Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేసింది.. మంచు విష్ణు మూవీలో ప్రభాస్‌ని చూశారా?-kannappa teaser released manchu vishnu prabhas akshay kumar starrer a grand spectacle ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేసింది.. మంచు విష్ణు మూవీలో ప్రభాస్‌ని చూశారా?

Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేసింది.. మంచు విష్ణు మూవీలో ప్రభాస్‌ని చూశారా?

Hari Prasad S HT Telugu
Jun 14, 2024 06:42 PM IST

Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేసింది. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ఊహించినట్లే చాలా గ్రాండ్ గా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ టీజర్ లో ప్రభాస్ తోపాటు ఇతర స్టార్లందరూ క్షణకాలంపాటు మాత్రమే కనిపించారు.

కన్నప్ప టీజర్ వచ్చేసింది.. మంచు విష్ణు మూవీలో ప్రభాస్‌ని చూశారా?
కన్నప్ప టీజర్ వచ్చేసింది.. మంచు విష్ణు మూవీలో ప్రభాస్‌ని చూశారా?

Kannappa Teaser: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. మచ్ అవేడెట్ సినిమాల్లో ఒకటైన ఈ కన్నప్ప టీజర్ శుక్రవారం (జూన్ 14) రిలీజైంది. హైదరాబాద్ లో ఈ టీజర్ ను విష్ణు లాంచ్ చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల టాప్ స్టార్లు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఈ టీజర్లో వాళ్లంతా క్షణకాలం పాటు అలా కనిపించి వెళ్లారు.

కన్నప్ప టీజర్ రిలీజ్

కన్నప్ప మూవీలో మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఊహించినట్లే విజువల్ ఫీస్ట్ గా మూవీ ఉండబోతోందని టీజర్ చూస్తేనే స్పష్టమవుతోంది. శివుడి భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

వాయులింగాన్ని దొంగిలించడానికి ఓ ముఠా ప్రయత్నించడంతో టీజర్ మొదలవుతుంది. ఆ ప్రయత్నం చేసిన వందలాది మందిని ఒకే ఒక్కడు మట్టుబెడతాడు. తిన్నడు అనే పేరు కలిగిన ఆ వ్యక్తే సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న మంచు విష్ణు. టీజర్ లో చాలా వరకు విష్ణుయే కనిపించాడు. ప్రభాస్ తోపాటు మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, కాజల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు ఇలా కనిపించి అలా మాయమయ్యారు.

ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడని టీజర్ ద్వారా మరోసారి కన్ఫమ్ అయింది. ఇక ప్రభాస్ మాత్రం నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కన్నప్ప టీజర్ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో రిలీజైంది.

కన్నప్ప టీజర్‌పై మంచు విష్ణు

ఈ టీజర్ ను మంచు విష్ణు తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. "కన్నప్ప టీజర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. చాలా ఏళ్ల అంకితభావం, శ్రమ తర్వాత ఈ స్టోరీ నిజమైంది. దీనిని మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్ ఫీలయ్యాను. మీరు ఈ అద్భుతమైన సినిమాను చూసి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను" అని విష్ణు అన్నాడు.

ఈ టీజర్ లో పెద్ద పెద్ద స్టార్లందరూ నటిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ టీజర్ రాగానే ఫ్యాన్స్ అందరూ మొదట వాళ్లు ఎక్కడ ఉన్నారన్నదే చూశారు. ఓ అభిమాని అయితే ఏ సమయంలో ఎవరు కనిపించారో చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. 1.24 దగ్గర ప్రభాస్, 1.06 దగ్గర కాజల్, 0.59 దగ్గర మోహన్ లాల్, 1.13 దగ్గర అక్షయ్ కుమార్ కనిపించారంటూ చెప్పడం విశేషం.

కన్నప్ప టీజర్ ను గతంలోనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనికి మంచు విష్ణుతోపాటు మోహన్ బాబు, ప్రభుదేవా వెళ్లారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ కన్నప్ప మూవీపై విష్ణు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ మూవీకి అతడే స్క్రీన్ ప్లే కూడా అందించాడు. మోహన్ బాబు మూవీని నిర్మిస్తున్నాడు.

WhatsApp channel