Karthika Deepam 2 Serial: కార్తీక్‌కు జ్యోత్స్న పెళ్లి ప్రపోజల్ - ఆస్తి మొత్తం రాసిస్తానంటూ ఆఫర్ -సుమిత్ర ఇంటికి దీప
Karthika Deepam 2: కార్తీక దీపం 2 జనవరి 6 ఎపిసోడ్‌లో తన ఇంటికొచ్చిన జ్యోత్స్నను చూసి కార్తీక్ కోపం పట్టలేకపోతాడు. నీ చూపు పడితే నాశనం, నువ్వు అడుగుపెడితే దరిద్రం అంటూ క్లాస్ ఇస్తాడు. నా ఫ్యామిలీ జోలికి రావోద్దని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు.

శౌర్య ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. స్పృహలోకి వచ్చిన శౌర్య కార్తీక్, దీపతో మాట్లాడుతుంది. తనకు ఏమైంది అని అడుగుతుంది. నీకు ఏం కాలేదని, బాగున్నావని కూతురికి సర్ధిచెబుతాడు కార్తీక్. తన లాకెట్‌ను తీసి శౌర్య మెడలో వేస్తాడు. ఇక నుంచి ఈ లాకెట్ ఎప్పుడు నీతోనే ఉంటుందని శౌర్యకు మాటిస్తాడు కార్తీక్. ఆ సీన్ చూసి దీప ఎమోషనల్ అవుతుంది.
దీప కన్నీళ్లు...
తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఎందుకు ఏడుస్తున్నావని శౌర్యను దీప అడుగుతుంది. నిన్ను ఇలా హాస్పిటల్ బెడ్‌పై చూసి బాధ కలుగుతుందని దీప అంటుంది. తనకు ఏం కాలేదని శౌర్య అంటుంది. వారం రోజులు ఇక్కడే ఉండాలని శౌర్యకు చెబుతాడు డాక్టర్. వారం రోజులా అని శౌర్య డీలాపడుతుంది.
నీకు తోడుగా నేను, అమ్మ ఇక్కడే ఉంటామని కూతురికి కార్తీక్ సర్ధిచెబుతాడు. అమ్మ, నాన్న ఉంటే తాను కూడా ఇక్కడే ఉంటానని శౌర్య అంటుంది. శౌర్యను నిద్రపుచ్చడం కోసం ఆమెకు కథ చెబుతాడు కార్తీక్.
కన్న తండ్రికి మించి శౌర్యపై కార్తీక్ ప్రేమను కురిపించడం చూసి మురిసిపోతుంది. ఈ జన్మలో రుణ బంధమో ఇది అని అనుకుంటుంది.
జ్యోత్స్న అసహనం...
శౌర్యను తీసుకొని దీప, కార్తీక్ ఇంటికొస్తారు. వారికి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది అనసూయ. శౌర్య క్షేమంగా తిరిగి రావడం చూసి కాంచన సంబరపడుతుంది. మరోవైపు శౌర్య ఆపరేషన్‌ను అడ్డుపెట్టుకొని కార్తీక్‌ను తన సొంతం చేసుకోవాలన్న ప్లాన్ ఫెయిలవ్వడం జ్యోత్స్న సహించలేకపోతుంది.
కార్తీక్, దీప ఆనందాన్ని కళ్లారా చూసి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. జ్యోత్స్న రావడం కార్తీక్ గమనిస్తాడు. ఇప్పుడే వస్తానని బయటకు వెళతాడు. నచ్చనివాళ్లు చూసినప్పుడే కార్తీక్ ముఖం మారిపోతుందని దీప అనుకుంటుంది.
మూడుముళ్లు వేసే వరకు...
తన హెల్ప్ లేకుండానే దీప కూతురికి ఆపరేషన్ జరిగిపోయిందని జ్యోత్స్న అనుకుంటుంది. ఈ ఛాన్స్ మిస్సయినా కార్తీక్‌ను వదిలిపెట్టకూడదని అనుకుంటుందని, అతడు తన మెడలో మూడుముళ్లు వేసేవరకు వదిలిపెట్టొద్దని ఫిక్స్ అవుతుంది.
నీ చూపు పడితే దరిద్రం...
సడెన్‌గా జ్యోత్స్న కారుకు తన సైకల్ అడ్డుపెడతాడు కార్తీక్. నువ్వు మా ఇంటికి ఎందుకొచ్చావని జ్యోత్స్నను నిలదీస్తాడు కార్తీక్. ఏం రాకూడదా అని జ్యోత్స్న బదులిస్తుంది. నీ చూపు పడితే నాశనం, నీ అడుగు పడితే దరిద్రం...ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర డేంజర్ అని రాసి పుర్రె గుర్తుతో బోర్డ్ పెడతారు. ఆ పుర్రె గుర్తు బదులు నీ ఫొటో పెట్టి నీ మెడలో అలాంటిది ఒకటి వేలాడదీయాలని జ్యోత్స్నను క్లాస్ ఇస్తాడు కార్తీక్.
నీ వల్ల పిల్లలకే కాదు పెద్దలకు ప్రమాదమేనని, నీ మెడలో వేసే బోర్డ్‌పై ఇది కూడా రాయాలని జ్యోత్స్నను అవమానిస్తాడు. నా గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావని, కొంచెం కూడా రెస్సెక్ట్ లేదా అని కార్తీక్‌ను అడుగుతుంది జ్యోత్స్న. ఏం చూసి నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని కార్తీక్ బదులిస్తాడు.
తాగి తందనాలు ఆడి...
మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని తాగి తందనాలు ఆడి ఇంటి పరువు రోడ్డుకు ఎక్కించి పోగొట్టావు. టిఫిన్ సెంటర్ కాల్చినప్పుడే అత్త కూతురు అన్న గౌరవం తగలడిపోయింది. నా కూతురు ప్రాణాలను అడ్డుపెట్టుకొని నా భార్య ఐదోతనాన్ని ఖరీదు కట్టినప్పుడే నువ్వు మనిషిగా కూడా చచ్చిపోయావని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. నీ లాంటివాళ్లకు వీలైనంత దూరంగా ఉండాలని అంటాడు.
నువ్వంటే ప్రేమ...
నీ కోసమే మీ ఇంటికి వచ్చానని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న. నువ్వంటే ప్రేమ అని, నా అంత గొప్పగా నిన్ను ప్రపంచంలో ఎవరు ప్రేమించలేరని జ్యోత్స్న అంటుంది. నీ ప్రేమ నాకు అవసరం లేదని కార్తీక్ సమాధానమిస్తాడు. నువ్వు నాకు కావాలని, నీ కోసం నా అస్తి మొత్తం రాసిస్తానని జ్యోత్స్న అంటుంది. ఈ మాట మీ తాత వింటే ఎవరి ఆస్తి ఎవరికి రాసిస్తున్నావని పరిగెత్తించి కొడతాడని కార్తీక్ వెటకారంగా సమాధానమిస్తాడు.
నాకు పెళ్లైపోయిందని జ్యోత్స్నకు గుర్తుచేస్తాడు కార్తీక్. దీప నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందని కార్తీక్‌తో వాదిస్తుంది జ్యోత్స్న. నువ్వు ఓకే అంటే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. నువ్వు ఈ మాట అంటున్నప్పుడు మా ఆవిడ ఇక్కడ ఉండుంటే ఇప్పుడే నీ పెళ్లి చేసేదని కార్తీక్ వెటకారంగా ఆన్సర్ ఇస్తాడు. కార్తీక్ ఎంత చెప్పిన జ్యోత్స్న వినదు. నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తానని అంటుంది. ఇదంతా శాడిజం అని కార్తీక్ కొట్టిపడేస్తాడు.
పెద్దలే వద్దనుకున్నప్పుడు...
పెద్దల కోసమే నీతో పెళ్లికి ఒప్పుకున్నానని, ప్రేమతో కాదని, ఆ పెద్దలే నన్ను వద్దని అనుకున్నప్పుడే పెళ్లిని వదిలేశానని కార్తీక్ అంటాడు. తాను దీప భర్తనని అంటాడు. నాకు నువ్వు కావాలని, దీపను వదిలేయమని, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని కార్తీక్‌ను ప్రాధేయపడుతుంది జ్యోత్స్న.
పెళ్లైన మగాడి వెంట పడే ఆడదానిని సొసైటీ బజారుమనిషిలా చూస్తుందని కార్తీక్ అంటాడు. అయినా పర్వాలేదని జ్యోత్స్న బదులిస్తుంది. కానీ నువ్వు నాకు అవసరం లేదని కార్తీక్ ఆన్సర్ ఇస్తాడు. ఇంక నన్ను టార్చర్ పెట్టొద్దని చెబుతాడు. నా ఫ్యామిలీ జోలికి రావద్దని జ్యోత్స్నతో చెబుతాడు. ఇది వార్నింగ్ అనుకుంటావో, సలహా అనుకుంటావో నీ ఇష్టం అని అంటాడు.
సమరం శంఖం పూరిస్తా...
