Suspense Thriller OTT: ఓటీటీలోకి క‌న్న‌డ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ - 90 నిమిషాల ర‌న్‌టైమ్ - సినిమా మొత్తం ఒకే ఇంట్లో!-kannada suspense thriller movie happily married now streaming on nammaflix ott malayalam remake ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suspense Thriller Ott: ఓటీటీలోకి క‌న్న‌డ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ - 90 నిమిషాల ర‌న్‌టైమ్ - సినిమా మొత్తం ఒకే ఇంట్లో!

Suspense Thriller OTT: ఓటీటీలోకి క‌న్న‌డ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ - 90 నిమిషాల ర‌న్‌టైమ్ - సినిమా మొత్తం ఒకే ఇంట్లో!

Nelki Naresh HT Telugu
Published Feb 16, 2025 08:38 AM IST

Suspense OTT: క‌న్న‌డ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ హ్యాపీలీ మ్యారీడ్ ఓటీటీలో రిలీజైంది. న‌మ్మఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీలో పృథ్వీ అంబ‌ర్‌, మాన్వితా కామ‌త్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ల‌వ్ మూవీకి రీమేక్‌గా మ్యాపీలీ మ్యారీడ్ తెర‌కెక్కింది.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఓటీటీ
స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఓటీటీ

Suspense Thriller OTT: క‌న్న‌డ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ హ్యాపీలీ మ్యారీడ్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. న‌మ్మ‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈక‌న్న‌డ మూవీలో పృథ్వీ అంబ‌ర్‌, మాన్వితా కామ‌త్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. సాబు - అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

గంట‌న్న‌ర మాత్ర‌మే…

ఈ క‌న్న‌డ‌ మూవీ ర‌న్ టైమ్ కేవ‌లం గంట‌న్న‌ర మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. హ్యాపీలీ మ్యారీడ్ క‌థ మొత్తం ఒకే అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లోనే సాగుతుంది. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీ క‌న్న‌డంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

మ‌ల‌యాళం రీమేక్‌…

మ‌ల‌యాళంలో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన ల‌వ్ మూవీకి రీమేక్‌గా మ్యాపీలీ మ్యారీడ్ మూవీ రూపొందింది. పెద్ద‌గా మార్పులు చేర్పులు చేయ‌కుండా ఈ సినిమాను తెర‌కెక్కించారు.

హ్యాపీలీ మ్యారీడ్ క‌థ ఏంటంటే?

పెద్ద‌ల‌ను ఎదురించి అనూప్‌ను ప్రేమ‌వివాహం చేసుకుంటుంది దీప్తి. పెళ్లైన కొన్నాళ్ల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. బిజినెస్‌లో లాస్ రావ‌డంతో అనూప్‌ తాగుడుకు బానిస‌గా మారుతాడు. అదే టైమ్‌లో దీప్తి ప్రెగ్నెన్సీ క‌న్ఫామ్ అవుతుంది. అనూప్ మార‌డం క‌ష్ట‌మ‌ని అర్థం చేసుకున్న దీప్తి అత‌డికి దూరంగా వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఈ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. కోపంలో దీప్తిని నెట్టేస్తాడు అనూప్‌.

త‌ల‌కుబ‌లంగా దెబ్బ త‌గ‌ల‌డంతో దీప్తి చ‌నిపోతుంది. భార్య శ‌వాన్ని బాత్‌రూమ్‌లో దాచిపెడ‌తాడు అనూప్‌. ఎవ‌రు చూడ‌కుండా డెడ్‌బాడీని అక్క‌డి నుంచి మాయం చేసేందుకు ప్లాన్స్ వేస్తుంటాడు. అప్పుడే అనూప్ స్నేహితులు అత‌డి ఫ్లాట్‌కు వ‌స్తారు. మ‌రోవైపు దీప్తి చూసేందుకు ఆమె తండ్రి ఇంటికొస్తాడు?

దీప్తి చ‌నిపోయిన విష‌యం వారికి తెలిసిందా? భార్య డెడ్‌బాడీని అనూప్ ఎలా మాయం చేశాడు? అస‌లు నిజంగానే దీప్తి చ‌నిపోయిందా? అనూప్‌కు ఉన్న మాన‌సిక స‌మ‌స్య ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

తెలుగులో...

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ దియాతో శాండ‌ల్‌వుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు పృథ్వీ అంబ‌ర్‌, దూర‌ద‌ర్శ‌న‌, పెంట‌గాన్‌, షుగ‌ర్‌లెస్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. తెలుగులోనూ డియ‌ర్ ఉమ మూవీలో న‌టిస్తోన్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం