కాంతార చాప్టర్ 1 సంచలనం.. బాహుబలి కలెక్షన్లను దాటేసిన రిషబ్ శెట్టి మూవీ.. 12 రోజుల్లో ఎన్ని కోట్లంటే?-kantara chapter 1 beats bahubali the beginning in world wide gross collections rishab shetty prabhas rajamouli ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కాంతార చాప్టర్ 1 సంచలనం.. బాహుబలి కలెక్షన్లను దాటేసిన రిషబ్ శెట్టి మూవీ.. 12 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

కాంతార చాప్టర్ 1 సంచలనం.. బాహుబలి కలెక్షన్లను దాటేసిన రిషబ్ శెట్టి మూవీ.. 12 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

బాక్సాఫీస్ దగ్గర కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల దండయాత్ర కొనసాగుతోంది. ఈ మూవీ రికార్డుల దుమ్ము దులుపుతోంది. తాజాగా బాహుబలి 1 రికార్డును బ్రేక్ చేసింది కాంతార చాప్టర్ 1.

రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి (PTI)

కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఈ ఫోక్ అడ్వెంచర్ థ్రిల్లర్ రికార్డుల దుమ్ము దులుపుతోంది. కన్నడ పీరియాడ్ యాక్షన్ డ్రామా కాంతార చాప్టర్ 1 ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ బాహుబలి: ది బిగినింగ్ లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల మార్కుకు దగ్గరగా ఉంది.

కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ అప్ డేట్

బాక్సాఫీస్ దగ్గర కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల మోత మోగిస్తోంది. థియేటర్లలో 12వ రోజైన సోమవారం (అక్టోబర్ 14) ఈ సినిమా ఇండియాలో రూ.13.50 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇది ఆదివారం రూ .39.75 కోట్లు సాధించింది. 12 రోజుల్లో కలిసి ఇండియాలో కాంతార చాప్టర్ 1 మూవీ రూ.451.90 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. రూ.542 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

రూ.675 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల దూకుడు కొనసాగుతోంది. ఈ మూవీ విదేశాల్లోనూ అద్భుతంగా ఆడుతోంది. ఉత్తర అమెరికాలో ఘన ప్రదర్శనతో కాంతార చాప్టర్ 1 సినిమా 11 మిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. రెండో వీకెండ్, సోమవారం కలిసి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.146 కోట్లు దక్కించుకుంది. 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.675 కోట్లకు చేరాయి.

బాహుబలి 1ని దాటి

కాంతార చాప్టర్ 1 మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఆల్ టైమ్ అత్యధికంగా వసూళ్లు చేసిన టాప్ 20 భారతీయ చిత్రాలలో ప్రవేశించింది. మంగళవారం నాటికి సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ (రూ.628 కోట్లు), ఎస్ఎస్ రాజమౌళి సినిమా బాహుబలి 1 (రూ.650 కోట్లు)లను అధిగమించి ఈ జాబితాలో 17వ స్థానంలో నిలిచింది. ఇది రెండు చిత్రాల కంటే తక్కువ బడ్జెట్ ను కలిగి ఉండటం ఈ ఘనతను మరింత నమ్మశక్యం కానిదిగా చేస్తుంది.

కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు 2025 లో రెండవ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. చావా (రూ.808 కోట్లు) తర్వాత రెండో స్థానంలో ఉంది.

కాంతార చాప్టర్ 1 గురించి..

రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు సంపాదించిన 2022 బ్లాక్ బస్టర్ కాంతారాకు ప్రీక్వెల్. మొదటి చిత్రం సంఘటనలకు వెయ్యి సంవత్సరాల ముందు సెట్ చేసిన ప్రీక్వెల్ ఇది. దాని కథ, విజువల్స్, ప్రదర్శనలకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం