కొత్త సినిమాలు వచ్చినా తగ్గని కాంతార చాప్టర్ 1 జోష్.. కలెక్షన్లలో 47% భారీ జంప్.. వరల్డ్ వైడ్ 700 కోట్లు దాటిన వసూళ్లు-kantara chapter 1 collections 47 percent hike despite new movies dude telusu kada k ramp bison competition rishab shetty ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కొత్త సినిమాలు వచ్చినా తగ్గని కాంతార చాప్టర్ 1 జోష్.. కలెక్షన్లలో 47% భారీ జంప్.. వరల్డ్ వైడ్ 700 కోట్లు దాటిన వసూళ్లు

కొత్త సినిమాలు వచ్చినా తగ్గని కాంతార చాప్టర్ 1 జోష్.. కలెక్షన్లలో 47% భారీ జంప్.. వరల్డ్ వైడ్ 700 కోట్లు దాటిన వసూళ్లు

కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కాంతార చాప్టర్ 1 జోరు మాత్రం తగ్గడం లేదు. కలెక్షన్లలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. 17వ రోజు కాంతార మూవీ 47 శాతం కలెక్షన్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.700కు పైగా కోట్లు ఖాతాలో వేసుకుంది.

కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి (X)

కాంతార చాప్టర్ 1 మూవీ కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. థియేటర్లలో ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 జోరు మాత్రం తగ్గడం లేదు. 17వ రోజు ఈ మూవీ వసూళ్లు 47 శాతం పెరగడం విశేషం. శనివారం (అక్టోబర్ 19) ఈ చిత్రం మళ్లీ పుంజుకుంది. డ్యూడ్, తెలుసు కదా, కే ర్యాంప్, బైసన్ లాంటి కొత్త సినిమాలు వచ్చినా కాంతార చాప్టర్ 1 అదరగొడుతూనే ఉంది.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు

అక్టోబర్ 15న గణనీయమైన తగ్గుదల తర్వాత రిషబ్ శెట్టి యాక్షన్ థ్రిల్లర్ కాంతార చాప్టర్ 1 శనివారం నాడు తిరిగి పుంజుకుంది. 2025లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిన ఈ సినిమా, మూడవ వారంలో కూడా జోరు తగ్గించకుండా బ్లాక్‌బస్టర్ దీపావళి వారాంతానికి సిద్ధమవుతోంది. గత మూడు రోజులుగా వరుసగా వసూళ్లలో తగ్గుదల చూసిన తర్వాత శనివారం ఈ పెరుగుదల కనిపించింది.

రూ. 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచి 'ఛావా'ను అధిగమించేందుకు పోటీ పడుతోంది.

ఎన్ని కోట్లంటే?

2022లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చింది కాంతార చాప్టర్ 1. ఈ సినిమా 17వ రోజు ఇండియాలో రూ.12.5 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సినీ పరిశ్రమ ట్రాకర్ సక్నిల్క్ వెల్లడించింది. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టి, ఆల్-టైమ్ రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా కాంతార చాప్టర్ 1 నిలిచింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమా ఇదే.

శనివారం నాటికి ఈ శాండల్‌వుడ్ చిత్రం ఇండియాలో రూ.506.3 కోట్ల నెట్ వ్యాపారం చేసింది. తన ప్రారంభ రోజున రిషబ్ శెట్టి నటించిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 61.85 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రిషబ్ శెట్టి సినిమా కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తోంది.

వారం వసూళ్లు

కాంతార చాప్టర్ 1 వారం వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి. వారం 1: రూ. 337.4 కోట్లు నెట్, వారం 2: రూ. 147.85 కోట్లు నెట్ కలెక్షన్లు. దసరా సందర్భంగా అక్టోబర్ 2న బహుళ భాషలలో విడుదలైన ఈ కన్నడ చిత్రం థియేటర్లలో 16 రోజుల ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా రూ. 694 కోట్ల గ్రాస్ వ్యాపారం చేసింది. ఈ మొత్తంలో రూ. 104.50 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ మార్కెట్ నుండి రాగా, మిగిలిన రూ. 589.50 కోట్ల గ్రాస్ దేశీయ మార్కెట్లో వసూలు చేయబడింది.

ఈ పాన్-ఇండియా చిత్రం 2 వారాల్లో రూ. 717.50 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక పోస్ట్‌లో 'బాక్స్ ఆఫీస్ వద్ద దైవిక తుఫాను 💥💥కాంతార చాప్టర్ 1.. 2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 717.50 కోట్లకు పైగా గ్రాస్ (గ్రాస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్) కలెక్షన్లు దాటి గర్జిస్తోంది' అని పోస్టు చేశారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం