Karthika Deepam 2 Serial: తన ప్రాణాలు కాపాడిన ప్రాణదాత దీప అనే నిజాన్ని కార్తీక్ బయటపెడతాడు. దీప పట్ల తన మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తాడు. నువ్వు బాటసారివి కాదు నా భాగస్వామివి అని దీపతో అంటాడు కార్తీక్. నేను నీ కోసం త్యాగాలు చేయడం లేదు, నీతో జీవితాన్ని పంచుకుంటున్నానని అంటాడు. నీ కోసం నిందలు పడటం లేదు నిజాన్ని ఎదుర్కొంటున్నానని చెబుతాడు. ఇన్ని రకాలు ముడిపడిన బంధం మనది అని అంటాడు.
నువ్వు నా నీడలో బతుకుతున్న సాధారణ మనిషివి కాదు. నాకు ప్రాణం పోసి బతుకునిచ్చిన దేవతవని దీపతో చెబుతాడు కార్తీక్. అప్పటికీ ఇప్పటికీ నేను నీకు రుణపడి ఉన్నానని, రుణం పెరిగింది కానీ తీరలేదని అంటాడు. కార్తీక్ మాటలతో దీప ఆనందం పట్టలేకపోతుంది.
మీరు రుణం తీర్చుకున్నారని కార్తీక్‌కు బదులిస్తుంది దీప. చేసిన సాయానికి గుర్తుగా నా లాకెట్ మీ దగ్గర పెట్టుకొని...మాంగల్యాన్ని మీ గుర్తుగా నా మెడలో వేశారు. నేను మీ ప్రాణాలు కాపాడితే మీరు నా జీవితాన్ని కాపాడారు. గాలికి రాలిపోయి ఏటో ఎగిరిపోవాల్సిన ఈ గడ్డిపూవును దేవుడు పాదాల దగ్గరకు చేర్చారని చెప్పి దీప ఎమోషనల్ అవుతుంది.
నేను మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా...ఎన్ని రకాలుగా బాధలు పెట్టిన భూదేవిలా ఓర్చుకున్నారు. సమస్యల్లో చిక్కుకుపోయిన నాకు ఆకాశంలా నిలబడ్డారు. నా జీవితం అయిపోయినప్పుడు గాలినన్ను కదిలించి ముందుకు నడిపించారు అని కార్తీక్ పట్ట తన మనసులో ఉన్న ఇష్టం, ప్రేమను దీప కూడా బయటపెడుతుంది.
తనను అందరూ తప్పు చేసిన మనిషిలా చూస్తున్నా...తాళిబొట్టు నా మెడలో కట్టి నా బతుకును శుద్ది చేశారని కార్తీక్ తన మెడలో కట్టిన తాళిని చూపిస్తుంది దీప. నా గుడిలో మీరు దేవుడై మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు.
దీపగానే మిగిలిపోవాల్సిన నా చీకటి జీవితాన్ని...దీపంగా వెలిగించి మీ పేరు పక్కన చోటిచ్చి నన్ను కార్తీక దీపం చేశారని దీప ఎమోషనల్ అవుతుంది. నన్ను ఇంత గొప్పగా అర్థం చేసుకొని ఆరాధించే నువ్వు నాకు ఎలా భారం అవుతావు. నా జీవితంలో నుంచి ఎలా వెళ్లిపోతానని అనుకున్నావు.
ఇంకో జన్మ ఉందో లేదో తెలియదు. నా నుంచి దూరంగా వెళ్లిపోతానని ఇంకోసారి అనొద్దని దీపతో అంటాడు కార్తీక్. ప్రాణాలు కాపాడిన ఈ చేతులను ప్రాణం ఉన్నంత వరకు దూరం చేసుకోనని దీప చేతులు పట్టుకొని కార్తీక్ చెబుతాడు. కష్టాలు, అవమానాలు నీకు, నాకు కొత్త కాదు. తట్టుకొని నిలబడతామని అంటాడు. అర్థం చేసుకునే వాళ్లను పట్టించుకోకు.
నీ నిజాయితీ నిరూపితమైన రోజు ఇప్పుడు తిట్టిన వాళ్లే చప్పట్టు కొడతారు, పొగుడుతారు, సారీ చెబుతారు అని దీప మనసులోని బాధను పొగొట్టే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. మనలను తక్కువ చేసి చూపించిన వాళ్లకు మనమేంటో నిరూపించాలి. మనం గెలవాలి. మన గెలుపుతోనే అవతలి వాళ్ల అహాన్ని దెబ్బకొట్టాలని కార్తీక్ అంటాడు. నువ్వు నేను వేరు కాదు. మన ఇద్దరం ఒక్కటే. మనది దేవుడు వేసిన బంధమని దీపతో చెబుతాడు కార్తీక్. మన జీవితంలోకి ఎ లాంటి తుఫాను వచ్చిన నవ్వుతూనే ఎదిరిద్దాం అని అంటాడు.
మరోసారి నా జీవితంలో నుంచి వెళ్లిపోతా అనవుగా అని దీపను అడుగుతాడు కార్తీక్. వెళ్లనని తల ఊపుతుంది. నోటితో చెప్పమని కార్తీక్ అంటాడు. చిన్నప్పుడు బాగానే మాట్లాడేదానివి కదా అని అంటాడు. అప్పుడు బలం లేదు...ఇప్పుడు ధైర్యం లేదని దీప బదులిస్తుంది. నా భార్య అన్నపూర్ణ మాత్రమే కాదు ఆదిశక్తి. నీ బలం, ధైర్యం ఏమిటో నాకు తెలుసు అని కార్తీక్ అంటాడు.
తన దగ్గర ఉన్న దీప లాకెట్‌ను ఆమెకు ఇవ్వబోతాడు. తీసుకోవడానికి చేయి చాస్తుంది దీప. ఇన్ని సంవత్సరాలు కష్టపడి దాచింది చేతికి ఇవ్వడానికి కాదు. మెడలో వేయడానికి అని కార్తీక్ అంటాడు.
ఇక నా సర్వం, సర్వస్వం నువ్వే అని అంటాడు. మూడుముళ్లు ఎలాగు నీకు ఎదురుపడి వేయలేదు. ఈ లాకెట్ అయినా నీకు ఎదురుగా నిలబడి వేస్తానని దీప మెడలో లాకెట్ వేస్తాడు కార్తీక్. దీప ఆనందపడుతుంది.
ఈ లాకెట్ నీకు ఎవరు ఇచ్చారని దీపను అడుగుతాడు కార్తీక్. ఇది మా అమ్మ లాకెట్ అని, అమ్మ జ్ఞాపకంగా ఉండాలని నాన్న నా మెడలో వేశాడని దీప ఆన్సర్ ఇస్తుంది. మీ నాన్న మనల్ని పెద్దయిన తర్వాత కలిపితే...మీ అమ్మ మనలను చిన్నప్పుడే కలిపిందని కార్తీక్ అంటాడు.ఇప్పుడు నిజం బయటపెట్టినందుకు మనసు చాలా హాయిగా ఉందని కార్తీక్ అంటాడు. నాకు అలాగే ఉందని దీప అంటుంది.
గౌతమ్‌ను కలుస్తుంది జ్యోత్స్న. అతడిని రెచ్చగొట్టి దీపపై యుద్దానికి పంపించాలని ప్లాన్ చేస్తుంది. పెళ్లి చేసుకోమని అడగటానికే జ్యోత్స్న పిలిచిందని గౌతమ్ అనుకుంటాడు. ఈ సారి ఎలాంటి హంగామా లేకుండా రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందామని జ్యోత్స్నతో అంటాడు గౌతమ్. నువ్వు ఎలాంటివాడివో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. తన అవసరం కోసం అతడు చెప్పింది విన్నట్లు నాటకం ఆడాలని అనుకుంటుంది.
దీపపై నీపై ఎలాంటి నిందలు వేసిందో మర్చిపోయావా అని గౌతమ్‌తో అంటుంది జ్యోత్స్న. అవన్నీ అబద్ధాలు అని గౌతమ్ బదులిస్తాడు. దీప నా మ్యాటర్‌లో ఎందుకు ఇన్‌వాల్వ్ అవుతుందని గౌతమ్ కోపంగా రియాక్ట్ అవుతాడు.
నేను మంచివాడిని కాదంటే నువ్వు నమ్ముతున్నావా అని జ్యోత్స్నను అడుగుతాడు గౌతమ్. మా ఇంట్లోవాళ్లు నమ్మేలా ఉన్నారని జ్యోత్స్న బదులిస్తుంది. ఎంగేజ్‌మెంట్‌లో జరిగిన గొడవ తర్వాత కూడా దీప మా ఇంటికొచ్చి నిన్ను చెడ్డవాడిగా నిరూపిస్తానని ఛాలెంజ్ చేసిందని గౌతమ్‌ను రెచ్చగొడుతుంది.
తను నిన్ను ఎలా చెడ్డవాడు అని ప్రూవ్ చేస్తుందో నాకు తెలియదు. కానీ మా అమ్మనాన్నలు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందని గౌతమ్‌తో చెబుతుంది జ్యోత్స్న. దీప నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టదని, నిజంగా తప్పు చేసి ఉంటే ఒప్పుకోమని గౌతమ్‌ను రెచ్చగొడుతుంది.
దీప సంగతి తాను చూసుకుంటానని గౌతమ్ అంటాడు. నా దారికి ఎవరైనా అడ్డొస్తే చాలా సీరియస్‌గా తీసుకుంటాను. ఎంత సీరియస్‌గా తీసుకుంటాను అన్నది ఆ దీపకే చూపిస్తానని అంటాడు.దీప పని అయిపోయినట్లేనని లోలోన సంబరపడుతుంది జ్యోత్స్న.
జ్యోత్స్న వెళ్లిపోగానే...నిన్ను ఈజీగా వదిలేసుకోవడానికి నేను కార్తీక్‌ను కాదని, నువ్వు, నీ ఆస్తి రెండు నా సొంతం కావాలి అని జ్యోత్స్నను ఉద్దేశిస్తూ గౌతమ్ అనుకుంటాడు. దీప సంగతి చెబితేనే తన కల తీరుందని అనుకుంటాడు.
దాసుకు గతం గుర్తొచ్చే ప్రయత్నం చేస్తాడు కాశీ. రూమ్ క్లీన్ చేస్తున్న స్వప్నకు ఫ్లవర్ వాజ్ కింద పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్‌లో అన్నయ్య నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంటి వారసురాలి విషయంలో అన్యాయం జరిగింది. అసలైన వారసురాలు అని రాసి ఆపేస్తాడు. కాంచన గురించి రాసి ఉంటాడని కాశీ, స్వప్న అనుకుంటారు.
ఈ పేపర్‌లో రాసిన దాని గురించి దాసునే అడుగుతారు. ఎంత ఆలోచించిన తాను ఎవరి గురించి రాసానో చెప్పలేకపోతాడు దాసు. నాన్నకు జరిగిన ప్రమాదానికి, దశరథ్‌కు, ఆ ఇంటికి ఏదో సంబంధం ఉందని కాశీ అనుమానిస్తాడు. తండ్రి కోలుకుంటేనే నిజాలు బయటపడతాయని అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం