ఓటీటీలోకి మరో కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 1500 ఏళ్ల రాజవంశానికి చెందిన నిధి వేట.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-kannada suspense thriller web series maarigallu to stream on zee5 ott from 31st october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి మరో కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 1500 ఏళ్ల రాజవంశానికి చెందిన నిధి వేట.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఓటీటీలోకి మరో కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 1500 ఏళ్ల రాజవంశానికి చెందిన నిధి వేట.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

కన్నడ నుంచి మరోసస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. 1500 ఏళ్ల కిందటి రాజవంశానికి చెందిన నిధి వేట అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.

ఓటీటీలోకి మరో కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 1500 ఏళ్ల రాజవంశానికి చెందిన నిధి వేట.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

కన్నడ నుంచి ఈ ఏడాది మొదట్లో తొలి వెబ్ సిరీస్ వచ్చింది. అయితే ఆ తర్వాత అక్కడి మేకర్స్ నుంచి వరుస వెబ్ సిరీస్ వస్తున్నాయి. తాజాగా మారిగల్లు (Maarigallu) పేరుతో మరో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ అక్టోబర్ 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మారిగల్లు టీజర్, స్ట్రీమింగ్ డేట్

కన్నడ ఇండస్ట్రీ దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి కన్నడ వెబ్ సిరీస్ ఈ 'మారిగల్లు'. తాజాగా బుధవారం (అక్టోబర్ 8) ఓ టీజర్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు. 'మత్స్యగంధ' ఫేమ్ దేవరాజ్ పూజారి దర్శకత్వం వహించిన ఈ షో.. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'అయ్యన మణి', 'శోధ' తర్వాత జీ నెట్‌వర్క్ కోసం రూపొందించిన మూడో కన్నడ ఒరిజినల్. ఈ 6 ఎపిసోడ్‌ల సస్పెన్స్ థ్రిల్లర్ అక్టోబర్ 31 నుండి జీ5 ఓటీటీతోపాటు ఓటీటీప్లే ప్రీమియంలోనూ అందుబాటులోకి రానుంది.

కనుమరుగైన రాజవంశం నిధి వేట

కొంతకాలం కిందట ఈ మారిగల్లు వెబ్ సిరీస్ మొదటి టీజర్ విడుదలయింది. ఇందులో డాలీ ధనంజయ వాయిస్ ఓవర్ ఉంది. అతడు కదంబ రాజవంశం, దాని మొదటి పాలకుడు మయూరవర్మ, అతని వారసుల గురించి, కర్ణాటక చరిత్రలోని ఒక స్వర్ణ యుగం గురించి వివరిస్తాడు.

సంవత్సరాలు గడిచి ఆ సామ్రాజ్యం మసకబారినా.. దాని సంపద కూడా మాయమైపోయిందా లేక ఆ నిధి దాచిపెట్టి ఉందా అన్నది ఈ సిరీస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీజర్ ఒక దాచిన నిధి కోసం జరిగే వేటను సూచిస్తుంది. ఇందులో ప్రవీణ్ తేజ్, ప్రశాంత్ సిద్ధి, గోపాలకృష్ణ దేశ్‌పాండే, రంగాయణ రఘు, నినాద్ హరిత్స తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ కు దేవరాజ్ రచన కూడా చేశారు. సినిమాటోగ్రఫీని ఎస్‌కే రావు అందించగా, సంగీతాన్ని ఎల్‌వి ముత్తు గణేష్ అందించాడు.

అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ షో 90లలో సెట్ చేశారు. ఓ రహస్య నిధి, దానికి కాపుకాసే స్థానిక దేవత మారి.. ఆ నిధి కోసం జరిగే వేట, ఈ క్రమంలో దురాశ అనేది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.

దివంగత పవర్ స్టార్ అభిమానులకు ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో ఏఐ యానిమేటెడ్ వెర్షన్ లో పునీత్ రాజ్ కుమార్ కనిపించడం విశేషం. అతని తండ్రి, దివంగత నటుడు రాజ్ కుమార్ పోషించిన పాత్ర మయూర వర్మ పాత్ర ఇది. ఎంతగానో ఆసక్తి రేపుతున్న ఈ మారిగల్లు వెబ్ సిరీస్ అక్టోబర్ 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం