Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 - అమ్మోరిలా మారిన దీప - చీపురు తిరగేసి జ్యోత్స్నకు మాస్ వార్నింగ్
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం డిసెంబర్ 26 ఎపిసోడ్‌లో దీప వల్లే కార్తిక్ దరిద్రాన్ని అనుభవిస్తున్నాడని జ్యోత్స్న కోపంతో ర లిగిపోతుంది. కార్తిక్ జీవితంలో నుంచి వెళ్లొపొమ్మని, అవసరమైతే ఎంత డబ్బు అయినా ఇస్తానని దీపకు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
Karthika Deepam 2 Serial: పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి షిఫ్ట్ కావడానికి కారణం ఏమిటన్నది శౌర్యకు అంతుపట్టదు. భోజనం కింద కూర్చొని తింటుండటం చూసి డైనింగ్ టేబుల్ ఏమైందని అడుగుతుంది. కూతురిపై దీప కొప్పడుతుంది. ఊర్లో ఉన్నప్పుడు మనకు ఏమైనా టేబుల్ ఉందా? సుమిత్రమ్మ ఔట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్‌పై తిన్నామా అంటూ కోప్పడుతుంది. దీపకు కార్తీక్ సర్ధిచెబుతాడు.
కార్తిక్ ప్రేమ...
భోజనంలో ఫ్రై, అప్పడాలు కనిపించడం లేదని శౌర్య ప్రశ్నలు వేస్తుంది. నేను నీకు అన్ని రకాలు తినిపిస్తాను కళ్లు మూసుకోమని శౌర్యతో అంటాడు డాక్టర్ బాబు. శౌర్యకు పప్పన్నాన్ని పచ్చడి ముద్ద, ఫ్రై ముద్ద అంటూ అబద్ధం చెప్పి అన్నం తినిపిస్తాడు. శౌర్యపై తనకంటే ఎక్కువగా డాక్టర్ బాబు ప్రేమ కురిపించడం చూసి దీప ఎమోషనల్ అవుతుంది. సముద్రంలాంటి మీ ప్రేమలో బతికిపోవడం తిరిగి ఏమివ్వగలనని అనుకుంటుంది.
దీప ఇళ్లు తాకట్టు....
డాక్టర్‌బాబు, దీప భారాన్ని తగ్గించడానికి అనసూయ ఊరికి వెళ్లిపోవాలని ఫిక్సవుతుంది. దీప పేరు మీద ఉన్న ఇళ్లు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తానని కాంచనతో అంటుంది. దీపకు ఈ విషయం తెలుసా అని కాంచన అడుగుతుంది. తండ్రి జ్ఞాపకంగా దీపకు ఉన్న ఒకే ఒక జ్ఞాపకం అదని, తెలిస్తే తాకట్టు పెట్టడానికి ఒప్పుకోదని అనసూయ బదులిస్తుంది.
కార్తిక్ కూడా ఇంటిని తాకట్టు పెట్టవద్దని అంటాడని అనసూయ చెబుతుంది. నువ్వు ఊరికి వెళ్లడం నాకు ఇష్టం లేదని అనసూయను బతిమిలాడుతుంది కాంచన. దీపకు అమ్మనాన్న లేకపోయినా మేనత్తను తాను ఉన్నానని, తన మంచి, చెడు చూసే బాధ్యత నాదేనని అనసూయ ఊరికి బయలుదేరుతుంది.
దీప కళ్లల్లోకి చూస్తూ...
ఇంట్లో అద్దం పెట్టే ప్లేస్ కనిపించకపోవడంతో దీపను పట్టుకోమని కార్తిక్ అంటాడు. దీప పట్టుకుంటుంది. అద్ధంలో బదులు దీప కళ్లల్లోకి చూస్తూ కార్తిక్ ఉండిపోతాడు. అద్ధం చూడమని దీప అంటుంది. నీ కళ్లల్లో నేను కనిపిస్తున్నానని కార్తీక్ సమాధానమిస్తాడు. షర్ట్ బాగుందని కార్తిక్‌కు కాంప్లిమెంట్ ఇస్తుంది దీప.
కార్తిక్‌కు ఇంటర్వ్యూ బయలుదేరుతాడు. కారు లేకుండా ఎలా వెళ్తారని డాక్టర్‌బాబును అడుగుతుంది దీప.
కారు లేకపోతేనేం కాళ్లు ఉన్నాయిగా, బయటకు వెళితే ఆటోలు, బస్‌లు ఉన్నాయని కార్తిక్ అంటాడు. ఖర్చు పెట్టుకోవడానికి మా ఆవిడ ఇచ్చిన డబ్బులు కూడా ఉన్నాయని రొమాంటిక్‌గా సమాధానమిస్తాడు.
కార్తిక్‌నే చూస్తూఉండిపోతుంది దీప. ఏమైందని డాక్టర్ బాబు అడుగుతుంది.
నిన్ను చూసి నేర్చుకున్నా…
నాకంటే చిన్నప్పటి నుంచి కష్టాలు అలవాటు కాబట్టి అన్నింటికి తట్టుకొని నిలబడతాను. కానీ మీరు పరిస్థితులకు సర్ధుకుపోవడం గ్రేట్ అనిపిస్తుందని భర్తపై పొగడ్తలు కురిపిస్తుంది దీప . కష్టాలు చూసి నువ్వు నేర్చుకున్నావు. నిన్ను చూసి నేను నేర్చుకున్నానని దీపకు ఆన్సర్ ఇస్తాడు కార్తిక్.
మీరు దగ్గరయ్యే కొద్ది నాకు మరింత నచ్చుతున్నారని డాక్టర్ బాబుతో అంటుంది దీప. అలాగని చెబితే ఇంకాస్త దగ్గరవుతానుగా అని దీప దగ్గరకు రాబోతాడు డాక్టర్ బాబు. మాటల్లో అంటూ రొమాంటిక్‌గా దీప బదులిస్తుంది. జాబ్ కోసం వెళ్తానన్నారుగా అని అంటుంది. ఇది మాత్రం గుర్తుంటుందని కోపం ఉన్నట్లుగా నటిస్తాడు కార్తిక్.
దీప అనుమానం...
కార్తిక్ ఉద్యోగం వెతుక్కోవడానికి వెళుతున్నాడుగా...నువ్వు ఎదురొస్తే మంచి జరుగుతుందని దీపతో కాంచన అంటుంది. నేను ఎదురొస్తే ఇంక మంచి జరుగుతుందని అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన జ్యోత్స్న అంటుంది. మా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందని రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందని, మేము ఆహ్వానించని అతిథులు అందరూ వస్తున్నారని జ్యోత్స్నపై సెటైర్లు వేస్తాడు కార్తిక్.
జ్యోత్స్నకు కార్తిక్ క్లాస్...
తనపై ఛాలెంజ్ చేసి కుటుంబంతో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయిన కార్తిక్ ఎలాంటి కష్టాలు పడుతున్నాడో చూసి రమ్మని మీ తాత పంపించాడా అని జ్యోత్స్నతో కార్తిక్ అంటాడు. ఇంత నెగెటివ్‌గా ఎలా మాట్లాడుతున్నావని బావను నిలదీస్తుంది జ్యోత్స్న.
దీప రెస్టారెంట్ ఎవరి వల్ల ఆగిపోయిందో అందరికి తెలుసునని కార్తిక్ బదులిస్తాడు. తాతను రెచ్చగొట్టి చేసిందంత చేసి ఇప్పుడు ఏం తెలియనట్లు పలకరించడానికి వచ్చావా అని కార్తిక్ ఫైర్ అవుతాడు.
భోజనం చేయలేదు...
మీరు మిడిల్‌క్లాస్ ఇంట్లో ఉంటున్నారనే నిజం తెలిసి తట్టుకోలేక మిమ్మల్ని చూడటానికి వచ్చానని జ్యోత్స్న అంటుంది. మీరు వెళ్లిపోయారని తెలిసి సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుందని, నేను భోజనం చేయలేదని జ్యోత్స్న అంటుంది. ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన ఖర్మ మీకు ఎందుకు పట్టిందని, ఇప్పుడే తిరిగి ఇంటికి వెళదామని జ్యోత్స్న పట్టుపడుతుంది.
మేము రావడం కాదు...నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ తాత నిన్నుఇంట్లోకి రానివ్వడని కార్తిక్ అంటాడు. అయినా పర్వాలేదని జ్యోత్స అంటుంది. అంత అదృష్టం మాకు వద్దని కార్తిక్ పంచ్‌లు వేస్తాడు.
తాత ఓడిపోయాడని నేను ఒప్పిస్తానని జ్యోత్స్న అంటుంది. తాతలో మార్పు రావాలని, ప్రేమగా ఇంటికి రావాలని మేము కోరుకోవడం లేదని కార్తిక్ బదులిస్తాడు. కష్టమో, నష్టమో గట్టిగానే నిలబడతామని చెబుతాడు. జ్యోత్స్నను వెళ్లిపొమ్మని చెబుతాడు. వెళ్లనని అంటుంది.
చెత్తను బయట పడేయ్....
నాను తిరిగివచ్చేసరికి ఇంటిని శుభ్రం చేయమని దీపకు చెబుతాడు కార్తిక్. ఏదైనా చెత్త ఉంటే ఊడ్చి బయటపడేయమని ఇన్‌డైరెక్ట్‌గా జ్యోత్స్నపై సెటైర్లు వేస్తాడు కార్తిక్. వచ్చేటప్పుడు దిష్టి తగలకుండా గుమ్మడికాయ తెస్తానని చెప్పి వెళ్లిపోతాడు.
మరదలిని అని చూడకుండా వంట మనిషి ముందు కార్తిక్ తనను అవమానించాడని దీపపై తనకున్న కోపాన్ని మొత్తం బయటపెడుతుంది జ్యోత్స్న. దీపను జ్యోత్స్న వంట మనిషి అని పిలవడం చూసి కాంచన కోపం పట్టలేకపోతుంది. దీప తన కోడలు అని చెబుతుంది. పేరు పెట్టి పిలవమని అంటుంది.
లగ్జరీ హౌజ్ నుంచి మండువాలోకి...
దీప వల్లే కార్తిక్ జీవితం ఇలా అయిపోయిందని జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. లగ్జరీ హౌజ్‌లో ఉండాల్సిన మా బావను మండువాలోకి తీసుకొచ్చి పడేశావని, పది మందికి ఉద్యోగం ఇచ్చే బావను ఉద్యోగం కోసం వెతుక్కునే స్థితికి తీసుకొచ్చావని దీపపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న.
నీ వల్లే కార్తిక్ దరిద్రాన్ని అనుభవిస్తున్నాడని కోపంగా అంటుంది. నీ మెడలో తాళికట్టిన కార్తిక్ నాకు కావాలని, నువ్వు ఓకే అంటే కావాల్సిన డబ్బు ఇస్తానని జ్యోత్స్న చెబుతుంది. కార్తిక్ జీవితంలో నుంచి వెళ్లిపొమ్మని అంటుంది.
కార్తిక్‌కు తాళి కట్టని భార్యను...
కార్తిక్‌పై నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏమండి అనో, బావ అనో పిలిచేదానివి. కార్తిక్ బాబు అని పిలుస్తున్నావంటే పెళ్లి చూసుకుంది కాపురం చేయడానికి కాదని, కలిసి బతకడానికి అంటూ జ్యోత్స్న లాజిక్‌లు మాట్లాడుతుంది.
నా కాపురం గురించి అడటానికి నువ్వు ఎవరని జ్యోత్స్నకు ఎదురుతిరుగుతుంది దీప. కార్తిక్‌కు తాళి కట్టని భార్య, నువ్వు మధ్యలో వచ్చి తగులుకోకపోతే ఈ పాటికి నేను, మా బావ హనీమూన్ ట్రిప్‌లో ఉండేవాళ్లమని చెబుతుంది.
చీపురు తిరగేసిన దీప...
నేను తల్చుకుంటే నీ సంసారాన్ని ముక్కలు చేసి...మీ ఊరు నువ్వు పారిపోయేలా చేసి మా బావకు పెళ్లాన్ని అవుతానని దీపతో ఛాలెంజ్ చేస్తుంది జ్యోత్స్న. దీప పక్కనున్న చీపురు తీస్తుంది. తలుచుకోవే అని చీపురు తిరగేసి రివర్స్ ఛాలెంజ్ చేస్తుంది.
పోలేరమ్మను అవుతా...
దీప చీపురు తీయడం తీయడం జ్యోత్స్న భయపపడుతుంది. నీలాంటి దానికి చీపురు తిరగేసి వాయిస్తే కానీ దారిలోకి రావని అంటుంది. దీప నిజంగానే కొట్టేలా ఉందని అనుకున్న జ్యోత్స్న సారీ చెబుతుంది. నేను కొడితే అమ్మనాన్నలు కాదు...వెనుక రెండు, మూడు తరాలు గుర్తొస్తారని దీప అంటుంది.
శాంత మూర్తిలా కనపడుతున్నానని నా ముందు చిందులు వేస్తే నాలోని అమ్మోరు నిద్రలేస్తుంది. ఆ తర్వాత పోలేరమ్మ జాతరే అని వార్నింగ్ ఇస్తుంది. నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా వెళ్లిపొమ్మని జ్యోత్స్నతో అంటుంది దీప. అక్కడితో నేటి కార్తీక దీపం 2సీరియల్ ముగిసింది.