ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా 4 రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు ఖాతాలో వేసుకుంది. రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదలై మొదటి రోజు రూ. 88 కోట్ల వసూళ్లు రాబట్టింది. శుక్రవారం కూడా తన జోరును కొనసాగించి దాదాపు రూ. 65 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు శనివారం 25% వృద్ధితో రూ. 82 కోట్లు వసూలు చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 235 కోట్లు రాబట్టింది.
మూడు రోజుల్లో కాంతార చాప్టర్ 1 సినిమా ఇండియాలో రూ.195 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో రూ. 40 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం (అక్టోబర్ 5) కలెక్షన్లు కలిపి ఈ చిత్రం భారతదేశంలో రూ. 220 కోట్లకు పైగా, విదేశాల్లో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు రూ.300 కోట్లకు చేరువయ్యాయి.
ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం కాంతార చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో మూడవ స్థానంలో నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్ 1 (రూ. 237 కోట్లు)ను అధిగమించింది. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ.1,215 కోట్లు), కాంతార (రూ.408 కోట్లు) తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 మూడవ స్థానంలో ఉంది.
సక్నిల్క్ డేటా ప్రకారం కాంతార చాప్టర్ 1 ఆదివారం రూ.61 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 223.25 కోట్ల మార్కును చేరుకుంది. కాంతార చాప్టర్ 1కి హిందీ, కన్నడ ప్రేక్షకుల నుండి అత్యధిక ఆదరణ లభిస్తోంది. సినిమా 3వ రోజు వరకు హిందీ నుంచి రూ. 50.5 కోట్లు, కన్నడ నుంచి రూ. 47.6 కోట్లు వసూలు చేసింది.
కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీతో పాటు కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ వంటి ప్రధాన భాషల్లో విడుదలైంది. ఈ సినిమా కాంతార ప్రారంభం అని హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ కాంతారకు ప్రీక్వెల్ కు కాంతార చాప్టర్ 1 తెరకెక్కింది. దీనికి రిషబ్ శెట్టినే డైరెక్టర్.
సంబంధిత కథనం