కన్నప్ప ఓటీటీ రైట్స్ కోసం పోటీ.. కండీషన్స్ పెట్టిన మంచు విష్ణు.. ఎవరికి దక్కేనో ఛాన్స్?-kannappa ott release machu vishnu dream project to stream on this ott platform conditions for digital release prabhas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కన్నప్ప ఓటీటీ రైట్స్ కోసం పోటీ.. కండీషన్స్ పెట్టిన మంచు విష్ణు.. ఎవరికి దక్కేనో ఛాన్స్?

కన్నప్ప ఓటీటీ రైట్స్ కోసం పోటీ.. కండీషన్స్ పెట్టిన మంచు విష్ణు.. ఎవరికి దక్కేనో ఛాన్స్?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయింది. కొన్ని రోజుల్లోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. అయితే ఈ మూవీ కోసం రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయని తెలిసింది. కానీ మంచు విష్ణు కండీషన్లు పెట్టారని టాక్.

కన్నప్ప సినిమాలో మంచు విష్ణు (x/24FramesFactory)

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న భారీ ప్రాజెక్టుల్లో కన్నప్ప ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ ఓటీటీ రైట్స్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయని తెలిసింది.

భారీ హైప్

కన్నప్ప డిజిటల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. ఇటీవల రిలీజైన ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో తిన్నడుగా మంచు విష్ణు నటించారు. మోషన్ బాబు, శరత్ కమార్, ప్రభాస్, ముకేష్ రిషి, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితర స్టార్లు ఈ సినిమాలో నటించారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.

రేసులో ఆ రెండు ఓటీటీలు

రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో కన్నప్ప మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. భారీ తారగణం ఉండటం, స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు కోసం డిమాండ్ ఏర్పడింది. రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం రేసులో పోటీపడుతున్నాయని టాక్. అవి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ అని చెబుతున్నారు. కన్నప్ప ఓటీటీ రైట్స్ కోసం ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీ రేట్ చెల్లించేందుకు రెడీగా ఉన్నాయని టాక్.

విష్ణు కండీషన్లు

అయితే కన్నప్ప ఓటీటీ రిలీజ్ కోసం మంచు విష్ణు రెండు కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి, సూపర్ హిట్ గా నిలిస్తే మాత్రం థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకు రావాలని మంచు విష్ణు అనుకుంటున్నారని టాక్. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్ ప్రకారం నాలుగు వారాల్లో డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చని విష్ణు చెబుతున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఇక సినిమాకు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి డిజిటల్ రైట్స్ రేటును ఫిక్స్ చేస్తామని కూడా మంచు విష్ణు చెప్పారంటా. మరి ఈ కండీషన్లకు ఒప్పుకొని కన్నప్ప మూవీని ఏ ఓటీటీ సొంతం చేసుకుంటుందో చూడాలి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం