Karthika Deepam 2 Today Episode:శ్రీధర్ ఫ్రెండ్ ఫంక్షన్‌కు కార్తీక్ క్యాటరింగ్ -దీప ప్లానింగ్ -రూట్ మార్చిన కావేరి
Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఫిబ్రవరి 14 ఎపిసోడ్‌లో ఓ బర్త్‌డే ఫంక్షన్ కోసం క్యాటరింగ్ ఆర్డర్ ఒప్పుకుంటారు దీప, కార్తీక్, అదే ఫంక్షన్‌కు శ్రీధర్‌తో పాటు పారిజాతం, జ్యోత్స్న వస్తారు. వారిని చూసి కార్తీక్ షాకవుతాడు.

కార్తీక్ సంతకాలు పెట్టిన పేపర్స్ కోసం శ్రీధర్ వెతుకుతుంటాడు. తాను పెట్టిన చోట అవి కనిపించకపోవడంతో కంగారు పడతాడు. మీరు ఎంత వెతికిన పేపర్స్ దొరకవని, వేరే చోట సేఫ్‌గా పెట్టానని కావేరి అంటుంది. వాటితో డబ్బులు ఏం రావని, నిన్ను కలిపేసుకున్నారని మురిసిపోవద్దని భార్యపై సెటైర్లు వేస్తాడు శ్రీధర్,
నన్ను అస్తమానం విసిగిస్తే అని కావేరి అనగానే...నువ్వు కూడా కార్తీక్ దగ్గరకు వెళ్లిపోతావా...అయినా నిన్ను ఎవరూ రాణిస్తారు. నేను అనే వాడిని లేకపోతే మీరంతా ఎక్కడి నుంచి వచ్చారని బిల్డప్‌లు ఇస్తాడు శ్రీధర్.
సతీసమేతంగా...
అప్పుడే శ్రీధర్ ఫ్రెండ్ గంగాధరం ఫోన్ చేస్తాడు. తన మనవడి పుట్టిన రోజుకు సతీసమేతంగా రావాలని అంటాడు. ఆ బర్త్‌డే ఫంక్షన్‌కు వెళదామని కావేరితో అంటాడు శ్రీధర్. నేను రానని, అక్కతో వెళ్లమని కావేరి పంచ్‌లు వేస్తుంది. సతీసమేతంగా అంటే ఏ భార్యతో రమ్మని అన్నాడో మీ ఫ్రెండ్‌ను అడగండి అని భర్తపై పంచ్‌లు వేస్తుంది.
దీప వల్లే దరిద్రాలు...
మీరంతా ఎప్పటికైనా నా దారికి రావాల్సిందేనని, తాను ఎవరి కోసం ఆగిపోనని కోపంగా శ్రీధర్ అంటాడు. పెళ్లాన్ని చూసుకొని అందరితో ఛాలెంజ్ చేస్తున్నాడు నా కొడుకు...కొడుకును చూసి తల ఎగరేస్తుంది కాంచన, ఇప్పుడు కావేరి తయారైందని శ్రీధర్ అనుకుంటాడు. ఈ దరిద్రాలు అన్నింటికి దీప కారణమని ఆమెపై కోపంతో రగిలిపోతాడు. దీప వెళ్లిపోతేనే తమ జీవితంలో వెలుగు వస్తుందని అనుకుంటాడు.
రెండు సవాళ్లు...
దీప సీరియస్‌గా నోట్‌బుక్‌లో ఏదో రాస్తుంటుంది. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినట్లుగా ఏం రాస్తున్నావని శౌర్య అడుగుతుంది. కూతురిపై దీప ఫైర్ అవుతుంది. ఏం రాస్తున్నావని దీపను అడుగుతాడు కార్తీక్. అతడి ముందు నోట్‌బుక్ పెడుతుంది. మన కళ్ల ముందు రెండు సవాళ్లు ఉన్నాయని, ఒకటి రెస్టారెంట్ పెట్టాలని, రెండు నలభై ఒక్క లక్షల అప్పు తీర్చాలని వాటికి సంబంధించిన ప్లాన్స్ వేశానని దీప అంటుంది. . దీప ప్లానింగ్ బాగుందని కార్తీక్ మెచ్చుకుంటాడు. డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తుంటారు.
క్యాటరింగ్ ఆర్డర్...
అప్పుడే ఓ వ్యక్తి బర్త్‌డే ఫంక్షన్ క్యాటరింగ్ ఆర్డర్ కార్తీక్‌కు ఇవ్వడానికి అతడిని వెతుక్కుంటూ వస్తాడు. అడ్వాన్స్ ఇస్తాడు. దీప డబ్బులు అయిష్టంగానే తీసుకుంటుంది. తొందరపడి ఆర్డర్ ఒప్పుకున్నారని కార్తీక్‌తో దీప అంటుంది. వంద మందికి భోజనం ఆర్డర్ అంటే చాలా కష్టంతో కూడుకున్నదని దీప భయపడుతుంది.
అన్ని నువ్వే చేసి మేము సుఖంగా ఉండాలని చూడకు...నువ్వు అంటే మనం...మనల్ని మనం మెరుగుపరుచుకోవాలంటే అందరం కలిసి కష్టపడదామని కాంచన అంటుంది. రాత్రింబవళ్లు పనిచేయడానికి నేను రెడీ అని అనసూయ చెబుతుంది. కష్టమో, నష్టమో, బాధో, సుఖమో కలిసి అడుగు ముందుకు వేద్దామని దీపతో అంటాడు కార్తీక్.
దర్జాగా తిరగాల్సినోడు...
క్యాటరింగ్ ఆర్డర్ తాలూకు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు దీప, కార్తీక్. ఆటోలో కూర్చొని ఇద్దరు కలిసి ఫుడ్ ఇవ్వడానికి వెళతారు. కారులో దర్జాగా తిరగాల్సిన కార్తీక్ ఆటోలో తిరగడం చూసి కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది.
బాధ కాదు బాధ్యత...
నా వల్లే మీరు ఇబ్బందులు పడుతున్నారని కార్తీక్‌తో దీప అంటుంది. ఇది బాధ కాదు బాధ్యత అని, ఎదిగేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయని, అవన్నీ తట్టుకోవాలని అంటాడు. నా జీవితం నాకే కొత్తగా కనపడుతుందంటే నీ వల్లేనని దీపతో అంటాడు. సీఈవోగా ఇరవై లక్షల ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు లేని ఆనందం, దీప భర్తగా ఇరవై వేల ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు వచ్చిందని అంటాడు.
నీతో ఉన్న ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటాడు. ఆటోలో నువ్వు, నేను పక్కపక్కన కూర్చొని వెళుతుంటే బాగుందని, ఈ ఆనందం మళ్లీ రాదని అంటాడు. ఆటో కుదుపులతో కార్తీక్‌పై పడుతుంది దీప. అతడికి సారీ చెబుతుంది. ఇది కూడా బాగుందని కార్తీక్ బదులిస్తాడు.
కొడుకు గురించి గొప్పలు...
తన స్నేహితుడు గంగాధరం మనవడి బర్త్‌డే ఫంక్షన్‌కు శ్రీధర్ వస్తాడు. తన గురించి ,కార్తీక్ గురించి స్నేహితుడికి గొప్పలు చెబుతాడు. కార్తీక్ రేంజ్ వేరని, ఫుల్ బిజీగా ఉంటాడని అంటాడు. అదే ఫంక్షన్‌కు దీప, కార్తీక్ క్యాటరింగ్ సప్లై చేస్తారు. భోజనం వడ్డించేవాళ్లు తక్కువ కావడంతో దీప, కార్తీక్‌లను సాయం చేయాల్సివస్తుంది.
మీరు భోజనం వడ్డించడమేంటి వద్దని కార్తీక్‌తో దీప అంటుంది. మనం ఇక్కడికి వచ్చింది వండిన వంటలు ఇచ్చి వెళ్లిపోవడానికి కాదని, మన వంటలను ప్రమోట్ చేసుకోవడానికి అని చెబుతాడు. కార్తీక్ మాటలతో మీరు గెలుస్తారని, గొప్పవారు అవుతారని దీప అంటుంది. నీ లాంటి మనిషి తోడుగా ఉంటే గెలుపు సులభమేనని కార్తీక్ బదులిస్తాడు.
గంగాధరం ప్రశ్నలు...
అదే ఫంక్షన్‌కు జ్యోత్స్నతో కలిసి పారిజాతం వస్తుంది. ఆమెను చూడగానే మీరు వస్తారని తెలిస్తే నేను వచ్చేవాడిని కాదని సెటైర్లు వేస్తాడు శ్రీధర్. నీ కొడుకు మేనకోడలిని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది...ఏమైంది అని శ్రీధర్‌ను గంగాధరం అడుగుతాడు.
అతడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక దగ్గు వచ్చినట్లుగా డ్రామా ఆడుతాడు శ్రీధర్. అతడికి కార్తీక్ వాటర్ బాటిల్ ఇవ్వడానికి వస్తాడు. కార్తీక్‌ను చూసి శ్రీధర్ షాకవుతాడు. శ్రీధర్, పారిజాతం, జ్యోత్స్నను చూసి వీళ్లు ఇక్కడ ఉన్నారేంటి అని కార్తీక్ అనుకుంటాడు. బంగారం లాంటి నీ మేనకోడలిని కాకుండా నీ కొడుకు వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పమని శ్రీధర్‌ను గంగాధరం పట్టుపడతాడు.
రైట్ టైమ్‌లో...
రైట్ టైమ్‌లో రైట్ పర్సన్‌ను రైట్ క్వశ్చన్ అడిగారని కార్తీక్‌ను చూస్తూ జ్యోత్స్న అంటుంది. మీ అబ్బాయి ఎక్కడున్నాడని, ఏం చేస్తున్నాడని ప్రశ్నల వర్షం కురిపిస్తాగు గంగాధరం. అతడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శ్రీధర్ తడబడిపోతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం