Kannappa Teaser: మంచు విష్ణు కన్నప్ప మూవీ సెకండ్ టీజర్ శనివారం రిలీజైంది. టీజర్‌లో పాన్ ఇండియన్ స్టార్లు ప్రభాస్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్ కనిపించారు. యుద్ద సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సెకండ్ టీజర్ ఆసక్తిని పంచుతోంది.
మంచు విష్ణుకు చెందిన గూడెంపై శత్రువులు ఎటాక్ చేసినట్లుగా టీజర్‌లో చూపించారు. వాళ్లు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి తేల్చుకుందాం అంటూ మంచు విష్ణు సవాల్ చేసినట్లుగా టీజర్‌లో చూపించారు. ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవతనా అంటూ మంచు విష్ణు చెప్పగానే అక్షయ్‌కుమార్ టీజర్‌లో కనిపించాడు. పరవమశివుడిగా గెటప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. టీజర్ చివరలో ప్రభాస్‌ను పవర్‌ఫుల్ లుక్‌లో చూపించారు. ప్రభాస్ కనిపించే సీన్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.
కన్నప్ప మూవీలో టైటిల్ పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. అతడికెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా కన్నప్ప తెరకెక్కుతోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.బడ్జెట్‌ను మాత్రం మేకర్స్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు. మైథలాజికల్ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. కన్నప్ప సినిమాను మోహన్‌బాబు ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. రెమ్యునరేషన్ లేకుండా ప్రభాస్ ఈ సినిమాలో ఫ్రీగా నటించినట్లు సమాచారం.
కన్నప్ప మూవీలో శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖేష్ కుమార్ గతంలో మహాభారత్ సీరియల్‌కు దర్శకత్వం వహించాడు.
మంచు విష్ణు హిట్టు అందుకొని చాలా కాలమైంది. కన్నప్పపైనే అతడు బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కాగా కొన్నాళ్లుగా సినిమాల కంటే సోదరుడు మంచు మనోజ్‌తో వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్నాడు మంచు విష్ణు.
సంబంధిత కథనం