OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన పాపులర్ కమెడియన్ సినిమా.. 17 నెలల తర్వాత.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-kapil sharma hindi drama movie zwigato ott streaming now on amazon prime video ott after long wait ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన పాపులర్ కమెడియన్ సినిమా.. 17 నెలల తర్వాత.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన పాపులర్ కమెడియన్ సినిమా.. 17 నెలల తర్వాత.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Zwigato OTT Streaming: జ్విగాటో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన సుమారు 17 నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశారు. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన పాపులర్ కమెడియన్ సినిమా.. 17 నెలల తర్వాత.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

పాపులర్ కమెడియన్, హోస్ట్ కపిల్ శర్మ ప్రధాన పాత్రలో జ్విగాటో చిత్రం వచ్చింది. గతేడాది మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ హిందీ డ్రామా మూవీకి నందితా దాస్ దర్శకత్వం వహించారు. ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ ఏజెంట్‍గా పని చేయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. జ్విగాటో మూవీ ఓటీటీలోకి ఎప్పుడూ వస్తుందా అని నిరీక్షణ సాగింది. ఎట్టకేలకు ఇప్పుడు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

స్ట్రీమింగ్ వివరాలివే

జ్విగాటో చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

17 నెలల తర్వాత..

జ్విగాటో మూవీ ఓటీటీలోకి రావడం ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓటీటీ డీల్ జరిగిందా.. అసలు స్ట్రీమింగ్‍కు వస్తుందా అనే అనుమానాలు రేగాయి. చాలా రోజుల పాటు సందిగ్ధత కొనసాగింది. అయితే, ఎట్టకేలకు ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన సుమారు 17 నెలల తర్వాత జ్విగాటో చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది.

జ్విగాటో చిత్రంలో కపిల్ శర్మతో పాటు సహానా గోస్వామి, గుల్ పనాగ్, శాయానీ గుప్తా, స్వనంద్ కిర్కిరే, తుషార్ ఆచార్య కీలకపాత్రలు పోషించారు. నందితా దాస్ ఈ మూవీని కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీకి పాజిటివ్ టాకే వచ్చింది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల పరిస్థితులు, కష్టాలను ఈ చిత్రంలో చూపించారు డైరెక్టర్.

జ్విగాటో మూవీని అప్లాజ్ ఎంటర్‌టైన్‍మెంట్, నందితా దాస్ ఇనిషియేటివ్స్ బ్యానర్లపై సమీర్ నాయర్, దీపక్ సేగల్, నందితా దాస్ నిర్మించారు. ఈ మూవీకి ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్సే వచ్చినా కలెక్షన్లు పెద్దగా రాలేదు. దీంతో కమర్షియల్‍గా ఈ చిత్రం సక్సెస్ సాధించలేకపోయింది. కపిల్ శర్మ నటించడంతో హైప్ క్రియేట్ అయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది.

జ్విగాటో స్టోరీలైన్

భువనేశ్వర్‌లో ఓ ఫ్యాక్టరీలో ఫ్లోర్ మేనేజర్‌గా ఉండే మానస్ సింగ్ (కపిల్ శర్మ) ఉద్యోగం పోతుంది. దీంతో అతడు జ్విగాటో అనే ప్లాట్‍ఫామ్ కోసం ఫుడ్ డెలివరీ ఏజెంట్‍గా పని చేస్తాడు. రేటింగ్‍లు, ఇన్సెటివ్‍లో కోసం ఆరాటపడుతుంటాడు. కుటుంబాన్ని నడిపేందుకు కావాల్సిన డబ్బు కోసం కష్టపడుతుంటాడు. అతడి భార్య ప్రతిమ (సహానా గోస్వామి) కూడా డబ్బు సంపాదించేందుకు వివిధ పనులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితులను వారు ఎలా ఎదుర్కొన్నారనే విషయాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

కపిల్ శర్మ ప్రస్తుతం ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు హోస్ట్ చేస్తున్నారు. ఈ టాక్ షో రెండో సీజన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ప్రతీ శనివారం కొత్త ఎపిసోడ్ వస్తోంది. సినీ సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. దేవర సినిమా ప్రమోషన్ కోసం గత నెలలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా ఈ షోలో సందడి చేశారు.