దీప అనుమతి లేకుండానే ఆమె మెడలో కార్తీక్ తాళి కట్టాడని కోర్టులో లాయర్ కళ్యాణ్ ప్రసాద్ వాదిస్తాడు. కట్టాడు కాదు దీపనే కట్టించుకుందని జ్యోత్స్న లాయర్ భగవాస్ దాస్ ఆరోపిస్తాడు. ఇదంతా ప్రీ ప్లాన్‌డ్‌గా జరిగిందని అంటాడు. కార్తీక్‌కు, దీపకు ముత్యాలమ్మ గూడెంలో ఉన్నప్పుడే పరిచయాలు ఉన్నాయని భగవాస్ దాస్ అంటాడు.
అవి ఎలాంటి పరిచయాలో తెలుసా అని కళ్యాణ్ ప్రసాద్ బదులిస్తాడు. నేను పరిచయాలు ఉన్నాయని అన్నాను కానీ, అక్రమ సంబంధం ఉందని అనలేదని తక్కువ చేసి మాట్లాడుతాడు భగవాస్ దాస్. అతడి మాటలతో దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.
జ్యోత్స్న పెళ్లి చేసుకోవాల్సిన మనిషి చేత చాలా తెలివిగా తన మెడలో తాళి కట్టించుకునేలా దీప చేసింది. బావను ఇబ్బంది పెట్టలేక, వదులుకోలేక దీప దగ్గరకు వెళ్లి జ్యోత్స్న ప్రాధేయపడింది. దీప చేతిలో జ్యోత్స్న దెబ్బలు కూడా తిన్నది అని భగవాస్ అంటాడు.
కర్ర తీసుకొని జ్యోత్స్ను కొట్టడానికి వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లావని దీపను అడుగుతాడు భగవాస్. జ్యోత్స్న పెళ్లి పేరుతో అందరిని మోసం చేస్తుందని, తనను అందరిలో చెడ్డదానిని చేస్తుందని దీప అంటుంది. తన నిశ్చితార్థం తానే చెడగొట్టుకొని...నా వల్ల చెడిపోయినట్లు అందరిని నమ్మించిందని దీప అంటుంది.
నువ్వు చెప్పింది మేమంతా నమ్మడానికి సాక్ష్యాలు ఉన్నాయా అని దీపను అడుగుతాడు భగవాస్ దాస్. లేవని కన్నీళ్లతో దీప చెబుతుంది. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా జ్యోత్స్నపై దీప నిందలు వేయడమే కాకుండా కొట్టడానికి వెళ్లిందని జడ్జ్‌తో చెబుతాడు.
జ్యోత్స్నను కొట్టడానికి దీప వెళ్లలేదని, పెళ్లి విషయంలో జ్యోత్స్న చేసిన తప్పులను బయటపెట్టడానికే వెళ్లిందని కళ్యాణ్ ప్రసాద్ వాదిస్తాడు. అలాంటప్పుడు దీపకు కర్రతో, గన్‌తో పనేముందని లాజిక్‌లు మాట్లాడుతాడు భగవాన్‌దాస్.
జ్యోత్స్నను దీప కార్తీక్ పెళ్లి విషయంలో మోసం చేసిందని భగవాస్ దాస్ వాదిస్తాడు. జ్యోత్స్న తన బాధను మర్చిపోలేక దీపను బతిమిలాడింది. కార్తీక్‌ను ఎక్కడ తన నుంచి జ్యోత్స్న దూరం చేస్తుందోనని దీప భయపడింది. జ్యోత్స్న బతికిఉంటే ప్రమాదమని ఇంటికెళ్లి ఆమెతో గొడవపడింది. కర్రతో కొట్టి చంపబోయింది దీప. దీప నుంచి తనను తాను కాపాడుకోవడానికి లైసెన్సెడ్ గన్‌తో జ్యోత్స్న బెదిరించాలని అనుకుంది.
జ్యోత్స్నను కొట్టి తన చేతిలో ఉన్న గన్ లాక్కొని దీప కాల్చింది అని భగవాస్ దాస్ కోర్టులో వాదిస్తాడు. అతడి మాటలు విని దీప షాకవుతుంది. దీపనే దశరథ్‌ను కాల్చింది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని జడ్జ్‌కు ఇస్తాడు. దీపనే తనను కాల్చిందని దశరథ్ కూడా వాంగ్మూలం ఇచ్చారని లాయర్ అంటాడు.
కార్తీక్ కూడా ప్రత్యక్ష సాక్షి కావాలంటే అతడిని విచారించుకోమని దీప లాయర్ కళ్యాణ్ ప్రసాద్‌తో భగవాస్ దాస్ చెబుతాడు. గన్‌తో బెదిరించబోయానని, కానీ తాను కాల్చలేదని దీప చెబుతుంది. నువ్వు కాల్చకుండా ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందని భగవాస్ దాస్ అంటాడు.
అది కనిపెట్టాల్సింది పోలీసులు అని కళ్యాణ్ ప్రసాద్ చెబుతాడు. ఒక హంతకురాలిని కాపాడే ప్రయత్నం చేయద్దని భగవాస్ దాస్ చెబుతాడు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా దీపను హంతకురాలు అనే ఎలా అంటారని కళ్యాణ్ ప్రసాద్ వాదిస్తాడు. గన్ తానే పట్టుకున్నానని దీపనే ఒప్పుకుందని భగవాస్ దాస్ అంటాడు.
గన్ పట్టుకుందని ఒప్పుకుంది కానీ కాల్చిందని చెప్పలేదుగా అని లాజిక్‌లు మాట్లాడుతాడు కళ్యాణ్ ప్రసాద్. దీప గన్ పట్టుకోవడమే మొదటిసారి అని అంటాడు. జ్యోత్స్నను చంపాలన్న కోపం, అందరు ఆపాలనే ప్రయత్నించిన గందరగోళంలో దీప చేతిలోని గన్ పేలింది భగవాస్ దాస్...దీపను ఇరికిస్తాడు.
పోలీస్ స్టేషన్‌లో కూడా గొంతు పట్టుకొని జ్యోత్స్నను దీప చంపబోయిందని, ఎస్ఐ అందుకు సాక్ష్యం భగవాస్ దాస్ చెబుతాడు. జ్యోత్స్నను కార్తీక్ కాపాడాడు అని చెబుతాడు.
దీపలో నన్ను చంపాలని అన్నంత కోపం ఉందని కోర్టులో జ్యోత్స్న చెబుతుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చంపుతుందని అంటుంది. దీప మీ నాన్నగారిని షూట్ చేసిందా అని జ్యోత్స్నను అడుగుతాడు కళ్యాణ్ ప్రసాద్.అవునని జ్యోత్స్న బదులిస్తుంది. ఆ టైమ్‌లో ఇంట్లో అందరూ ఉంటే మీ నాన్న, తాతతో చెప్పకుండా నువ్వు గన్ ఎందుకు తీశావని కళ్యాణ్ ప్రసాద్ అడగటంతో జ్యోత్స్న షాకవుతుంది.
భయంతో చేశానని బుకాయించబోతుంది. భయంతో కాదని, దీపను మర్డర్ కేసులో ఇరికించడానికే ప్లాన్ వేసి చేశావని అంటాడు. కళ్యాణ్ ప్రసాద్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని, దీపనే హంతకురాలు అని జడ్జ్‌తో చెబుతాడు. నిజాలు బయటపడకుండా అడ్డుకుంటాడు.
ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ వచ్చేవరకు వాయిదా వేయమని జడ్జ్‌ను కళ్యాణ్ ప్రసాద్ కోరుతాడు.దీపనే దశరథ్‌ను షూట్ చేసింది అనడానికి పూర్తి ఆధారాలు లేనందుకు ఈ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ చెబుతుంది. . అంతవరకు దీపకు రిమాండ్ ఉండాలని ఆదేశిస్తుంది. దీపకు ఆరేళ్ల కూతురు ఉందని కళ్యాణ్ ప్రసాద్ చెప్పిన జడ్జ్ మాత్రం బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోదు. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను చూసి కార్తీక్, కావేరి బాధపడతారు.
దీపకు శిక్ష తప్పదా...అది జైలు నుంచి బయటకు రాదా అని కార్తీక్‌ను అడుగుతుంది అనసూయ. సాక్ష్యాలు ఉంటే తప్పకుండా దీప నిర్ధోషిగా బయటకు వస్తుందని కార్తీక్ బదులిస్తాడు. గన్ మీద దీప వేలిముంద్రలు ఉన్నాయా లేదా? బుల్లెట్ దీప చేతిలోని గన్ నుంచే వచ్చిందా లేదా అన్నది ఫోరెన్సిక్ వాళ్లు తేల్చాలి.
ఒకవేళ దీప కాల్చకపోతే ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు కనిపెట్టాలని కార్తీక్ చెబుతాడు. ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు దీపను కాపాడుకోలేమా అని అనసూయ అంటుంది. ఆ ప్రశ్నకు తన దగ్గర కూడా సమాధానం లేదని కార్తీక్ బదులిస్తాడు.
అమ్మ ఏదని, పోలీసులే తీసుకెళ్లారా అని కార్తీక్‌ను శౌర్య ఏడుస్తూ అడుగుతుంది. నిన్న అమ్మను తీసుకొస్తానని నాకు మాటిచ్చావు ఎందుకు తీసుకురాలేదని నిలదీస్తుంది. నువ్వు నాకు అమ్మ విషయంలో అన్ని అబద్దాలే చెప్పావని అంటుంది. నేను అమ్మ దగ్గరకు వెళతానని మారాం చేస్తుంది.అమ్మ పోలీస్ స్టేషన్‌లో ఉందని నాకు తెలుసునని అంటుంది.
నువ్వు పోలీస్ స్టేషన్ వెళితే...నాన్న నీతో ఎప్పటికీ మాట్లాడడు, కనిపించడు అని శౌర్యతో అంటాడు కార్తీక్.
నాకు నువ్వు, అమ్మ ఇద్దరు కావాలి అని శౌర్య అంటుంది. అమ్మను తీసుకొస్తానని అని శౌర్యకు మాటిస్తాడు కార్తీక్. అమ్మ ఏ తప్పు చేసింది, ఎందుకు పోలీసులు తీసుకెళ్లారని కార్తీక్‌ను అడుగుతుంది శౌర్య.
అమ్మ తప్పు చేస్తుందా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. అమ్మ ఎప్పటికీ తప్పు చేయదని, చాలా మంచిదని శౌర్య బదులిస్తుంది. వచ్చే బుధవారం అమ్మను తీసుకొస్తానని శౌర్యతో అంటాడు కార్తీక్. నాన్న మాటిచ్చాడంటే తప్పదని శౌర్య అంటుంది. రెండో వాయిదాకు తప్పకుండా దీపను తీసుకొస్తానని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం