రిషబ్ శెట్టి సినిమ కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్‌ను తుఫానులా తాకింది. ఈ సినిమా వీక్ డేస్ లోనూ నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మైలురాయి దాటేసింది ఈ సినిమా. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన ఫస్ట్ మూవీ కాంతార రికార్డుపై కన్నేసింది కాంతార చాప్టర్ 1.
పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా ఆరో రోజు, మంగళవారం (అక్టోబర్ 7) రూ.33.5 కోట్లు ఖాతాలో వేసుకుంది. అన్ని భాషల్లో కలిసి ఈ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా ఆరు రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్లు రూ.407 కోట్లకు చేరాయి.
కాంతార చాప్టర్ 1 ఇండియా వసూళ్లు చూసుకుంటే ఆరు రోజుల్లో ఈ సినిమా ఇక్కడ రూ.290.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇండియా గ్రాస్ ఏమో రూ.347 కోట్లుగా ఉంది. ఓవర్సీస్ గ్రాస్ రూ.60 కోట్లు. అక్టోబర్ 2న ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది.
కాంతార చాప్టర్ 1 చిత్రం రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్ వారాంతాన్ని మాత్రమే కాకుండా బాహుబలి 2 ను అధిగమించి కర్ణాటకలో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ ఫస్ట్ మండేను కూడా సాధించింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ లో యష్ నటించిన కెజిఎఫ్ చాప్టర్ 2 ను కూడా ఓడించింది.
అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో మూడో స్థానంలో ఉంది కాంతార చాప్టర్ 1. యష్ నటించిన కెజిఎఫ్ చాప్టర్ 1 (ప్రపంచవ్యాప్తంగా రూ. 237 కోట్లు)ను అధిగమించింది. ఇది ఇప్పుడు కాంతార (రూ. 408 కోట్లు), కెజిఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు) సినిమాల వెనుక మాత్రమే ఉంది. ఈ సినిమా కాంతార కలెక్షన్లను ఇవాళ అధిగమించే అవకాశముంది. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 మాత్రమే టాప్ లో ఉండగా, కాంతార చాప్టర్ 1 సెకండ్ ప్లేస్ కు చేరుకుంటుంది.
కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2 న ఇంగ్లీష్, హిందీతో సహా అన్ని ప్రధాన భాషలలో, కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ వంటి అనేక ప్రాంతీయ భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. హోంబలే ఫిల్మ్స్ ప్రకారం, ఈ చిత్రం 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్. ముందుమాటగా పనిచేస్తుంది. కాంతార ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.
సంబంధిత కథనం
టాపిక్