Nithiin Sapthami Gowda: తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న కాంతార హీరోయిన్ - నితిన్‌తో రొమాన్స్
Nithiin Sapthami Gowda: కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. నితిన్ తమ్ముడు సినిమాలో ఈ కన్నడ బ్యూటీ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Nithiin Sapthami Gowda: కాంతార (Kantara) బ్యూటీ సప్తమి గౌడ టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతున్నట్లు సమాచారం. నితిన్‌కు(Nithiin) జోడీగా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. గత ఏడాది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా కన్నడ మూవీ కాంతార నిలిచింది. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ట్రెండింగ్ వార్తలు
తెలుగులో ఇదే పేరుతో రిలీజైన ఈ మూవీ 50 కోట్ల వసూళ్లను రాబట్టి నిర్మాతలకు నాలుగింతల లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టితో పాటు లీలా అనే ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో సప్తమి గౌడ నటనకు ప్రశంసలు దక్కాయి. కాంతార డబ్బింగ్ మూవీతో ప్రేక్షకుల్ని అలరించిన సప్తమి గౌడ తాజాగా తెలుగులో ఓ స్ట్రెయిట్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమ్ముడు సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంతార తరహాలోనే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర ఇదని సమాచారం. సప్తమి గౌడతో పాటు సీనియర్ హీరోయిన్ లయ కూడా తమ్ముడు మూవీలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నితిన్ సోదరిగా లయ కనిపించబోతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు తెలిసింది. తమ్ముడు సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నాడు.కాగా ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు నితిన్. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.