TV Premiere: టీవీ ఛానెల్‍లోకి కార్తీ హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడ!
Satyam Sundaram Premiere: సత్యం సుందరం చిత్రం టీవీలో ప్రసారమయ్యేందుకు రెడీ అయింది. టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. ఈ మూవీ టీవీ ఛానెల్‍లో ఎప్పుడు ప్రసారం కానుందంటే..
తమిళ మూవీ మేయళగన్ చిత్రం తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో వచ్చింది. తమిళ హీరోలు కార్తీ, అరవింద స్వామి ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి ప్రశంసలు దక్కించుకుంది. సరదాగా ఉంటూనే ఎమోషనల్‍గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు ప్రేమ్ కుమార్.

తమిళంలో ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కాగా.. తెలుగు వెర్షన్ సత్యం సుందరం ఒక్క రోజు తర్వాత థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సత్యం సుందరం ఇప్పుడు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. టెలికాస్ట్ డేట్ ఖరారైంది.
ఏ ఛానెల్‍లో.. ఎప్పుడు?
సత్యం సుందరం సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం సాయంత్రం స్టార్ మా టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ వివరాలను స్టార్ మా అధికారికంగా ప్రకటించింది.
ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
మేయళగన్ చిత్రం అక్టోబర్ 25న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు వెర్షన్ సత్యం సుందరంతో పాటు హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ఈ చిత్రానికి చాలా ప్రశంసలు దక్కాయి. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని రోజుల పాటు టాప్‍లో ట్రెండ్ అయింది. టీవీలో సత్యం సుందరం మూవీకి ఎంత టీఆర్పీ వస్తోందో చూడాలి.
సత్యం సుందరం మూవీలో కార్తీ, అరవింద స్వామి యాక్టింగ్‍తో మెప్పించారు. హృదయాలను తాకేలా ఈ చిత్రాన్ని రూపొందించారు ప్రేమ్ కుమార్. కామెడీ ఉంటూనే ఎమోషనల్‍గానూ టచ్ చేసింది. ఎంతో మందికి ఈ చిత్రం బాగా కనెక్ట్ అయింది. ‘96’ సినిమాతో ప్రశంసలు దక్కించుకున్న ప్రేమ్.. సత్యం సుందరంతో మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రశంసలు దక్కించుకున్నారు.
సత్యం సుందరం చిత్రంలో కార్తీ, అరవింద స్వామి సహా రాజ్‍కిరణ్, దేవదర్శిని, శ్రీదివ్య, జయప్రకాశ్, శ్రీరంజనీ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతం అందించగా.. మహేంద్రియన్ జయరాజు సినిమాటోగ్రఫీ చేశారు.
సత్యం సుందరం సినిమాను 2డీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మించారు. ఈ సినిమా తమిళం, తెలుగు మొత్తంగా సుమారు రూ.46కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుందని అంచనా. సుమారు రూ.35కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. కమర్షియల్‍గా భారీ కలెక్షన్లు రాకపోయినా.. మంచి చిత్రమంటూ ప్రశంసలు దక్కించుకుంది. ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీగా చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేసి మెప్పించింది.
సంబంధిత కథనం