భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మూవీ ‘కన్నప్ప’. దీని కోసం మంచు విష్ణు ఎంతో కష్టపడ్డారు. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మరీ ఈ మూవీని తీర్చిదిద్దారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్లు కూడా భాగమయ్యారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ ఫస్ట్ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది కన్నప్ప మూవీ. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో పాన్ ఇండియా సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాకు ఫస్ట్ డే షాక్ తగిలింది. ఇండియాలో ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం కన్నప్ప మూవీ తొలి రోజు ఇండియాలో రూ.9 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.
తెలుగు పౌరాణిక చిత్రం కన్నప్పకు తొలి రోజు మిశ్రమ స్పందనే వచ్చింది. సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం ఈ మూవీ తెలుగు ఆక్యుపెన్సీ 55.89 శాతంగా ఉంది. 16.45% తమిళ ఆక్యుపెన్సీ, 14.56% హిందీ ఆక్యుపెన్సీ, 13.81% కన్నడ ఆక్యుపెన్సీ, 7.20% మలయాళ ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
కన్నప్ప తొలి రోజు ఇండియాలో రూ.9 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. అయితే కాజోల్ నటించిన బాలీవుడ్ మూవీ ‘మా’ వసూళ్లను మాత్రం విష్ణు కన్నప్ప దాటేసింది. శుక్రవారమే రిలీజైన మా సినిమా రూ.4.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మూడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజైన కాజోల్ సినిమా ఇది. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన 'మా' సినిమాను అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
కన్నప్ప సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. వీఎఫ్ ఎక్స్, సినిమా మొదటి భాగం పై విమర్శలు వస్తున్నాయి. కానీ కొంతమంది ప్రేక్షకులు సినిమా సెకండాఫ్ ను ఇష్టపడ్డారు. ఎక్స్ లో ఓ యూజర్.. "మంచు విష్ణు నటన బాగుంది. మోహన్ బాబు, మోహన్ లాల్ మంచి పాత్రలు పోషించారు. బీజీఎం, భక్తి అద్భుతం" అని రాశారు. మరొక యూజర్.. "ప్రభాస్ డైలాగ్స్ కి ప్రేక్షకులు విజిల్స్ కొట్టారు. విష్ణు భావోద్వేగాలను బాగా పోషించాడు. ముఖ్యంగా రెండవ భాగంలో పౌరాణికత, దృశ్యాలు బాగున్నాయి." అని అన్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమాను విష్ణు రాసి, మోహన్ బాబు నిర్మించారు. ఇది హిందూ మతంలోని కన్నప్ప భక్తుని కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రీతి ముఖుందన్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, బ్రహ్మజీ, శివ బాలాజీ, కౌశల్ మండ, రాహుల్ మాధవ్ తదితరులు నటించారు.
సంబంధిత కథనం