Kollywood OTT: కార్తి, అరవింద్ స్వామి హీరోలుగా నటించిన సత్యం సుందర మూవీ తమిళంతో పాటు తెలుగులో మంచి సినిమాగా ఆడియెన్స్ మన్ననల్ని అందుకున్నది. కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్నట్లు సమాచారం. అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తమిళంతో పాటు అదే రోజు నుంచి తెలుగులోనూ సత్యం సుందర మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో మేయాజగన్ రూపొందిన ఈ మూవీ తెలుగులో సత్యం సుందరం పేరుతో డబ్ అయ్యింది. తమిళంలో సెప్టెంబర్ 26న రిలీజైన ఈ మూవీ తెలుగులో దేవర కారణంగా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.దేవర పోటీని తట్టుకొని తెలుగులో మంచి టాక్‌ను తెచ్చుకున్నది.
సత్యం సుందరం మూవీకి 96 ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ ఫన్ డ్రామా మూవీని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతికతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. ఈ మూవీలో తెలుగు హీరోయిన్ శ్రీదివ్య ఓ కీలక పాత్రలో కనిపించింది. సత్యం సుందర మూవీకి గోవింద్ వసంత మ్యూజిక్ అందించాడు. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అరవై కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. సూర్యకు లాభాలను తెచ్చిపెట్టింది.
రామలింగం కుటుంబం మూడు తరాలుగా ఉంటున్న ఇళ్లు ఆస్తి గొడవల్లో బంధువుల సొంతం అవుతుంది. రామలింగం కొడుకు సత్యం (అరవింద్ స్వామి) బంధువులతో పాటు సొంత ఊరు ఉద్ధండరాయునిపాలెంపై ద్వేషం పెంచుకుంటాడు. మళ్లీ ఆ ఊరిలో అడుగుపెట్టకూడదని నిర్ణయించుకుంటాడు.
చిన్నాన్న కూతురు భువన (స్వాతి) పెళ్లికి కోసం ఇరవై ఏళ్ల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో సత్యం సొంతూరికి రావాల్సివస్తుంది .ఆ పెళ్లిలో సత్యానికి సుందరం (కార్తి) తారసపడతాడు. బావ అంటూ సత్యం వెంటే తిరుగుతుంటాడు.
కానీ సత్యం మాత్రం సుందరాన్ని గుర్తుపట్టడు. పేరు కూడా మర్చిపోయనని తెలిస్తే సుందరం బాధపడతాడని తెలిసిన వ్యక్తిగా సత్యం నటిస్తాడు.సుందరం చూపించే అతి ప్రేమ కారణంగా ఇబ్బందులు పడ్డ సత్యం ఆ తర్వాత అతడి మంచి మనసును ఏ విధంగా అర్థం చేసుకున్నాడు?
సుందరం రాకతో సత్యం జీవితం ఎలా మారింది. సత్యానికి సుందరం పేరు ఎప్పుడు తెలిసింది? ఎవరికి చెప్పకుండా సుందరం ఇంట్లో నుంచి సత్యం ఎందుకు పారిపోయాడు? ఒక్క రోజులో వీళ్లిద్ధరి జర్నీ ఎలా సాగింది అన్నదే ఈ మూవీ కథ.
పొన్నియన్ సెల్వన్ 2, జపాన్ డిజాస్టర్స్ తర్వాత సత్యం సుందరం మూవీతో కార్తి మళ్లీ హిట్ దక్కింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోన్నాడు కార్తి. వా వాత్తియారే రిలీజ్‌కు సిద్ధమైంది. సర్ధార్ 2 షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 మూవీ కూడా కార్తి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.