బాక్సాఫీస్ ఊచకోత.. కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల మోత.. నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.200 కోట్లు.. ఓజీ, కేజీఎఫ్ ను దాటి!-kantara chapter 1 collections folk thriller crosses rs 200 cr in four days rishab shetty rukmini vasanth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బాక్సాఫీస్ ఊచకోత.. కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల మోత.. నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.200 కోట్లు.. ఓజీ, కేజీఎఫ్ ను దాటి!

బాక్సాఫీస్ ఊచకోత.. కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల మోత.. నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.200 కోట్లు.. ఓజీ, కేజీఎఫ్ ను దాటి!

కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 4: రిషబ్ శెట్టి సినిమా కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల ఊచ కోత కోస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే రూ.200 కోట్ల కలెక్షన్లు దాటింది.

కాంతార చాప్టర్ 1 పోస్టర్ లో గుల్షన్

కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్: రిషబ్ శెట్టి తన స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లో దేశీయంగా భారీ వసూళ్లు రాబట్టిన కాంతారా చాప్టర్ 1 ఆదివారం కలెక్షన్లు, ఆక్యుపెన్సీని పెంచుకుని భారీ వీకెండ్ వసూళ్లకు సిద్ధమైంది. ఇప్పటికే ఇండియాలోనే రూ.200 కోట్ల కలెక్షన్లను దాటింది ఈ సినిమా.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్

కాంతారా చాప్టర్ 1 ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లో రూ.162.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. శనివారం ఈ చిత్రం దేశీయంగా సుమారు రూ.55 కోట్ల నికర కలెక్షన్లు రాబట్టింది. ఇది శుక్రవారం వచ్చిన రూ.46 కోట్ల కంటే 20% ఎక్కువ. ఆదివారం (అక్టోబర్ 5) ఉదయం ఆటలతో ప్రారంభించి వసూళ్ల వేగం పెరిగింది. సక్నిల్క్ ప్రకారం ఈ చిత్రం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రూ.41.8 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే అంటే నాలుగు రోజుల్లోనే రూ.204.9 కోట్లు రాబట్టింది.

కన్నడ వెర్షన్

పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఇండియా అంతటా థియేటర్లలో జోరు కొనసాగిస్తోంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం కన్నడ వెర్షన్ ఉదయం ఆటలకు 88-89% ఆక్యుపెన్సీ నమోదైంది. విదేశాలలో కూడా కాంతారా చాప్టర్ 1 కలెక్షన్లలో సత్తాచాటుతోంది. మొదటి మూడు రోజుల్లో $3 మిలియన్లకు పైగా వసూళ్లు చేసింది. కాంతారా సినిమా కేజీఎఫ్, లోకాను ఓడించింది.

ఆ సినిమాలను దాటి

కాంతారా చాప్టర్ 1 ఇటీవల విడుదలైన సీతారే జమీన్ పార్ (రూ.167 కోట్లు), ఓజీ (రూ.179 కోట్లు), లోకా చాప్టర్ 1 (రూ.153 కోట్లు) వంటి కొన్ని పెద్ద సినిమాల కలెక్షన్లను దాటేసింది. కానీ కాంతారా చాప్టర్ 1 సాధించిన అతిపెద్ద విజయం ఏమిటంటే కేజీఎఫ్ చాప్టర్ 1 (రూ.185 కోట్లు) దేశీయ వసూళ్లను అధిగమించడం. ఇది కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ.860 కోట్లు), కాంతారా (రూ.310 కోట్లు) తర్వాత భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ కన్నడ చిత్రంగా నిలిచింది.

కాంతారా చాప్టర్ 1 గురించి

2022లో విడుదలై సంచలనం సృష్టించిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా చాప్టర్ 1ని రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదటి చిత్రం జరిగిన వెయ్యి సంవత్సరాల ముందు జరుగుతుంది. రిషబ్‌తో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు నటించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం