Karthi Pasalapoodi Veera Babu OTT Release Date: ఓటీటీలో రిలీజైన కార్తి ప‌స‌ల‌పూడి వీర‌బాబు సినిమా -karthi pasalapoodi veerababu movie to premiere on amazon prime from september 30 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Karthi Pasalapoodi Veerababu Movie To Premiere On Amazon Prime From September 30

Karthi Pasalapoodi Veera Babu OTT Release Date: ఓటీటీలో రిలీజైన కార్తి ప‌స‌ల‌పూడి వీర‌బాబు సినిమా

Nelki Naresh Kumar HT Telugu
Sep 30, 2022 04:45 PM IST

Karthi Pasalapoodi Veera Babu OTT Release Date: కార్తి హీరోగా న‌టించిన ప‌స‌ల‌పూడి వీర‌బాబు సినిమాలో డైరెక్ట్ గా ఓటీటీలో విడుద‌లైంది. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే...

కార్తి
కార్తి (twitter)

Karthi Pasalapoodi Veera Babu OTT Release Date: త‌మిళ హీరో కార్తి సినిమాల‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అత‌డు న‌టించిన ప‌లు త‌మిళ సినిమాలు తెలుగులో అనువాద‌మై పెద్ద విజ‌యాల్ని సాధించాయి.

అవారా, ఖాకీ, ఖైదీ తెలుగులో స్ట్రెయిట్ హీరోల సినిమాల‌కు ధీటుగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. కార్తి త‌మిళ సినిమాల‌ను తెలుగులో రిలీజ్ చేయ‌డం అన‌వాయితీగా వ‌స్తోంది. కార్తి గ‌త చిత్రం విరుమ‌న్ కూడా తెలుగులో రిలీజైంది.

థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే ప‌స‌ల‌పూడి వీర‌బాబు పేరుతో ఈ సినిమాను విడుద‌ల‌చేశారు. శుక్ర‌వారం (నేడు) నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ముత్త‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆగ‌స్ట్ 12న థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌లైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

విరుమ‌న్ సినిమాతో అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్ హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అహంభావ మ‌న‌స్త‌త్వ‌మున్న తండ్రి, మంచి మ‌న‌సున్న కొడుకుకు మ‌ధ్య సాగే క‌థ‌తో ముత్త‌య్య ఈ సినిమాను రూపొందించారు.

IPL_Entry_Point