Karthika Deepam 2 Serial: డెలివరీబాయ్‌గా మారిన కార్తీక్ - దీప ముందు అడ్డంగా బుక్ - బావపై జ్యోత్స్న రివేంజ్
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం డిసెంబర్ 27 ఎపిసోడ్‌లో తాతయ్య పలుకుబడి ఉపయోగించి కార్తీక్‌కు జాబ్ రాకుండా చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ జాబ్ కోసం వెతుకుతున్నాడని తెలిసిన శ్రీధర్ అతడిని తన ఆఫీస్‌కు పిలిపించుకుంటాడు. తండ్రి జాబ్ ఆఫర్‌ను కార్తీక్ రిజెక్ట్ చేస్తాడు.
Karthika Deepam 2 Serial: దీపను భయపెట్టి ఆమెను కార్తీక్ జీవితం నుంచి వెళ్లిపోయేలా చేయాలని జ్యోత్స్న అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. చీపురు తిరగేసి జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది దీప. నా ముందు చిందులు వేస్తే ఊరుకోనని, అమ్మోరిలా మారిపోతానని జ్యోత్స్నను హెచ్చరిస్తుంది. దీప వార్నింగ్‌కు భయపడిన జ్యోత్స్న అక్కడి నుంచి జారుకుంటుంది.
కార్తీక్‌ను ఫాలో అయినా జ్యోత్స్న...
ఉద్యోగం కోసం బయటకు వచ్చిన కార్తీక్ ఎండవేడి భరించలేక ఇబ్బందులు పడుతుంటాడు. ఆ సీన్‌ను జ్యోత్స్న చూస్తుంది. కార్తీక్‌కు లిఫ్ట్ ఇచ్చి అతడిని తన బుట్టలో పడేసేలా చేయాలని అనుకుంటుంది. కానీ కార్తీక్ ఆటో ఎక్కి వెళ్లిపోతాడు. అతడి ఆటోను ఫాలో అవుతుంది.
సేమ్ సీన్ రిపీట్…
జాబ్ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళతాడు కార్తీక్. సీఈవో పోస్ట్ ఖాళీగా ఉండటంతో కార్తీక్‌కు ఆ జాబ్ ఇస్తామని రెస్టారెంట్ వాళ్లు చెబుతారు. చివరి నిమిషంలో జ్యోత్స్న ఫిట్టింగ్ పెడుతుంది. అతడికి ఆ జాబ్ దక్కకుండా చేస్తుంది. అతడు వెళ్లిన ప్రతి చోట సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. తొలుత జాబ్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చేస్తుంటారు. తాతయ్య పలుకుబడి ఉపయోగించి కార్తీక్‌కు జాబ్ రాకుండా చేస్తుంది జ్యోత్స్న. తనకు జాబ్ దక్కకుండా ఎవరో కుట్రలు పన్నుతున్నారని కార్తీక్ అనుకుంటాడు.
శౌర్య ప్రశ్నల వర్షం...
పెద్దింటి నుంచి మండువాకు ఎందుకు షిఫ్ట్ అయ్యామని, మన ఇంటికి ఎప్పడు వెళతామని కాంచనపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది శౌర్య. మన ఇళ్లు ఖాళీగా ఉందికదా ఇక్కడికి ఎందుకు వచ్చామని అడుగుతుంది. కొన్నాళ్లు ఇక్కడే ఉండాలని కార్తీక్ బాబు చెప్పాడుగా...తొందరలోనే వెళదామని కూతురికి దీప సర్ధిచెబుతుంది.
జాబ్ దొరకలేదు...
జాబ్ కోసం వెళ్లిన కార్తీక్ నీరసంగా ఇంటికి తిరిగివస్తాడు. జాబ్ దొరకలేదని కాంచనతో పాటు దీపతో చెబుతాడు. కార్తీక్ డల్‌గా కనిపించడం చూసి దీప కంగారు పడుతుంది. ప్రతి చోట తనకు ఉద్యోగం ఇస్తానని చెప్పి...ఆ తర్వాత మాట మర్చారని కార్తీక్ అంటాడు. నాకు ఉద్యోగం ఇవ్వొద్దని ఎవరో చెప్పినట్లుగా అనిపించిందని, ఏదో జరిగిందని అంటాడు. జాబ్ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నానని, ఇక ట్రై చేయడానికి ఏం మిగలలేదని అంటాడు. జ్యోత్స్ననే కార్తీక్‌కు జాబ్ రాకుండా అడ్డుపడి ఉంటుందని దీప అనుమానపడుతుంది.
కార్తీక్ డౌట్...
కార్తీక్‌కు ఓ ఫోన్ కాల్ వస్తుంది. మీరు జాబ్ ట్రయల్స్‌లో ఉన్నారని తెలిసిందని, మా ఆఫీస్‌కు వస్తే జాబ్ ఇస్తామని చెప్పి అడ్రెస్ పంపిస్తారు. ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారని కార్తీక్ డౌట్ పడతాడు. దీప, కాంచన బలవంతం చేయడంతో ఆ ఆఫీస్‌కు వెళ్లాలని ఫిక్స్ అవుతాడు కార్తీక్. భర్తకు ఈ ఉద్యోగం వచ్చేలా చూడమని దేవుడిని వేడుకుంటుంది కార్తీక్.
నేను జాబ్ ఇస్తా...
తనను ఫోన్ చేసింది ఎవరా అని ఆలోచిస్తూ కార్తీక్ ఆ ఆఫీస్ అడ్రస్‌కు వెళతాడు. అక్కడ తండ్రిని చూసి కార్తీక్ షాకవుతాడు. అబద్దం చెప్పి నీ దగ్గరకు ఎందుకు రప్పించుకున్నావని తండ్రిపై కార్తీక్ ఫైర్ అవుతాడు. ఉద్యోగం కోసం నువ్వు ఎక్కడెక్కడో తిరగడం నాకు నచ్చడం లేదని శ్రీధర్ అంటాడు. నేను వెళ్లిన ప్రతిచోట నాకు ఉద్యోగం రాకుండా చేస్తుంది నువ్వేనా అని తండ్రిని నిలదీస్తాడు కార్తీక్. అది నాకు తెలియదని, ఆ పని నేను చేయలేదని శ్రీధర్ బదులిస్తాడు. నీకు జాబ్ ఇవ్వడానికి పిలిపించానని అంటాడు.
ఎలా పోషిస్తావు...
నీ దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదని తండ్రితో కోపంగా అంటాడు కార్తీక్. ఉద్యోగం లేదు...ఉండేది అద్దె కొంప. నిన్ను నమ్ముకొని నలుగురు ఉన్నారు. ఉద్యోగం లేకపోతే వారిని ఎలా పోషిస్తావని కొడుకును నిలదీస్తాడు శ్రీధర్. వాళ్లకు తిండిపెట్టడానికి రోజుకో గుడికి తీసుకెళతావా అని అవమానిస్తూ మాట్లాడుతాడు. నా ఫ్యామిలీని ఆ పరిస్థితికి తీసుకురానని తండ్రికి బదులిస్తాడు కార్తీక్.
నిన్ను ఇంట్లో నుంచి పంపించేసి అవమానించామన్న ప్రస్టేషన్‌లో నువ్వు ఉన్నావు...రివేంజ్ తీర్చుకోవడానికే నాకు సాయం చేసి...మీరు గెంటేసినా...నేను మానవత్వంతో మిమ్మల్ని చేరదీశావని పెద్ద మనిషిగా ఫోజు కొట్టడానికే నన్ను పిలిపించావని ప్లాన్‌ను బయటపెడతాడు కార్తీక్. నేను తప్ప మిమ్మల్ని ఆదుకోవడానికి దిక్కులేదని నిరూపించడానికే సీన్ క్రియేట్ చేస్తే ఊరుకునేది లేదని అంటాడు. నీ జాబ్ నాకు అవసరం లేదని చెప్పి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు కార్తీక్. నువ్వు ఎప్పటికైనా నా దగ్గరకే వస్తావని శ్రీధర్ అంటాడు. అది ఎప్పటికీ జరగదని కార్తీక్ రిప్లై ఇస్తాడు.
ఇరవై నాలుగు గంటల్లో...
వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాదనవద్దని, నీకు ఎక్కడ ఉద్యోగం దొరకదని, నీకు ఎవరు జాబ్ ఇవ్వరని కొడుకుతో అంటాడు శ్రీధర్. చేతనైతే ఇరవై నాలుగు గంటల్లో జాబ్ సంపాదించమని ఛాలెంజ్ చేస్తాడు. నేను ఏదైనా చేయాలని అనుకుంటే ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు..గంట చాలని తండ్రి ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసి కార్తీక్ అక్కడి నుంచి వస్తాడు.
వంట మనిషిగా దీప...
ఇళ్లు గడవడం కోసం దీప వంట మనిషిగా జాబ్‌లో జాయిన్ అవుతుంది. దీప వంటపై నమ్మకం లేకపోవడంతో నువ్వు చేసే వంట రుచి చూసిన తర్వాతే జాబ్‌తో పాటు జీతం ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తానని గొప్పింటి మహిళ అంటుంది. నీ మొగుడు కూడా వంట పనే చేస్తాడా అని కార్తీక్ గురించి చులకనగా మాట్లాడుతుంది. తన భర్త బాగా చదువుకున్నాడని, ఆయన్ని తక్కువ చేసే మాట్లాడొద్దని దీప అంటుంది.
సూపర్ మార్కెట్‌లో జాబ్...
గుడికి వెళుతున్నానని అబద్ధం చెప్పి వంట మనిషిగా ఉద్యోగంలో చేరాల్సివచ్చినందుకు దీప బాధపడుతుంది. తాను పని చేస్తోన్న ఇంటికి సూపర్ మార్కెట్ నుంచి ఓ వ్యక్తి సరుకులు తేవడంతో వాటిని తీసుకోవడానికి బయటకు వస్తుంది దీప. ఆ సరుకులు తెచ్చిన కార్తీక్‌ను చూసి షాకవుతుంది. దీప ఈ ఇంట్లో ఉంది ఏంటి అని కార్తీక్ అనుకుంటాడు. కార్తీక్ ఉద్యోగం ఏమై ఉంటుందని దీప ఆలోచిస్తుంటుంది.
సూపర్ మార్కెట్‌లో కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యానని ఆ గొప్పింటి మహిళతో కార్తీక్ చెబుతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.