Kannappa Movie: “కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు.. ఫినిష్”-kannappa movie trollers will be cursed actor raghu babu comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa Movie: “కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు.. ఫినిష్”

Kannappa Movie: “కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు.. ఫినిష్”

Kannappa Movie: కన్నప్ప చిత్రంపై ట్రోల్స్ రావడంపై ఇప్పటికే మూవీ టీమ్ కొన్నిసార్లు సీరియస్ అయింది. పోలీసులకు ఫిర్యాదుల వరకు వెళ్లింది. అయితే, ఈ విషయంపై ఓ నటుడు తాజాగా కామెంట్లు చేశారు. శాపం తగులుతుందనేలా మాట్లాడారు.

కన్నప్ప సినిమా పోస్టర్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విష్ణు. ఈ మైథాలజీ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తన్నారు. శివుడి పరమభక్తుడు కన్నప్ప పాత్రను విష్ణు పోషించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్‍లాల్, అక్షయ్ కుమార్ కూడా ఈ మూవీలో నటిస్తుండటంతో హైప్ ఎక్కువగా ఉంది. అయితే, కన్నప్ప చిత్రంపై ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈ మూవీలో నటించిన సీనియర్ యాక్టర్ రఘుబాబు తాజాగా కొన్ని కామెంట్లు చేశారు.

శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు

కన్నప్ప సినిమాపై ట్రోల్ చేసే వారు శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారని రఘుబాబు అన్నారు. ఓ ఈవెంట్‍లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు. “ఈ సినిమా గురించి ఏవరైనా ట్రోల్ చేశారంటే.. చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతీ ఒక్కరు ఫినిష్” అని రఘుబాబు అన్నారు.

ట్రోల్స్‌పై ముందు నుంచే సీరియస్

కన్నప్ప ఫస్ట్ టీజర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి. దీనిపై మంచు విష్ణు సీరియస్ అయ్యారు. ట్రోల్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‍కు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం బయటికి వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు కూడా తీసుకున్నట్టు రూమర్లు వచ్చాయి. ట్రోల్స్‌ను సీరియస్‍గా తీసుకుంటామనేలా కన్నప్ప టీమ్ అప్పుడే సంకేతాలు పంపింది. తెలుగులోనే తమ చిత్రంపై ఎక్కువగా నెగెటివిటీ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని ఇటీవల విష్ణు అన్నారు. ఇప్పుడు రఘుబాబు ఏకంగా ట్రోలర్లకు శాపం, ఫినిష్ అంటూ కామెంట్లు చేశారు.

కన్నప్ప చిత్రం నుంచి వచ్చిన తొలి పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డ్యుయెట్‍గా వచ్చిన రెండో సాంగ్‍ మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ చిత్రానికి స్టీఫెన్ దెవాసీ మ్యూజిక్ ఇస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని విడుదల చేస్తామని ఇప్పటికే టీమ్ ప్రకటించింది.

కన్నప్ప చిత్రంలో రుద్ర అనే పాత్ర చేశారు ప్రభాస్. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మలయాళ స్టార్ మోహన్‍లాల్, మంచు మోహన్‍బాబు, శరత్ కుమార్ కీలకపాత్రలు చేశారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది.

కన్నప్ప చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా ఉన్నారు. రూ.100కోట్లకుపైగా బడ్జెట్‍తో ఈ మూవీని రూపొందించినట్టు అంచనా. న్యూజిలాండ్‍లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. కన్నప్పలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయంటూ మంచు విష్ణు చెబుతూ వస్తున్నారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం