Karataka Damanaka Review: కరటక దమనక రివ్యూ - వెరైటీ టైటిల్‌తో ఓటీటీలో రిలీజైన కన్నడ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
Karataka Damanaka Review: శివరాజ్‌కుమార్, ప్రభుదేవా హీరోలుగా నటించిన కన్నడ మూవీ కరటక దమనక అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ మూవీకి యోగరాజ్ భట్ దర్శకత్వం వహించాడు.
Karataka Damanaka Review: కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ (Shivaraj Kumar), ప్రభుదేవా (Prabhudeva) హీరోలుగా నటించిన కరటక దమనక మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ (Amazon Prime OTT) ఓటీటీలో రిలీజైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు యోగరాజ్ భట్ దర్శకత్వం వహించాడు. ప్రియా ఆనంద్, నిశ్వికా నాయుడు హీరోయిన్లుగా నటించారు. ఈ కన్నడ (Kannada) మూవీ ఎలా ఉందంటే?
కరటక దమనక కథ...
విరూపాక్ష (శివరాజ్‌కుమార్), బసవరాజు (ప్రభుదేవా) మోసాలు చేస్తూ బతుకుతుంటారు. తమ మాయ మాటలతో ఎదుటివారిని ఈజీగా బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుతుంటారు. ఓ మినిస్టర్‌ను బోల్తా కొట్టించబోయి జైలు పాలు అవుతారు విరూపాక్ష, బసవరాజు.
వారు ఉండే జైలుకు సీఏం చెకింగ్ కోసం వస్తుండటంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జైలర్ (రాక్‌లైన్ వెంకటేష్) జాగ్రత్తపడుతుంటాడు. అదే టైమ్‌లో ఓ ఖైదీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు.
తమ మాటల గారడీతో ఆ ఖైదీని విరూపాక్ష, బసవరాజు కాపాడుతారు. విరూపాక్ష, బవసరాజులను జైలర్ ఓ పని కోసం నందికోలూరు అనే ఊరికి పంపిస్తాడు. కరువుకాటకాలతో ఊరిలోని ప్రజలందరూ వలసపోవడంతో కొద్ది మందే ఊరిలో ఉంటారు. ఎమ్మెల్యే (రంగాయన రఘు) కూడా ఊరి ప్రజలపై కక్ష గట్టి మంచి నీటి ట్యాంకర్లు కూడా రాకుండా అడ్డుపడుతుంటాడు.
నందికోలూరుకు బసవరాజు, విరూపాక్షలను జైలర్ ఎందుకు పంపించాడు? ఊరి జాతరను నిర్వహిస్తామని ఎమ్మెల్యేతో చేసిన ఛాలెంజ్‌లో విరూపాక్ష, బసవరాజు విజయం సాధించారా? వలస వెళ్లిన ప్రజలను తిరిగి ఊరికి రప్పించేందుకుఈ ఇద్దరు మిత్రులు వేసిన ప్లాన్ ఏమిటి?
ఊరి పెద్ద రామన్నకు (తనికెళ్ల భరణి) జైలర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? విరూపాక్షను ప్రేమించిన కుసిమి (ప్రియా ఆనంద్) ఆమెను పెళ్లిచేసుకున్నాడా? బసవరాజు ప్రియురాలు కెంపీని (నిశ్వికా నాయుడు) ఊరి ప్రజలు ఎందుకు ద్వేషించారు? అన్నదే కరటక దమనక(Karataka Damanaka Review) మూవీ కథ.
వెరైటీ టైటిల్....
కరటక దమనక ఈ ఏడాది కన్నడంలో టైటిల్‌తోనే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. వెరైటీ టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్‌తో పాటు ప్రభుదేవా హీరోలుగా నటించడంతో డెఫినెట్‌గా సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండొచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ టైటిల్‌లో ఉన్న వైవిధ్యత, క్రియేటివిటీ సినిమాలో భూతద్ధం పెట్టి వెతికిన కనిపించదు.
ఇరవై ఏళ్ల క్రితం కథ...
సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి దర్శకుడు యోగరాజ్ భట్ కరటక దమనక(Karataka Damanaka Review) మూవీని తెరకెక్కించాడు. కరువుకాటకాలతో అల్లాడిపోతున్న ఓ ఊరిని ఇద్దరు ఖైదీలు ఎలా బాగు చేశారు అన్నదే ఈ మూవీ కథ. ఈ కథను నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయారు దర్శకుడు. రాతలోనే కాదు తీతలో కూడా ఈ సినిమా 1990, 2000 దశకంలో వచ్చిన సినిమాలను గుర్తుచేస్తుంది. 20 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమాను ఇప్పుడు చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
నవ్వించని కామెడీ...
ఊరిని బాగు చేయడం కోసం హీరోలు చేసే ప్రయత్నాలు మొత్తం సిల్లీగా ఉంటాయి. ఒక్క సీన్ మెప్పించదు. ఖైదీలైన హీరోలు ఒక్కసారిగా ఎలా మంచివారు అయ్యారన్నది కన్వీన్సింగ్‌గా దర్శకుడు చెప్పలేకపోయాడు. హీరోల ఇద్దరి లవ్ స్టోరీలను, విలన్ ట్రాక్‌ను కామెడీగానే సినిమాలో చూపించాలని అనుకున్నప్పడు ఆ సీన్స్ అయినా బాగా రాసుకోవాల్సింది. ఒక్క కామెడీ సీన్ కూడా నవ్వించదు.
షోలే నుంచి ఇన్‌స్పైర్...
బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ షోలే నుంచి ఇన్‌స్పైర్ అయ్యి హీరోల(Karataka Damanaka Review) పాత్రలను దర్శకుడు రాసుకున్నాడు. కరటక, దమనక పాత్రల్లో శివరాజ్‌కుమార్, ప్రభుదేవా అవుట్‌డేటెడ్ స్టోరీని తమ కామెడీ టైమింగ్‌తో నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డారు. కథలో బలం లేకపోవడంలో వారి కష్టం వృథాగానే మారింది. ఓ పాటలో శివరాజ్‌కుమార్, ప్రభుదేవా డ్యాన్స్ స్టెప్స్ ఆడియెన్స్‌ను అలరిస్తాయి.
తెలుగు యాక్టర్ తనికెళ్లభరణి ఊరి పెద్దగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించాడు. హీరోయిన్లు ప్రియా ఆనంద్, నిశ్వికా నాయుడు పాత్రల గురించి సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. విలన్‌గా పి. రవిశంకర్ మేనరిజమ్స్ డిఫరెంట్‌గా ఉన్న కామెడీ మాత్రం వర్కవుట్ కాలేదు.
కథ లేకుండా స్టార్లు సినిమా చేసినా...
కరటక దమనక అవుట్‌డేటెడ్ కమర్షియల్ మూవీ. కథ లేకుండా ఎంత పెద్ద స్టార్ అయినా సక్సెస్ అందుకోవడం కష్టమే అన్నదానికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా ఈ మూవీని చెప్పొచ్చు.