Japan Twitter Review: జపాన్ ట్విట్టర్ రివ్యూ - కార్తి వన్ మ్యాన్ షో ...కామెడీ పీక్స్
Japan Twitter Review: కార్తి హీరోగా నటించిన జపాన్ మూవీ దీపావళి కానుకగా శుక్రవారం (నవంబర్ 10న) తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకుడు.
Japan Twitter Review: కోలీవుడ్‌లో ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తూ వెర్సటైల్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు కార్తి. అతడు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జపాన్ శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. కార్తి కెరీర్‌లో 25వ సినిమాగా తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలతో రిలీజైన జపాన్ మూవీ ఎలా ఉందంటే?
కార్తి కామెడీ టైమింగ్...
జపాన్ మూవీ ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ లభిస్తోంది. సినిమాలో దొంగగా కార్తి లుక్, యాక్టింగ్ గత సినిమాలకు భిన్నంగా చాలా కొత్తగా ఉందని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. కార్తి కామెడీ టైమింగ్ జపాన్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచిందని పేర్కొంటున్నారు.
కార్తి వన్ మ్యాన్ షోగా ఈ మూవీ నిలుస్తుందని ఫ్యాన్స్ చెబుతోన్నారు. యాక్షన్, కామెడీకి రొమాన్స్‌ను జోడిస్తూ డిఫరెంట్ పాయింట్‌తో దర్శకుడు రాజు మురుగన్ జపాన్ సినిమాను తెరకెక్కించాడని అంటున్నారు. జపాన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
జీవీ ప్రకాష్ బీజీఎమ్
జపాన్ సినిమాకు ఫస్ట్ హాఫ్ డ్రాబ్యాక్ అని మరో నెటిజన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కథ లేకుండా టైమ్‌పాస్ చేయడంతో ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని, కానీ సెకండాఫ్ ను మాత్రం దర్శకుడు థ్రిల్లింగ్‌గా నడిపించాడని ట్వీట్ చేశాడు.
జీవీ ప్రకాష్ బీజీఎమ్ ఈ సినిమాకు ప్రాణం పోసిందని నెటిజన్లు పేర్కొన్నారు. కథలోని ఫీల్‌ను తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో జీవీ ఎలివేట్ చేశారని చెబుతోన్నారు. అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ కూడా సినిమాకు ఎస్సెట్‌గా నిలుస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు.