Kantara Rishab Shetty Costly Car: కాంతారా కాసుల వర్షం.. కాస్ట్‌లీ కారు కొన్న రిషబ్‌ శెట్టి-kantara rishab shetty costly car photos going viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kantara Rishab Shetty Costly Car Photos Going Viral On Social Media

Kantara Rishab Shetty Costly Car: కాంతారా కాసుల వర్షం.. కాస్ట్‌లీ కారు కొన్న రిషబ్‌ శెట్టి

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 09:48 PM IST

Kantara Rishab Shetty Costly Car: కాంతారా మూవీ కాసుల వర్షం కురిపించడంతో ఆ మూవీ డైరెక్టర్‌, హీరో రిషబ్‌ శెట్టి ఓ కాస్ట్‌లీ కారు కొన్నాడు. తమ కొత్త కారు ఫొటోను రిషబ్ భార్య ప్రగతి షేర్‌ చేసింది.

ఆడి క్యూ7 కారుతో రిషబ్ శెట్టి దంపతులు
ఆడి క్యూ7 కారుతో రిషబ్ శెట్టి దంపతులు

Kantara Rishab Shetty Costly Car: కాంతారా మూవీ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కేజీఎఫ్‌ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్‌ అందుకున్న ఈ కన్నడ మూవీతో రిషబ్‌ శెట్టి పెద్ద స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాలో నటించి, తానే దర్శకత్వం వహించాడు రిషబ్‌ శెట్టి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఇప్పటికే రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది.

అయితే రిషబ్ ఓ కాస్ట్‌లీ కారు కొన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. రూ.83 లక్షల విలువైన ఆడి క్యూ7 కారు అది. ఇప్పటికే తన దగ్గర ఉన్న లగ్జరీ కార్ల లిస్ట్‌లో ఇప్పుడీ క్యూ7 చేరింది. ఈ కొత్త కారు అందుకుంటున్న ఫొటోను రిషబ్‌ భార్య ప్రగతి సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. నిజానికి ఈ కారును వీళ్లు జులైలోనే కొన్నట్లు ఫొటోలను చూస్తే తెలుస్తోంది. అయితే ఇప్పుడు కాంతారా మూవీ సూపర్‌ హిట్‌ కావడంతో ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.

ఆడి క్యూ7లో రెండు వేరియెంట్లు ఉంటాయి. అవి టెక్నాలజీ, ప్రీమియం ప్లస్‌. వీటిలో రిషబ్‌ ఏ మోడల్‌ కొన్నాడన్నదానిపై స్పష్టత లేదు. కాంతారా మూవీ అనూహ్య విజయంతో భాషతో సంబంధం లేకుండా ఇండియాలో పెద్ద స్టార్‌గా మారిపోయాడు రిషబ్‌ శెట్టి. ఈ కాంతారా మూవీ 9.4 ఐఎండీబీ రేటింగ్‌తో ఇప్పటి వరకూ ఉన్న ఇండియన్‌ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేసింది.

తెలుగులో కాంతారాను రిలీజ్‌ చేసిన నిర్మాత అల్లు అరవింద్‌.. రిషబ్‌కు మరో ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతారా ఇప్పుడు నిర్మాతలపై కాసుల వర్షం కురిపిస్తోంది. కర్ణాటకలో అయితే కేజీఎఫ్ 2 రికార్డును కూడా బ్రేక్‌ చేసింది. టికెట్ల అమ్మకాల విషయంలో కాంతారా కన్నడ నాట టాప్‌ మూవీగా నిలిచింది. ఇప్పటి వరకూ 80 లక్షల టికెట్లు అమ్ముడవడం విశేషం.

కేజీఎఫ్‌ రెండు పార్ట్‌లు కలిసి కర్ణాటకలో 75 లక్షల టికెట్లే అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌ 30న రిలీజై సంచలనం సృష్టించిన కాంతారాను ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీల్లోనూ రిలీజ్‌ చేశారు. తెలుగులోనూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.