ఒక ఏడాదిలో రెస్టారెంట్ పెట్టి నీపై విజయం సాధిస్తానని సవాల్ చేశాడు. కానీ ఇన్ని రోజులు నేను ముందుకు పోకుండా నా కూతురు అనారోగ్యం అడ్డుపడింది. ఇప్పుడు సవాల్ వైపు దూసుకెళ్లడానికి సమర శంఖం పూరించే సమయం ఆసన్నమైందని, గడ్డి పరకలా నా విజయానికి అడ్డుపడద్దొని జ్యోత్స్నను హెచ్చరిస్తాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా తల్లి లాంటి అత్త ముఖం చూసి వదిలేస్తున్నానని కార్తీక్ అంటాడు. కొట్టేదాకా చూడొద్దని అంటాడు.
శౌర్య ఆపరేషన్‌కు డబ్బులు ఎవరు ఇచ్చారో తనకు తెలియాలని జ్యోత్స్న అంటుంది. తన పేరే చెబుతాడు కార్తీక్. డౌట్ ఉంటే హాస్పిటల్ రిజిస్టర్‌లో చూడమని చెప్పి వెళ్లిపోతాడు.
కాంచన హోమం...
కార్తీక్ చిరాగ్గా ఇంటికొస్తాడు. దీప తనకు ఇచ్చిన కాఫీని కార్తీక్‌కు ఇస్తుంది కాంచన. శౌర్య పేరు మీద శాంతి హోమం చేయిస్తానని మొక్కుకున్నానని, రేపే హోమం జరిపిద్దామని అంటుంది. శౌర్య ప్రాణాలను కాపాడిన వ్యక్తికి ఈ రూపంలోనైనా కృతజ్ఞత చెప్పే అవకాశం దక్కుతుందని కార్తీక్ అంటాడు. అందరిని హోమానికి పిలవమని దీపకు చెబుతాడు కార్తీక్.
పుట్టిల్లు గుర్తొచ్చి...
తన పుట్టిల్లు గుర్తొచ్చి కాంచన ఎమోషనల్ అవుతుంది. కార్తీక్, దీప వెళ్లిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటుంది. అన్నయ్య అంటే తనకు ప్రాణమని, ఆయన పలకరింపుకు దూరమయ్యానని, తన పుట్టింటి వాళ్లు హోమానికి రారని తల్చుకుంటేనే బాధగా ఉందని అంటుంది.
ఉన్నది ఒకే ఒక్క జీవితం, ఎంత కాలం బతుకుతామో తెలియదు, ఈ కొంతలో పంతాలు, పట్టింపులు అవసరమా, దాని వల్ల సాధించేది ఏం ఉండదని కాంచన బాధపడుతుంది. ఏదో ఒక రోజు మీ అన్నయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తాడని కాంచనను అనసూయ ఓదార్చుతుంది. కాంచన మాటల్ని చాటు నుంచి దీప వింటుంది.
జ్యోత్స్న డౌట్...
శౌర్య ఆపరేషన్‌కు తల్లి సుమిత్ర సాయం చేసిందని జ్యోత్స్న అనుమానపడుతుంది. తల్లి నగలు చెక్ చేస్తుంది. అవన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. ఆ డబ్బు నేను ఇవ్వలేదని సుమిత్ర అనడంతో జ్యోత్స్న షాకవుతుంది. తాను దొరికిపోవడంతో మాట మార్చేస్తుంది. చైన్ వేసుకోవడం కోసం నగలు చూశానని అంటుంది.
అజ్ఞాత వ్యక్తి ఎవరో...
దీప, కార్తీక్ పెళ్లి జరిగినప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావని జ్యోత్స్నతో అంటుంది సుమిత్ర. వర్తమానం గతంలా ఉండాలనే మన కోరుకున్నది దక్కాలి, లేదంటే మనం అనుకున్నది జరగాలి. నా విషయంలో ఆ రెండు జరగలేదని జ్యోత్స్న చెబుతుంది. నన్ను శత్రువులా ఫీలవుతున్న మనుషులకు ఓ అజ్ఞాతవ్యక్తి సాయం చేశాడని, అతడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నానని జ్యోత్స్న అంటుంది.
ఆ వంట మనిషిపై ఇంట్లో ప్రేమాభిమానులు కురిపించేది నువ్వే కదా అని తల్లిపై ఫైర్ అవుతుంది. నన్ను కూడా సాయం చేయలేని పరిస్థితికి నువ్వే తీసుకొచ్చావని జ్యోత్స్నకు బదులిస్తుంది సుమిత్ర. ఈ తెలివితేటలు ఏదో బిజినెస్‌పై పెడితే బాగుటుందని కూతురికి సలహా ఇస్తుంది.
మరోవైపు కాంచన బాధ చూడలేక శివన్నారాయణ కుటుంబాన్ని హోమానికి పిలవాలని వారి ఇంటికి వస్తుంది దీప. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.