Saif Ali Khan Kareena Kapoor: సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లపై భార్య కరీనా కపూర్ సంచలన కామెంట్స్.. అలాంటివి చేయొద్దంటూ!
Saif Ali Khan Kareena Kapoor Statement On Attack: దేవర విలన్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి, కత్తిపోట్లపై అతని భార్య, హీరోయిన్ కరీనా కపూర్ సంచలన కామెంట్స్ చేసింది. సైఫ్ తప్పా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారని చెప్పిన కరీనా కపూర్ అలాంటివి చేయొద్దంటూ విన్నవించుకుంది.
Saif Ali Khan Kareena Kapoor Statement On Attack: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ విలన్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇవాళ (జనవరి 16) ఉదయం కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై సైఫ్ అలీఖాన్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ టీమ్ ఈపాటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. గురువారం తెల్లవారుజామున సైఫ్, కరీనాలు నివసిస్తున్న బాంద్రా ఇంట్లో ఈ దాడి జరిగింది.

ముఖ్యమైన అవయవాలకు
ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు. అయితే, దుండగుడి దాడిలో సైఫ్ ముఖ్యమైన అవయవాలకు ఏం కాలేదని, అలాగే, అతని వెన్నెముక కూడా బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో దుండగుడు చోరీకి యత్నించినట్లు కరీనా బృందం మీడియాకు ఓ ప్రకటనలో తెలిపింది.
ఎలాంటి ఊహగానాలు చేయొద్దు
"సైఫ్ చేతికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగతా కుటుంబ సభ్యులంతా క్షేమంగానే ఉన్నారు'' అని ఆ ప్రకటనలో కరీనా కపూర్ పేర్కొంది. అలాగే, ఎలాంటి ఊహాగానాలు చేయొద్దని, ఇప్పటికే పోలీసులు కావాల్సిన దర్యాప్తు చేస్తున్నందున ఓపిక పట్టాలని, ఇకపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని మీడియాను కోరుతున్నామని ఆ ప్రకటనలో కరీనా కపూర్ పేర్కొంది.
ఓపిక పట్టాలని
కరీనా కపూర్ ఖాన్ సంతకం చేసి ఇచ్చిన మీడియా ప్రకటన వైరల్ అవుతోంది. ఎలాంటి పుకార్లు చేయవద్దని మీడియాను కోరింది కరీనా కపూర్. "మీడియా, అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నాం. ఇది పోలీసుల వ్యవహారం. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తాం" అని ఆ ప్రకటనలో కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.
చిరంజీవి, తారక్ ట్వీట్స్
ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ దాడి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినీ వర్గాల్లో కలకలం రేపింది. దీంతో తెలుగు స్టార్ హీరోలు సైఫ్ అలీ ఖాన్ దాడిపై రియాక్ట్ అయ్యారు. ఈ దాడి తనను ఎంతో కలిచివేసిందని, సైఫ్ త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయగా.. ఇది చాలా బాధాకరమని, సైఫ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
పనిమనిషితో వాగ్వాదం
కాగా, గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి అతని ఇంటి పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. ఆ వ్యక్తిని శాంతింపజేసేందుకు ప్రయత్నించిన సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసి గాయపరిచాడని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రికి తీసుకెళ్లిన పెద్ద కొడుకు
దాడి జరిగినప్పుడు సైఫ్ భార్య, నటి కరీనా కపూర్, వారి ఇద్దరు కుమారులు తైమూర్, జెహ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. చివరకు సైఫ్ పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తన ఇంటికి చేరుకుని నటుడిని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అతనికి శస్త్రచికిత్స జరిగింది.
ఆరు గాయాలు
సైఫ్ అలీ ఖాన్ శరీరంపై ఆరు గాయాలు ఉన్నాయని లీలావతి ఆసుపత్రి సీవోవో డాక్టర్ నీరజ్ ఉత్తమాని తెలిపారు. సైఫ్ శరీరంలో కత్తి ముక్కను వైద్యులు కనుగొన్నారని సమాచారం. అయితే, సైఫ్ అలీ ఖాన్ తన అవయవాలను బాగానే కదిలిస్తున్నాడని, వెన్నెముక కూడా బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.