడ‌దంటే...

జోత్స్న‌కు పెళ్లి చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని కార్తీక్ మ‌న‌సులో అనుకుంటాడు. ఆ విష‌యం జోత్స్న‌కు తాను డైరెక్ట్‌గా చెప్ప‌లేన‌ని అనుకుంటాడు. పారిజాతం ఆ విష‌యం ఎప్ప‌టికీ జోత్స్న‌కు చెప్ప‌ద‌ని అర్థం చేసుకుంటాడు. జోత్స్న కార‌ణంగా దీప ఇబ్బందులు ప‌డ‌కూదంటే ఆమెతో మాట్లాడాల‌ని ఫిక్స‌వుతాడు.

దీప‌తో శౌర్య వాద‌న‌...

స్కూల్ మీటింగ్‌కు దీప రెడీ అవుతుంది. ఆ చీర బాగా లేద‌ని, పండుగ రోజు క‌ట్టుకునే చీర క‌ట్టుకోమ‌ని శౌర్య ప‌ట్టుప‌డుతుంది. ప్ర‌తి విష‌యంలో నువ్వు పాటు కార్తీక్‌తో గొడ‌వ‌ప‌డుతుంటాన‌ని దీప‌తో అంటుంది శౌర్య‌. కార్తీక్‌కు నీపై మాత్రం ఎప్పుడు కోపం రాద‌ని శౌర్య చెబుతుంది.

శ్రీధ‌ర్ పూజ‌లు...

కావేరి విష‌యం ఇంట్లో తెలియ‌కుండా చూడ‌మ‌ని దేవుడిని వేడుకుంటాడు శ్రీధ‌ర్‌. త‌న కాళ్లు బాగుప‌డ‌టానికే శ్రీధ‌ర్ పూజలు చేస్తున్నాడ‌ని కాంచ‌న ఎమోష‌న‌ల్ అవుతుంది. మీరు ఎన్ని పూజ‌లు చేసిన నాకు కాళ్లు రావ‌ని అంటుంది. త‌ల్లితండ్రుల మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని చూసి కార్తీక్ ఆనంద‌ప‌డ‌తాడు.

సాయం చేసి మ‌ర్చిపోవాలి...

స్వ‌ప్న‌ను హాస్సిట‌ల్‌లో కార్తిక్‌ జాయిన్ చేసిన విష‌యం గుర్తుచేస్తుంది కాంచ‌న‌. ఆ అమ్మాయికి వీడియో కాల్ చేయ‌మ‌ని అంటుంది. ఆమెకు ఎలా ఉందో చూస్తాన‌ని చెబుతుంది. కాంచ‌న మాట‌లు విని శ్రీధ‌ర్ కంగారు ప‌డ‌తాడు. స్వ‌ప్న‌, దీప‌, శౌర్య వీళ్లంతా మ‌న‌కు ఏమ‌వుతారు. సాయం చేసి మ‌రిచిపోవాలి త‌ప్పితే వాళ్ల గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌వ‌ద్ద‌ని అంటాడు. శ్రీధ‌ర్ ఆఫీస్‌కు బ‌య‌లుదేరుతాడు. భ‌ర్త శ్రీధ‌ర్‌కు భార్య‌, ఆఫీస్ త‌ప్ప మ‌రో లోకం లేద‌ని, ఆ రోజు ఆఫీస్‌కు వెళ్లి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని అనుకుంటుంది కాంచ‌న‌.

జోత్స్న అనుమానం..

పేరేంట్స్ మీటింగ్‌కు బ‌య‌లుదేరిన శౌర్య‌ను మీ నాన్న ఎక్క‌డ అంటూ స్నేహితులు అడ‌గ‌రా అంటూ మ‌న‌సును నొప్పిస్తుంది జ్యోత్స్న‌. మీ ఫ్రెండ్స్ అడిగితే ఏం చెబుతావ‌ని అంటుంది. మీరు ఇద్ద‌రు కాకుండా మీతో ఎవ‌రైనా వ‌స్తున్నారా అని అనుమానంగా శౌర్య‌ను అడుగుతుంది జ్యోత్స్న‌. మీకు ఈ మీటింగ్‌లు కొత్త క‌దా...వివ‌రాలు చెప్ప‌డానికి ఎవ‌రైనా వ‌స్తున్నారా అని మాట మారుస్తుంది. మాకు ఇక్క‌డ ఎవ‌రు లేర‌ని, తెలియ‌ద‌ని దీప క‌ఠినంగా జ్యోత్స‌కు స‌మాధాన‌మిస్తుంది.దీప‌తో పాటు శౌర్య‌ను ఇంటి నుంచి పారిపోయేలా చేయాల‌ని జ్యోత్స్న అనుకుంటుంది. అక్క‌డితో కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముగిసింది.

WhatsApp channel