Karthika Deepam 2 Serial:జ్యోత్స్న ఇంటికొచ్చిన పోలీసులు - కూతురి కోసం దీప కన్నీళ్లు - అబద్ధం చెప్పిన కార్తీక్
Karthika Deepam 2 Serial:కార్తీక దీపం జనవరి 23 ఎపిసోడ్‌లో దాసును చంపడానికి ప్రయత్నించింది ఎవరో తెలుసుకోవడానికి శివన్నారాయణ ఇంటికొస్తారు పోలీసులు. కానీ జ్యోత్స్న తెలివిగా దాసు తమ ఇంటికొచ్చిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ డిలీట్ చేస్తుంది.
దాసుపై ఎటాక్ చేసింది ఎవరనేది తెలుసుకోవడానికి శివన్నారాయణ ఇంటికొస్తారు పోలీసులు. వారిని చూసి జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. తానే దాసుపై ఎటాక్ చేశాననే నిజం పోలీసులకు ఎక్కడ తెలిసిపోయిందోనని భయపడుతుంది. దాసు మీకు ఏమవుతాడని శివన్నారాయణను అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. ఏం కాడని, వాడితో నాకు ఏం సంబంధం లేదని శివన్నారాయణ బదులిస్తాడు.
దాసు తన కొడుకేనని పారిజాతం అంటుంది. మీ కన్న కొడుకు గురించి మీకు తెలియకపోవడం ఏంటి అని శివన్నారాయణను అడుగుతాడు పోలీస్ ఆఫీసర్.. పారిజాతం నా భార్యనే...కానీ దాసు మాత్రం నా కొడుకు కాదు. ఆ వివరాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదని పోలీస్ ఆఫీసర్‌కు కోపంగా బదులిస్తాడు శివన్నారాయణ.
కాశీ కంప్లైంట్....
దాసు మిస్సయ్యాడని వాళ్ల అబ్బాయి కాశీ తమకు కంప్లైంట్ ఇచ్చాడని పోలీస్ ఆఫీసర్ అంటాడు. దాసు తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో ఉన్నట్లు మా ఎంక్వైరీలో తేలిందని పోలీస్ ఆఫీసర్ చెబుతాడు. అతడిని ఎవరో హత్య చేయడానికి ప్రయత్నించారని, తలపై బలమైన గాయాలు అయ్యాయని శివన్నారాయణతో పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఇది అటెంప్ట్ మర్డర్ అని కాశీ, కార్తీక్ అనుమానపడుతున్నారని జరిగింది శివన్నారాయణ కుటుంబసభ్యులకు పోలీసులు చెబుతారు.
చివరగా మీ ఇంటికే వచ్చాడు...
మా ఎంక్వైరీలో కాశీ చివరగా మీ ఇంటికే వచ్చినట్లు తేలిందని, అతడి మొబైల్ లొకేషన్ మీ ఇంటి దగ్గరే చూపిస్తుందని పోలీస్ ఆఫీసర్ అనడంతో జ్యోత్స్న వణికిపోతుంది. జ్యోత్స్న దొరికిపోయిందని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న చేసింది తప్పే కానీ తన కూతురిని ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు. మరోవైపు దాసు తమ ఇంటికి రాలేదని పోలీసులతో శివన్నారాయణ వాదిస్తాడు. దాసును కొట్టింది నేనో, మా మనవరాలో అని అనేలా ఉన్నారని శివన్నారాయణ కోపంగా అనడంతో జ్యోత్స్న భయపడుతుంది.
దశరథ్ కంగారు...
పోలీసులు ఎంక్వైరీ చేస్తే జ్యోత్స్న దొరికిపోవడం ఖాయమని దశరథ్ కంగారుపడతాడు. ఎలాగైనా పోలీసులను ఇంటి నుంచి పంపించేయాలని నిర్ణయించుకుంటాడు. దాసు మా తమ్ముడు. ఒకవేళ అతడు మా ఇంటికి వస్తే...రాలేదని మేము ఎందుకు అబద్ధం చెబుతాం. అవసరమైతే ఎస్‌పికి ఫోన్ చేస్తానని పోలీసులను హెచ్చరిస్తాడు.
మనవరాలి నిజస్వరూపం...
సీసీ టీవీ చూస్తే దాసు ఇక్కడికి వచ్చాడో లేదో తెలిసిపోతుంది కదా శివన్నారాయణ సలహా ఇస్తాడు. డైరెక్ట్‌గా సాక్ష్యలతో సహా నీ మనవరాలిని నువ్వే పోలీసులకు పట్టించావని, మనవరాలి నిజస్వరూపం తెలిస్తే గుండె పట్టుకొని కుప్పకూలిపోతావని తండ్రిని ఉద్దేశించి మనసులో అనుకుంటాడు దశరథ్.
మీరు తీసుకుపోయింది నా ప్రాణాన్ని...
కార్తీక్, శౌర్య కోసం ఇంటి బయటే ఎదురుచూస్తుంటుంది దీప. శౌర్యను హాస్పిటల్‌లో జాయిన్ చేసి కార్తీక్ ఒక్కడే ఇంటికొస్తాడు. మీరు తీసుకుపోయింది నా ప్రాణాన్ని, మనసు మార్చుకొని మళ్లీ శౌర్యను వెనక్కి తీసుకొస్తారని ఆశతో ఎదురుచూస్తున్నానని దీప కన్నీళ్లతో కార్తీక్‌తో అంటుంది.
తండ్రిగా నా కూతురికి ఏం చేయాలో నాకు తెలియదా అని దీపకు కార్తీక్ ఆన్సర్ ఇస్తాడు. శౌర్య పుట్టిన తర్వాత నాకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మరోవైపు హాస్పిటల్‌లో తల్లిదండ్రులు ఫొటోలు చూసి శౌర్య కూడా ఎమోషనల్ అవుతుంది. ఇద్దరిని మిస్సవుతున్నానని ఫొటో చూస్తూ తనలో తానే అనుకుంటుంది. తాను ఏడవనని కార్తీక్‌కు ఇచ్చిన మాట గుర్తొచ్చి కన్నీళ్లు ఆపుకుంటుంది.శౌర్యకు పాప్‌కార్న్ ఇచ్చి ఆమె బాధను పొగొడుతాడు కాశీ.
నా బాధ్యత కూడా గొప్పదే...
నీ బాధను నేను అర్థం చేసుకోగలనని దీపను ఓదార్చుతాడు కార్తీక్. శౌర్య మీద నీకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో...నాకు ఉన్న బాధ్యత కూడా అంతే గొప్పదని కార్తీక్ అంటాడు. నువ్వు శౌర్యను కడుపులో మోస్తే నేను గుండెల్లో మోస్తున్నాను. నీది పేగు బంధం అయితే నాది ప్రాణ బంధం.
శౌర్య నీ కళ్ల ముందు లేదన్న బాధ నీ కన్నీళ్లలో కనబడుతుంటే...అక్కడ తను క్షేమంగా ఉందనే ధైర్యం నా మాటల్లో నీకు వినపడటం లేదా అని దీపతో ఎమోషనల్‌గా అంటాడు కార్తీక్. ఎన్ని సార్లు అడిగినా నా సమాధానం ఒక్కటేనని, శౌర్య వారం రోజుల పాటు తిరిగిరాదని దీపకు చెబుతాడు కార్తీక్.
శౌర్యకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు...అది తీర్చడానికి నేను లేనంటే చచ్చిపోయినట్లే లెక్క అని కార్తీక్ చెబుతాడు. శౌర్య తన కూతురు అని, తన క్షేమం తండ్రి కంటే ఎవరికి గొప్పగా తెలుసునని చెబుతాడు.
ఫుటేజ్ డిలీట్...
పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. కానీ తాను ఎక్కడ దొరికిపోతానోనని తెలివిగా దాసు ఇంటికొచ్చిన రోజు సీసీ టీవీ ఫుటేజ్‌ను జ్యోత్స్న డిలీట్ చేస్తుంది. ఆ సీసీ టీవీ ఫుటేజ్ ఎలా మిస్సయ్యిందని పోలీసులు ప్రశ్నిస్తారు. సిస్టమ్ కొంచెం ప్రాబ్లెమ్ విజువల్స్ రికార్డ్ కాలేదని జ్యోత్స్న ఆధారాలు చూపిస్తుంది. ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు వెళ్లిపోతారు.
జ్యోత్స్నకు థాంక్స్…
పోలీసులు వెళ్లిపోగానే జ్యోత్స్నకు థాంక్స్ చెబుతాడు దశరథ్. ఎందుకు అని తడబడుతూ జ్యోత్స్న అడుగుతుంది. సిస్టమ్‌ను నువ్వు తెలివిగా రిపేర్ చేయించావని, ముందే జాగ్రత్తపడ్డావని దశరథ్ అంటాడు
. ఒకసారి మనది అనుకున్నప్పుడు దానిని నిలబెట్టుకోవడానికి ఎన్నైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే లేదంటే చాలా నష్టపోతామని జ్యోత్స్న అంటుంది. దాసును జ్యోత్స్న ఎందుకు కొట్టిందనే నిజాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని దశరథ్ అనుకుంటాడు. అప్పటివరకు ఈ దాగుడుమూతలు తప్పవని తనకు తాను సర్ధిచెప్పుకుంటాడు.
దీప కన్నీళ్లు...
కార్తీక్ సమాధానాలతో శౌర్య గురించిన బాధను మర్చిపోయి మామూలు మనిషి అవుతుంది. కార్తీక్ ఒక్కడే భోజనానికి రావడంతో శౌర్య ఏదని, గదిలో పడుకుందా అని దీప అంటుంది. శౌర్యను పిలుస్తుంది. శౌర్య ఇంట్లో లేదనే విషయం దీపకు గుర్తుచేస్తాడు కార్తీక్. తన కూతురు గుర్తొచ్చి దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇప్పుడే శౌర్య దగ్గరకు వెళదామని కార్తీక్‌తో అంటుంది. దీపకు ఏం చెప్పాలో తెలియక కార్తీక్ కంగారు పడతాడు.
కార్తీక్ అబద్ధం…
తన స్నేహితుడి ఇళ్లు పోలీస్ క్వార్టర్స్‌లో ఉందని, రాత్రి ఎనిమిది దాటితే లోపలికి వెళ్లడానికి అనుమతులు ఉండవని దీపకు సర్ధిచెబుతాడు కార్తీక్. అయితే దీపతో ఫోన్‌లో మాట్లాడుతానని దీప పట్టుపడుతుంది. ఈ టైమ్‌లో ఫోన్ చేసి డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదని కార్తీక్ అంటాడు.
శౌర్య భోజనం చేసి పడుకొని ఉంటుందని, ఫోన్ చేస్తే మనం గుర్తొచ్చి ఏడుస్తుందని దీపతో అబద్ధం చెబుతాడు కార్తీక్. నువ్వు నన్ను నమ్మకపోతే ఇందులో వర్ష అనే నంబర్ ఉంటుంది, నువ్వే కాల్ చేయ్ అని దీపకు ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీప ఫోన్ తీసుకుంటే తాను దొరికిపోతానని లోలోన కంగారు పడతాడు అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.