Kannada Movie: కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సీతారాం బెనోయ్ కేస్ నంబర్ 18 తెలుగులోకి వచ్చింది. శనివారం యూట్యూబ్‌లో రిలీజైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కన్నడ మూవీలో విజయ్ రాఘవేంద్ర హీరోగా నటించాడు. దేవీ ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించాడు.
2021లో థియేటర్లలో రిలీజైన ఈ కన్నడ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ట్విస్ట్‌లతో పాటు కథ, విజయ్ రాఘవేంద్ర యాక్టింగ్ అభిమానులను మెప్పించాయి. సీతారాం బెనోయ్ మూవీలో అక్షత హీరోయిన్‌గా నటించింది. గగన్ బదేరియా మ్యూజిక్ అందించాడు. విజయ్ రాఘవేంద్ర కెరీర్‌లో 50వ మూవీగా సీతారాం బెనోయ్ రిలీజైంది. ఈ మూవీ కన్నడంతో పాటు తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
సీతారాం బెనోయ్ ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. అరకు పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ మీద వస్తాడు. డ్యూటీలో జాయిన్ అయిన మొదటిరోజే అతడి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే దొంగతనం జరగడం సంచలనంగా మారుతుంది. దొంగల గురించి సీతారామ్ ఇన్వేస్టిగేషన్‌లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి. చాలా ఏళ్లుగా అన్‌సాల్వ్‌డ్‌గా మిగిలిపోయిన కేసు నంబర్ 18కు ఈ దొంగతనాలకు ఎలాంటి లింక్ ఉంది? సీరియల్ మర్డర్ కేసును సీతారామ్ ఎలా ఛేదించాడు అన్నదే సీతారాం బెనోయ్ మూవీ కథ.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన విజయ్ రాఘవేంద్ర కన్నడంలో అరవైకిపైగా సినిమాలు చేశాడు. బెస్ట్ చెల్డ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారిన విజయ్ రాఘవేంద్ర ఖుషి, రుషి, కేస్ ఆఫ్ కొండన్న, టాస్, గోకుల, గోల్‌మాల్, పరమశివతో పాటు పలు సినిమాలతో విజయాలను అందుకున్నాడు.
కన్నడ బిగ్‌బాస్‌లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న విజయ్ రాఘవేంద్ర విన్నర్‌గా నిలిచాడు. డ్రామా జూనియర్స్, డ్యాన్సింగ్ ఛాంపియన్స్‌తో పాటు పలు టీవీ షోస్‌కు జడ్జ్‌గా పనిచేశాడు. యాక్టర్‌గానే కాకుండా సింగర్‌గా, డైరెక్టర్‌గా ప్రతిభను చాటుకున్నాడు.
విజయ్ రాఘవేంద్ర హీరోగా నటించిన ఎఫ్ఐఆర్ 6 టూ 6 అనే మూవీ ఇటీవలే రిలీజైంది. ప్రస్తుతం రిప్పన్ స్వామీ పేరుతో ఓ బ్లాక్ క్రైమ్ కామెడీ మూవీ చేస్తోన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్